హోమ్ గ్లాసులో మద్యం పోసుకుంటున్న వ్యక్తి ఉత్తరప్రదేశ్ లో పోలీస్ స్టేషన్ ఇంఛార్జ్ కాదు

గ్లాసులో మద్యం పోసుకుంటున్న వ్యక్తి ఉత్తరప్రదేశ్ లో పోలీస్ స్టేషన్ ఇంఛార్జ్ కాదు

ద్వారా: రోహిత్ గుత్తా

ఆగస్టు 10 2023

ఈ కథనాన్ని షేర్ చెయ్యండి: facebook logo twitter logo linkedin logo
గ్లాసులో మద్యం పోసుకుంటున్న వ్యక్తి ఉత్తరప్రదేశ్ లో పోలీస్ స్టేషన్ ఇంఛార్జ్ కాదు

ఫ్యాక్ట్ చెక్స్

తీర్పు అబద్ధం

ఫొటోలో ఉన్న వ్యక్తి పోలీసు కాదని పోలీసులు, స్థానిక విలేఖరులు నిర్ధారించారు. ఈ ఫొటో తీసేనాటికి ఆ వ్యక్తి వేరే కేసులో అరెస్ట్ అయి ఉన్నాడు.

నేపధ్యం

ఒక వ్యక్తి కుర్చీలో కూర్చొని గ్లాసులో మద్యం పోసుకుంటున్న ఫొటో ఒకటి సామాజిక మాధ్యమాలలో వైరల్ అయ్యింది. ఈ వ్యక్తి ఉత్తర్ ప్రదేశ్ లోని సహరన్పూర్ లోని ఖతా ఖేరీ ఔట్ పోస్ట్ ఇంఛార్జ్ అని ఈఫొటో షేర్ చేసినవాళ్ళు రాసుకొచ్చారు. “కుర్చీలో కూర్చుని మద్యంతో పాటు ‘తినుబండారాలు’ ఆస్వాదిస్తున్న ఈ పెద్దమనిషి పేరు “ఇమ్రాన్”. ఈ వ్యక్తి సహరన్పూర్ లో ఖతా ఖేరీ ఔట్ పోస్ట్ ఇంఛార్జ్”, అని  ఒక యూజర్ (@imMRaghav) మే 11 నాడు ట్విట్టర్ లో రాసుకొచ్చారు . ఈ ట్వీట్ కి 6,800 వ్యూస్, 170 కి పైగా రీట్వీట్లు ఉన్నాయి. అనేకమంది ఇదే క్లైమ్ తో ఇదే ఫొటో ట్వీట్ చేశారు.

వాస్తవం

మే 12, 2023 నాడు ఇండియా టుడే వెబ్సైట్ లో ఈ ఫొటో ప్రచురించారని మేము తెలుసుకున్నాము. ఈ వార్తా కథనం ప్రకారం సహరన్పూర్ లోని ఖతా ఖేరీ పోలీస్ స్టేషన్లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఫొటోలో కుర్చీలో కూర్చుని మద్యం సేవిస్తున్న వ్యక్తి పేరు ఇమ్రాన్. అయితే ఈ వ్యక్తి వృత్తి గురించి మాత్రం ఈ కథనంలో ఏమీ లేదు. ఈ ఘటనకి సంబంధించి ఈ పోలీస్ స్టేషన్ ఇంఛార్జ్ సచిన్ త్యాగిని సస్పెండ్ చేశారు అని ఈ కథనంలో పేర్కొన్నారు. 

ఇదే ఫొటోని వార్తా సంస్థ ‘భారత్ సమాచార్’ మే 11 నాడు ట్వీట్ చేసింది. సహరన్పూర్ జిల్లాలో  ఒక పోలీసు అవుట్ పోస్ట్ లో ఈ ఘటన చోటు చేసుకుంది అని ఈ సంస్థ పేర్కొంది. ఈ ట్వీట్ కి సహనరన్పూర్ పోలీసు విభాగం జవాబు ఇచ్చింది. ఈ ఫొటోలో ఉన్న వ్యక్తి మీద మండి పోలీస్ స్టేషన్ లో  కేసు నమోదు చేశామని, ఆ పోలీస్ స్టేషన్ ఇంఛార్జ్ ని “నిర్లక్ష్యం కారణంగా సస్పెండ్ చెయ్యటం” జరిగిందని వాళ్ళు తెలిపారు. 

అలాగే సహరన్పూర్ జిల్లా ఎస్. పి అభిమన్యు మాంగ్లిక్ ని మేము సంప్రదించాము. ఈ నిందితుడు పోలీసు అధికారి కాదని ఆయన స్పష్టం చేశారు. “ఈ ఘటన ఈ సంవత్సరం మార్చ్ నెలలో ఖతా ఖేరీ పోలీస్ స్టేషన్ లో జరిగింది. ఈ ఫొటోలోని వ్యక్తి పోలీసు అధికారి కాదు”, అని మాంగ్లిక్ లాజికల్లీ ఫ్యాక్ట్స్ కి తెలిపారు. “ఈ ఘటనకి సంబంధించి ఖతా ఖేరీ పోలీస్ స్టేషన్ ఇంఛార్జ్ ని సస్పెండ్ చేశాము”, అని ఆయన తెలిపారు. 

ఫొటోలోని వ్యక్తి ఇమ్రాన్ అని, సహరన్పూర్ జిల్లా వాసి అని స్థానిక విలేఖరి సంకల్ప్ నేబ్ మాకు తెలిపారు.  “సచిన్ త్యాగి కుర్చీలో కూర్చుని ఈ వ్యక్తి మద్యం సేవించాడు”, అని నేబ్ తెలిపారు. పోలీసు స్టేషన్ లో కుర్చీలో కూర్చుని ఉన్న ఫొటో నాటికి ఇమ్రాన్ మీద ఒక కేసు పెండింగ్ లో ఉందని, ఈ ఘటన తరువాత ఆ కేసులో తనని అరెస్ట్ చేశారని నేబ్ తెలిపారు. 

తీర్పు

పోలీస్ స్టేషన్ లో కూర్చుని మద్యం తాగుతున్న ఫొటోలోని వ్యక్తి పేరు ఇమ్రాన్. అతను సహరన్పూర్ లో ఖతా ఖేరీ నివాసి. ఈ వ్యక్తి పోలీసు కాదని స్థానిక విలేఖరి, ఆలాగే జిల్లా ఎస్. పి నిర్ధారించారు. కాబట్టి ఈ క్లైమ్ తప్పని మేము నిర్ధారిస్తున్నాము.  

 

ఫ్యాక్ట్ చెక్ కోసం ఏదైనా క్లైమ్ మాకు సబ్మిట్ చేయదలుచుకుంటున్నారా లేదా మా సంపాదక బృందాన్ని సంప్రదించదలుచుకుంటున్నారా?

0 అంశాల వారీగా అన్వేషించండి

మన జీవితాలని ప్రభావితం చేసే నిర్ణయాలని మనం మనకి అందుబాటులో ఉన్న సమాచారం మేరకు తీసుకుంటాము. అయితే ఇంటర్నెట్ స్వభావరీత్యా తప్పుడు సమాచారం ఇప్పటివరకు కనీవినీ ఎరుగని రీతిలో ప్రజలకి చేరుతున్నది.