హోమ్ వీడియోలో బెల్లీ డాన్స్ చేస్తూ కనిపిస్తుంది ఉక్రెయిన్ రాష్ట్రపతి వోలోదిమిర్ జెలెన్స్కి కాదు

వీడియోలో బెల్లీ డాన్స్ చేస్తూ కనిపిస్తుంది ఉక్రెయిన్ రాష్ట్రపతి వోలోదిమిర్ జెలెన్స్కి కాదు

ద్వారా: రాజేశ్వరి పరస

సెప్టెంబర్ 25 2023

ఈ కథనాన్ని షేర్ చెయ్యండి: facebook logo twitter logo linkedin logo
వీడియోలో బెల్లీ డాన్స్ చేస్తూ కనిపిస్తుంది ఉక్రెయిన్  రాష్ట్రపతి వోలోదిమిర్  జెలెన్స్కి కాదు సామాజిక మధ్యమలలో వైరల్ అవుతున్న క్లెయిమ్. (సౌజన్యం: X/ఫేస్బుక్/స్క్రీన్ షాట్/లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఎడిటింగ్)

ఫ్యాక్ట్ చెక్స్

తీర్పు అబద్ధం

వీడియోలో ఉన్నది అర్జెంటీనా నృత్యకారుడు పాబ్లో అకోస్టా, ఉక్రెయిన్ రాష్ట్రపతి వొలోదిమిర్ జెలెన్స్కి కాదు

క్లెయిమ్ ఏమిటి? 

సామాజిక మాధ్యమాలలో ఉక్రెయిన్ రాష్ట్రపతి జెలెన్స్కి నృత్యం చేస్తున్నాడు అంటూ ఒక వీడియో వైరల్ అయ్యింది. ఈ చిన్న వీడియో క్లిప్ ని X (ఇంతకుమునుపు ట్విటర్), టిక్ టాక్, ఫేస్బుక్, మరియు యూట్యూబ్ లాంటి వేదికలలో కూడా యూజర్స్ షేర్ చేశారు. (ఆర్కైవ్ లింక్స్ ఇక్కడ, ఇక్కడ,ఇక్కడ, మరియు ఇక్కడ)

అలాంటి ఒక పోస్ట్ X లో ఈ శీర్షిక తో వీడియో షేర్ చేశారు, “ఇతడు జెలెన్స్కి. ఇతడు ఎప్పుడైనా ఎప్స్టీన్ ఐలాండ్ కి వెళ్ళి ఉంటాడా అని అనుకుంటున్నాను.” ఇలాంటివే మరిన్ని పోస్ట్ లు ఉక్రెయిన్ రాష్ట్రపతి ని వెక్కిరిస్తూ సామాజిక మాధ్యమాలలో వచ్చాయి. 

సామాజిక మధ్యమలలో వైరల్ అవుతున్న క్లెయిమ్. (సౌజన్యం: X/ఫేస్బుక్/స్క్రీన్ షాట్/లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఎడిటింగ్)

జెలెన్స్కి రాజకీయాలలోకి రాక మునుపు టీవిలో  పని చేసేవారు, మరియు కమెడియన్ గా కూడా చేశారు, కానీ ఇప్పుడు వైరల్ అవుతున్న వీడియో లో ఉన్నది మాత్రం పాబ్లో అకోస్టా అనే అర్జెంటీనా నృత్యకారుడు. 

వాస్తవం ఏమిటి?

ఈ వైరల్ క్లిప్ లోని కి ఫ్రేమ్స్ ను రివర్స్ ఇమేజ్ సెర్చ్ ద్వారా వెతికితే, ఇలాంటి వ్యాఖ్యలతోనే ఇది జులై 2023 నుండి సామాజిక మాధ్యమాలలో ఉందని అర్దమయ్యింది. X లో, టిక్ టాక్ లో, యూట్యూబ్ లో ఇది జులై 2023 లో కూడా ఉంది. 

జులై 2023 లోని స్క్రీన్ షాట్ (సౌజన్యం: X/స్క్రీన్ షాట్)

ఇంకాస్త పరిశోధన చేస్తే, ఈ వీడియో, “pabloacostabellydance” అనే ఇన్స్టాగ్రామ్ యూజర్ షేర్ చేసినట్టు తెలుస్తుంది. ఆ ఇన్స్టాగ్రామ్ అకౌంటు లో అతడి బయో లో పాబ్లో అకోస్టా, అర్జెంటీనా లోని టుకుమాన్ కు సంబంధించిన వాడు అని, అతడు నృత్యకారుడు, ఉపాధ్యాయుడు మరియు కొరియోగ్రాఫర్ అని రాసి ఉంది. అతడి ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ లో ఇప్పుడు వైరల్ అవుతున్న వీడియోలో మాదిరిగానే ఉన్న వస్త్రధారణ తో మరిన్ని వీడియోలు ఉన్నాయి. 

పాబ్లో అకోస్టా ఇంస్టాగ్రామ్ నుండి స్క్రీన్ షాట్( సౌజన్యం : ఇంస్టాగ్రామ్//pablocostabellydance)

వైరల్ వీడియోని, పాబ్లోఅకోస్టా షేర్ చేసిన వీడియోలని పోల్చి చూస్తే, ఆ రెండూ ఒకటే అని అర్దమవుతుంది. అలాగే, వైరల్ వీడియో లో ఉన్న మొఖం జెలెన్స్కి మాదిరిగాను, అసలు వీడియోలో అకోస్టా లాగాను ఉంది. 

వైరల్ వీడియో మరియు పాబ్లో అకోస్టా వీడియో స్క్రీన్ షాట్ (సౌజన్యం: X/ఇంస్టాగ్రామ్/స్క్రీన్షాట్)

ఫిబ్రవరి 2022 లో రష్యా ఉక్రెయిన్  మీద దాడి చేసినప్పటి నుంచి, వొలోదిమిర్ జెలెన్స్కి మీద ఇలాంటి వ్యాఖ్యలు ప్రచారం లో ఉన్నాయి.  లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఇలాంటి కథనాలను ఇంతకుమునుపు కూడా ఫ్యాక్ట్ చెక్ చేసింది. 

తీర్పు 

వీడియోలో ఉన్నది అర్జెంటీనా నృత్యకారుడు పాబ్లో అకోస్టా, ఉక్రెయిన్  రాష్ట్రపతి వొలోడిమిర్ జెలెన్స్కి కాదు. అకోస్టా తన ఇన్స్టాగ్రామ్ అకౌంటులో ఇలాంటి వస్త్రధారణలోనే మరిన్ని వీడియోలో కూడా షేర్ చేశారు. ఇప్పుడు వైరల్ అవుతున్న వీడియో ఎడిట్ చేయబడినది అయి ఉండవచ్చు. కనుక మేము దీనిని అబద్దం అని నిర్ధారించాము. 

ఫ్యాక్ట్ చెక్ కోసం ఏదైనా క్లైమ్ మాకు సబ్మిట్ చేయదలుచుకుంటున్నారా లేదా మా సంపాదక బృందాన్ని సంప్రదించదలుచుకుంటున్నారా?

0 అంశాల వారీగా అన్వేషించండి

మన జీవితాలని ప్రభావితం చేసే నిర్ణయాలని మనం మనకి అందుబాటులో ఉన్న సమాచారం మేరకు తీసుకుంటాము. అయితే ఇంటర్నెట్ స్వభావరీత్యా తప్పుడు సమాచారం ఇప్పటివరకు కనీవినీ ఎరుగని రీతిలో ప్రజలకి చేరుతున్నది.