ద్వారా: రాజేశ్వరి పరస
ఏప్రిల్ 17 2024
మాధవి లత ఒక డిజిటల్ ప్రార్ధన పరికరాన్ని ఇంటర్వ్యూలో వాడారు, ఆవిడ తరచూగా అది చేతులో ఉంచుకుంటారు. ఇతర ఇంటర్వ్యూలలో కుడా మనం ఇది చూడవచ్చు.
క్లెయిమ్ ఏమిటి ?
హైదరాబాద్ నుండి భారతీయ జనతా పార్టీ లోక్ సభ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మాధవి లత ఒక న్యూస్ చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ లో టెలిప్రాంప్టర్ వాడారు అని సామాజిక మాధ్యమాలలో పోస్ట్లు వైరల్ అయ్యాయి.
ఇండియా టివి న్యూస్ చానల్ లోని ఆప్ కి అదాలత్ కార్యక్రమం యాంకర్ రజత్ శర్మతో మాధవి లత ఇంటర్వ్యూలో నుండి పలు స్క్రీన్ షాట్స్ తీసుకుని కొంత మంది యూజర్లు ఆవిడ చేతిలో ఉన్న పరికరాన్ని చూపి ఇక్కడ ఆవిడ రిమోట్ కంట్రోల్ టెలిప్రాంప్టర్ వాడుతున్నారు అని తెలిపారు (ఆర్కైవ్ ఇక్కడ) ఆవిడ ముందే లిఖించి ఉన్న స్క్రిప్ట్ నుండి తన జవాబులు ఇంటర్వ్యూ లో చెప్తుంది అని అంటున్నారు.
ఏఐఎంఐఎం పార్టీ అభ్యర్థి అసదుద్దీన్ ఒవైసికి వ్యతిరేకంగా మాధవి లత బీజేపీ నుండి హైదరాబాద్ నియోజకవర్గం బరిలో దిగారు. కొంత మంది ఏఐఎంఐఎం పార్టీ వ్యక్తులు కుడా ఈ క్లెయిమ్ ను ఫేస్బుక్ ద్వారా షేర్ చేసారు. కొంత మంది యూజర్లు లత భారత ప్రధాని నరేంద్ర మోడీ ని అనుకరిస్తూ టెలిప్రాంప్టర్ వాడుతున్నారు అని అన్నారు. ఆర్కైవ్ చేసిన పోస్ట్లని ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు.
సామాజిక మాధ్యమాలలో వైరల్ అవుతున్న క్లెయిమ్ (సౌజన్యం: ఎక్స్/ లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఎడిటింగ్)
కానీ ఈ క్లెయిమ్ తప్పు. లత ఆ ఇంటర్వ్యూ లో టెలిప్రాంప్టర్ వాడటం లేదు, తను ఒక డిజిటల్ ప్రార్థనా పరికరం వాడుతున్నారు
మేము ఏమి కనుగొన్నాము?
ఏప్రిల్ 6 నాడు ఇండియా టివి న్యూస్ ఛానల్ యూట్యూబ్ ఛానల్ లో అప్లోడ్ చేసిన ఇంటర్వ్యూ ని మేము పరిశీలించాము. ఇందులో లత ఒక పరికరాన్ని తన మధ్య వేలు మరియు ఉంగరం వేలు కు ధరించి ఉన్నారు. దీనిని ఇంటర్వ్యూ మొత్తం ఆవిడ ధరించి ఉండటం మనం చూడవచ్చు, మరో పక్క ఇంకో చేతిలో కొన్ని కాగితాలు చూసుకుని తన సమాధానాలు చెప్తున్నారు.
ఈ ఇంటర్వ్యూలో 1:19:10 వద్ద ఆ పరికరం స్పష్టంగా మనకు కనిపిస్తుంది. దీనిని గమనిస్తే ఇది ఒక డిజిటల్ టైమర్ లాగ పైన రెండు బటన్లతో మనకు కన్పిస్తుంది. కొంత మంది వ్యక్తులు సామాజిక మాధ్యమాలలో తమ కామెంట్లలో ఇది డిజిటల్ ప్రార్థనా పరికరం అని పేర్కొన్నారు. మేము ఆన్లైన్ లో అలాంటి పరికరం కోసం వెతుకగా దాదాపుగా అలాగే ఉన్న ఒక పరికరం లభించింది. దీనిని డిజిటల్ ట్యాలీ కౌంటర్ గా పేర్కొన్నారు, ఇది ప్రార్థనలను, మంత్రాలను లెక్కపెట్టడానికి వినియోగిస్తారు.
వైరల్ వీడియోలో మరియు ఆన్లైన్ లో లభించే ప్రధాన పరికరాల పోలిక (సౌజన్యం : ఎక్స్/ఫ్లిప్ కార్ట్/స్క్రీన్ షాట్స్)
మేము ఈ పరికరాన్ని, ఆన్లైన్ లో లభించే వైర్ లెస్ టెలిప్రాంప్టర్ తో కుడా పోల్చి చూసాము. లత చేతిలో ఉన్న పరికరం టెలిప్రాంప్టర్ రెమోట్ లాంటి పరికరాలకి భిన్నంగా ఉంది అని తెలుసుకున్నాము.
ఆన్లైన్ లో లభించే డిజిటల్ ప్రార్థనా పరికరం మరియు టెలిప్రాంప్టర్ రిమోట్ కి మధ్య పోలిక
ఇంటర్వ్యూ జరిగే సమయంలో లత కొన్ని కాగితాలను చూసి సమాధానం చెప్పటం మనం గమనించవచ్చు, కానీ తను ఎక్కడ ఒక టెలిప్రాంప్టర్ వాడినట్టుగా మనకు కనిపించలేదు. తను ఇంటర్వ్యూలో దాదాపుగా ప్రేక్షకులను లేదా యాంకర్ వైపు చూసి సమాధానం చెప్పటమే మనకు కనిపిస్తుంది. లత ఏబీపీ మరియు టైమ్స్ నౌ కు ఈ మధ్య కాలంలో ఇచ్చిన ఇంటర్వ్యూలలో కూడా ఈ పరికరాన్ని వాడడం మనం గమనించవచ్చు.
ఇతర ఇంటర్వ్యూ లలో మాధవి లత ప్రార్ధనా పరికరాన్ని వాడుతున్న స్క్రీన్ షాట్స్ (సౌజన్యం : స్క్రీన్ షాట్స్/ టైమ్స్ నౌ/ ఎబిపి న్యూస్)
తీర్పు
బహుశా మంత్రాలను లెక్కించడానికి మాధవి లత ఉపయోగించే ఒక డిజిటల్ పరికరాన్ని టెలిప్రాంప్టర్ అని కొంత మంది తప్పుగా క్లెయిమ్ చేసారు. కనుక మేము దీనిని అబద్ధం అని నిర్ధారించాము.
(అనువాదం- గుత్తా రోహిత్)