హోమ్ కంగనా రనౌత్ ని 'కొట్టిన' సిఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ తో రాహుల్ గాంధీ ఫొటో దిగలేదు

కంగనా రనౌత్ ని 'కొట్టిన' సిఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ తో రాహుల్ గాంధీ ఫొటో దిగలేదు

ద్వారా: రాహుల్ అధికారి

జూన్ 18 2024

ఈ కథనాన్ని షేర్ చెయ్యండి: facebook logo twitter logo linkedin logo
కంగనా రనౌత్ ని 'కొట్టిన' సిఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ తో రాహుల్ గాంధీ ఫొటో దిగలేదు రాహుల్ గాంధీ కంగనా రనౌత్ ని కొట్టిన సిఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ కుల్విందర్ కౌర్ తో ఫొటో అంటూ వైరల్ అయిన సోషల్ మీడియా క్లెయిమ్ స్క్రీన్ షాట్ (సోర్స్ : ఫేస్బుక్/లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఎడిటింగ్)

ఫ్యాక్ట్ చెక్స్

అబద్ధం

రాహుల్ గాంధీతో పాటు ఫొటోలో ఉన్న వ్యక్తి రాజస్థాన్ కి చెందిన మాజీ ఎమ్మెలే, కంగనా రనౌత్ పై దాడి చేసిన కానిస్టేబుల్ కాదు.

క్లెయిమ్ ఏమిటి? 

కంగనా రనౌత్ పై దాడి చేసిన సిఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ కుల్విందర్ కౌర్ రాహుల్ గాంధీతో దిగిన ఫొటో అంటూ సామాజిక మాధ్యమాలలో ఒక ఫొటో వైరల్ అవుతుంది. భారతీయ జనతా పార్టీ తరపున ఎన్నికైన శాసనసభ్యురాలు కంగనా రనౌత్ పై సి ఐ ఎస్ ఎఫ్ కానిస్టేబుల్ దాడి నేపధ్యంలో ఈ ఫొటో వైరల్ అవ్వటం మొదలయ్యింది.

వైరల్ అవుతున్న ఫొటోలో కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ మరియు సోనియా గాంధీ తో పాటుగా మరో మహిళ ఉన్నారు, ఈవిడను సిఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ అంటూ తప్పుగా ప్రచారం చేస్తున్నారు. వివిధ సామాజిక మాధ్యమాలలో అనేక మంది యూజర్లు ఈ ఫోటోని షేర్ చేస్తూన్నారు. ఒక ఫేస్బుక్ యూజర్ ఈ ఫొటో గురించి మాట్లాడుతూ, “ఇప్పుడు కుల్విందర్ కౌర్ గురించి నిజం బయటకి వచ్చింది. కంగనా రనౌత్ చెప్పింది నిజమే, వీళ్ళు కనీసం వంద రూపాయలకి కుడా పనికిరారు,” అని వ్యాఖ్యానించారు. ఆర్కైవ్ చేసిన పోస్టులను ఇక్కడ, ఇక్కడ మరియి ఇక్కడ చూడవచ్చు.

సామాజిక మాధ్యమాలలో ఉన్న పోస్టుల స్క్రీన్ షాట్లు (సౌజన్యం : ఫేస్బుక్/లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఎడిటింగ్)

కానీ ఈ క్లెయిమ్ అబద్ధం. ఆ ఫొటోలో ఉన్న మహిళ రాజస్థాన్ కి చెందిన మాజీ శాసనసభ్యురాలు. కంగనా రనౌత్ పై దాడి చేసిన కానిస్టేబుల్ కౌర్ కాదు.

మేము ఎలా కనుగొన్నాము?

రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, వైరల్ ఫొటోలో ఉన్నది దివ్య మహిపాల్ మదెర్న అని, ఈవిడ రాజస్థాన్ కి చెందిన కాంగ్రెస్ మాజీ శాసనసభ్యురాలు అని తెలుసుకున్నాము, మదెర్న తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ (ఆర్కైవ్ ఇక్కడ) లో ఫిబ్రవరి 14, 2024 న ఈ ఫోటో షేర్ చేసి రాహుల్ గాంధీకి మరియు ప్రియాంక గాంధీకి స్వాగతం అని పేర్కొంది. మదెర్న 2018 రాజస్థాన్ ఎన్నికలలో శాసనసభ్యురాలిగా గెలిచింది. తరువాత 2023 లో తో బీజేపీ అభ్యర్థి పై ఓడిపోయింది.

వైరల్ ఫొటోతో పాటు, కాంగ్రెస్ నేతలతో కలిసి ఉన్న ఇంకో రెండు ఫొటోలని కుడా తన ఎక్స్ అకౌంట్ లో ఫిబ్రవరి 14, 2024 నాడు షేర్ చేసారు (ఆర్కైవ్ ఇక్కడ). ఫొటోలతో పాటుగా రాజస్థాన్ నుండి రాజ్యసభకు కాంగ్రెస్ తరపున నామినేషన్ వేస్తున్న సోనియా గాంధీకి అభినందనలు కుడా తన పోస్టులో తెలిపారు.

ది హిందూ కథనం ప్రకారం, సోనియా గాంధీ రాజ్యసభ నామినేషన్ పేపర్లను ఫిబ్రవరి 14 నాడు రాజస్థాన్ లో దాఖలు చేసారు. ఇందులో రాహుల్ గాంధీ మరియు సోనియా గాంధీ కూడా పాల్గొన్నారు అని ఉంది.

మదెర్న తన ఎక్స్ అకౌంట్ (ఆర్కైవ్ ఇక్కడ) వైరల్ ఫొటోలో ఉన్నది తానేనని కౌర్ కాదని కుడా పేర్కొంటూ, బీజేపీ పార్టీ తప్పుడు ప్రచారం చేస్తుంది అని ఆరోపించారు. ఈ ఫోటోని రాజస్థాన్ లో సోనియా గాంధీ తన రాజ్యసభ నామినేషన్ దాఖలు చేయడానికి వెళ్లిన సందర్భంలోనిది అని తెలిపారు.

పైగా, కౌర్ ఫొటోని వైరల్ ఫొటోలో ఉన్న వ్యక్తిని పోల్చి చూస్తే ఇద్దరు వేరువేరని అర్దమవుతుంది. 

వైరల్ ఫోటో మరియు సి ఐ ఎస్ ఎఫ్ కానిస్టేబుల్ కౌర్ ఫొటోకి మధ్య పోలిక 

తీర్పు

వైరల్ ఫొటోలో ఉన్నది కాంగ్రెస్ మాజీ శాసనసభ్యురాలు దివ్య మహిపాల్ మదెర్న ఆమె రాజస్థాన్ లో ఫిబ్రవరి 14 న సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ మరియు రాహుల్ గాంధీ తో ఫొటో దిగారు. ఆవిడని తప్పుగా సిఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ కుల్విందర్ కౌర్  అని క్లైమ్ చేశారు.

0 అంశాల వారీగా అన్వేషించండి

మన జీవితాలని ప్రభావితం చేసే నిర్ణయాలని మనం మనకి అందుబాటులో ఉన్న సమాచారం మేరకు తీసుకుంటాము. అయితే ఇంటర్నెట్ స్వభావరీత్యా తప్పుడు సమాచారం ఇప్పటివరకు కనీవినీ ఎరుగని రీతిలో ప్రజలకి చేరుతున్నది.