హోమ్ ఈ వీడియోలో నృత్యం చేస్తున్న వ్యక్తి ఆంధ్ర ప్రదేశ్ అదనపు అడ్వకేట్ జనరల్ కాదు

ఈ వీడియోలో నృత్యం చేస్తున్న వ్యక్తి ఆంధ్ర ప్రదేశ్ అదనపు అడ్వకేట్ జనరల్ కాదు

ద్వారా: రాజేశ్వరి పరస

సెప్టెంబర్ 28 2023

ఈ కథనాన్ని షేర్ చెయ్యండి: facebook logo twitter logo linkedin logo
ఈ వీడియోలో నృత్యం చేస్తున్న వ్యక్తి ఆంధ్ర ప్రదేశ్ అదనపు అడ్వకేట్ జనరల్ కాదు ఆంధ్ర ప్రదేశ్ అదనపు అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి గురించి చేసిన క్లైమ్స్ స్క్రీన్ షాట్స్ (సౌజన్యం:ఎక్స్/స్క్రీన్ షాట్)

ఫ్యాక్ట్ చెక్స్

తీర్పు అబద్ధం

ఈ వీడియోలో ఉన్నతను తానెవరనేది లాజికల్లీ ఫ్యాక్ట్స్ కి ధృవీకరించారు. ఇందులో ఉన్నది ఆంధ్ర ప్రదేశ్ అదనపు అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి కాదు.

క్లైమ్ ఏంటి?

తెలుగు పాటకి వ్యక్తి నృత్యం చేస్తున్న వీడియో ఒకటి షేర్ చేసి ఈ వ్యక్తి ఆంధ్ర ప్రదేశ్ అదనపు అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి అని క్లైమ్ చేశారు. తెలుగు దేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని నైపుణ్యాభివృద్ధి కేసులో అరెస్ట్ చేశారు. ఈ కేసులో ఆంధ్ర ప్రదేశ్ సిఐడి తరుపున సుధాకర్ రెడ్డి అవినీతి నిరోధక శాఖ న్యాయస్థానంలో వాదిస్తున్నారు. 

చంద్రబాబు నాయుడికి విజయవాడలోని అవినీతి నిరోధక శాఖ న్యాయస్థానం అక్టోబర్ 5 వరకు జ్యుడీషియల్ రిమాండ్ విధించింది.  తాను ముఖ్యమంత్రిగా ఉన్న 2014-2019 మధ్యలో నైపుణ్యాభివృద్ధి పధకంలో ఆవినీతికి పాల్పడ్డారు అనేది ఆయన మీద ఆరోపణ. 

ఈ క్లిప్ 2016 లో సుధాకర్ రెడ్డి నాట్యం చేస్తున్న క్లిప్ అని సామాజిక మాధ్యమలలో క్లైమ్ చేశారు. ఆ పోస్ట్స్ ఆర్కైవ్స్ ఇక్కడ ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు. 

వైరల్ క్లైమ్ స్క్రీన్ షాట్ (సౌజన్యం: ఫేస్బుక్/స్క్రీన్ షాట్)

అయితే ఈ క్లైమ్ అబద్ధం. ఈ వీడియోలో ఉన్న వ్యక్తి పబ్బా సైదులు అనే సామాజిక మాధ్యమ యూజర్.

వాస్తవం ఏమిటి?

ఈ క్లైమ్ కి సంబంధించి ఎక్స్ (పూర్వపు ట్విట్టర్) లో పెట్టిన ఒక పోస్ట్ కి కింద పెట్టిన కామెంట్స్ చూసినప్పుడు ఒక యూజర్ సైదులు తన ఫేస్బుక్ లో అప్లోడ్ చేసిన ఇదే వీడియో లింక్ పోస్ట్ చేశారు. అయితే ఈ కామెంట్ స్క్రీన్ షాట్ ఇక్కడ పెట్టడం లేదు. ఎందుకు అంటే ఈ కామెంట్ అంతా కూడా అసభ్యకరమైన భాషలో ఉంది.

సైదులుని లాజికల్లీ ఫ్యాక్ట్స్ సంప్రదించింది. “ఈ వీడియోని నేను ఖమ్మం జిల్లాలోని మా ఊర్లో సెప్టంబర్ 5 నాడు రికార్డ్ చేశాను. రికార్డ్ చేసి నా ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్ లో పోస్ట్ చేశాను. నేను ఒక కిరాణా కొట్టు నడుపుతుంటాను. ఖాళీ సమయంలో ఇలా రీల్స్ చేస్తుంటాను”, అని లాజికల్లీ ఫ్యాక్ట్స్ తో మాట్లాడుతూ సైదులు తెలిపారు. ఇదే వీడియో ఆయన ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్ లో మాకు కనిపించింది. సైదులు తన ఫేస్బుక్ లో తాను నాట్యం చేస్తున్న రీల్స్ అప్లోడ్ చేశారు.

పొన్నవోలు సుధాకర్ రెడ్డి 2016 నాటి ఫొటో ఒకటి మాకు వై ఎస్ ఆర్ కాంగ్రెస్ వెబ్సైట్ లో దొరికింది. ఈ ఫొటోని, వీడియోలో నాట్యం చేస్తున్న వ్యక్తి ఫొటోని పోల్చి చూశాము. 

అదనపు అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి, పబ్బా సైదుల ఫొటోల మధ్య పోలిక (సౌజన్యం: YSRCongress.com/ఫేస్బుక్/పబ్బా సైదులు)

దీని బట్టి ఆ వీడియోలో ఉన్నది తెలంగాణలోని ఖమ్మం జిల్లాకి చెందిన పబ్బా సైదులు అని, అందులో ఉన్నది అదనపు అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి కాదని స్పష్టమవుతున్నది.

తీర్పు

ఈ వీడియోలో ఉన్నది ఒక సామాజిక మాధ్యమ యూజర్. ఆ వ్యక్తి  పొన్నవోలు సుధాకర్ రెడ్డి కాదు.  కాబట్టి ఈ క్లైమ్ అబద్ధం అని నిర్ధారించాము.     

 

(అనువాదం- గుత్తా రోహిత్)

 

 

ఫ్యాక్ట్ చెక్ కోసం ఏదైనా క్లైమ్ మాకు సబ్మిట్ చేయదలుచుకుంటున్నారా లేదా మా సంపాదక బృందాన్ని సంప్రదించదలుచుకుంటున్నారా?

0 అంశాల వారీగా అన్వేషించండి

మన జీవితాలని ప్రభావితం చేసే నిర్ణయాలని మనం మనకి అందుబాటులో ఉన్న సమాచారం మేరకు తీసుకుంటాము. అయితే ఇంటర్నెట్ స్వభావరీత్యా తప్పుడు సమాచారం ఇప్పటివరకు కనీవినీ ఎరుగని రీతిలో ప్రజలకి చేరుతున్నది.