హోమ్ ఇయర్ ఫోన్స్ పెట్టుకుని బండి నడిపే వారికి ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం Rs.20,000 జరిమానా విధించటం లేదు

ఇయర్ ఫోన్స్ పెట్టుకుని బండి నడిపే వారికి ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం Rs.20,000 జరిమానా విధించటం లేదు

ద్వారా: రోహిత్ గుత్తా

ఆగస్టు 14 2023

ఈ కథనాన్ని షేర్ చెయ్యండి: facebook logo twitter logo linkedin logo
ఇయర్ ఫోన్స్ పెట్టుకుని బండి నడిపే వారికి ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం Rs.20,000 జరిమానా విధించటం లేదు

ఫ్యాక్ట్ చెక్స్

అబద్ధం

అటువంటి ఉత్తర్వు ఏదీ ఇవ్వలేదని అధికారులు ధ్రువీకరించారు. ప్రస్తుత నియమాల ప్రకారం అలా పట్టుపడితే Rs.1000 జరిమానా.

నేపధ్యం

ఇయర్ ఫోన్స్/హెడ్ సెట్ పెట్టుకుని వాహనం నడుపుతూ పట్టుపడితే Rs.20000 భారీ జరిమానా కట్టే విధంగా ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం నియమం తీసుకువచ్చిందని సామాజిక మాధ్యమాలలో ఒక క్లైమ్ వైరల్ అయ్యింది. ‘తెలుగు స్క్రైబ్’ అనే ట్విట్టర్ యూజర్ “ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం. హెడ్ సెట్/ఇయర్ ఫోన్స్ పెట్టుకుని వాహనం నడుపుతూ పట్టుపడితే Rs.20000 జరిమానా.. ఈ ఆగస్ట్ నెల నుండి ఇది అమలులోకి వస్తుంది. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఇక నుండి  ఇయర్ ఫోన్స్ పెట్టుకుని ఆటో, బండి, కార్ నడుపుతూ పట్టుపడితే వాళ్ళు Rs.20000 జరిమానా కట్టాల్సి ఉంటుంది. ఈ నిర్ణయాన్ని అన్ని రవాణా శాఖలకి పంపించారు”, అని జులై 26 నాడు పోస్ట్ చేశారు. ఈ ట్వీట్ ని తరువాత డిలీట్ చేసేశారు కానీ ఈ ట్వీట్ ఆర్కైవ్ లాజికల్లీ ఫ్యాక్ట్స్ సంపాదించింది. ఈ ట్వీట్ కి ఈ ఫ్యాక్ట్ చెక్ ప్రచురించే సమయానికి 80,000 వ్యూస్,  475 లైక్స్ ఉన్నాయి. ఇదే క్లైమ్ ని ఫేస్బుక్ లో కూశ షేర్ చేశారు. 

మిర్చి 9 లాంటి స్థానిక మీడియా సంస్థలు కూడా దేన్ని వ్యాప్తి చేశాయి. 

అయితే ఈ క్లైమ్ అబద్ధం. 

వాస్తవం

ఇయర్ ఫోన్స్ పెట్టుకుని వాహనం నడుపుతూ పట్టుపడితే Rs.20000 భారీ జరిమానా కట్టాలని చెబుతూ ఆంధ్ర ప్రదేశ్ రవాణా శాఖ ఈ మధ్య ఏమైనా ఉత్తర్వు, సర్కులర్, పత్రికా ప్రకటన ఏదైనా విడుదల చేసిందేమో తెలుసుకోవటానికి మేము రవాణా శాఖ వెబ్సైట్ అంతా వెతికాము. అయితే అటువంటిది ఏమీ లేదు. 

ఈ విషయంలో స్పష్టత కోసం లాజికల్లీ ఫ్యాక్ట్స్ రవాణా శాఖ సీనియర్ అధికారులని సంప్రదించింది. ఇయర్ ఫోన్స్/హెడ్ సెట్ పెట్టుకుని వాహనం నడిపితే కొత్త రకం జరిమానా అంటూ నిర్ణయం ఏదీ తీసుకోలేదు అని అదనపు రవాణా శాఖ కమీషనర్ ఎస్ ఏ వి ప్రసాదరావు తెలిపారు. “మేము అటువంటి ఉత్తర్వు ఏదీ జారీ చేయలేదు. ఇది ఫేక్ న్యూస్”, అని ఆయన తెలిపారు. 

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ ఫ్యాక్ట్ చెక్ విభాగం కూడా ఇది తప్పుడు సమాచారం అని ట్విట్టర్ లో తెలిపింది. “ఇక మీదట బైక్‌ మీద గానీ, కారులోగానీ, ఆటోలోగానీ ఇయర్‌ఫోన్స్‌ లేదా హెడ్‌సెట్‌ పెట్టుకుంటే రూ.20,000 జరిమానా విధించాలని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది’ అంటూ సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ప్రచారం పూర్తిగా అవాస్తవం. ఈ విషయంలో రాష్ట్ర రవాణా శాఖ కొత్తగా ఎలాంటి నిబంధనలూ పెట్టలేదు.”, అని ట్వీట్ చేసింది. 

ఇయర్ ఫోన్స్/హెడ్ సెట్ పెట్టుకుని బండి కానీ, కార్ కానీ నడుపుతూ పట్టుపడితే Rs. 1000 జరిమానా అని అని అనంతపురం జిల్లా రోడ్డు రవాణా అధికారి బి. సురేష్ నాయుడు తెలిపారు. ఈ జరిమానా మోటార్ వెహికల్ యాక్ట్, 1988 క్రింద విధిస్తారు. 

తీర్పు 

ఇయర్ ఫోన్స్ పెట్టుకుని బండి నడుపుతూ పట్టుపడితే రూ.20,000 జరిమానా అనే నియమం ఆంధ్ర ప్రభుత్వం చెయ్యలేదు. రవాణా శాఖ అధికారులు కూడా దీనిని ఖండించారు. కాబట్టి ఈ క్లైమ్ అబద్ధం అని మేము నిర్ధారించాము.

 

0 అంశాల వారీగా అన్వేషించండి

మన జీవితాలని ప్రభావితం చేసే నిర్ణయాలని మనం మనకి అందుబాటులో ఉన్న సమాచారం మేరకు తీసుకుంటాము. అయితే ఇంటర్నెట్ స్వభావరీత్యా తప్పుడు సమాచారం ఇప్పటివరకు కనీవినీ ఎరుగని రీతిలో ప్రజలకి చేరుతున్నది.