హోమ్ పాత వీడియో ఒకటి షేర్ చేసి భారత క్రీడాకారిణి జ్యోతి యర్రాజి ప్రస్తుత ఆసియా క్రీడల్లో స్వర్ణం గెలిచినట్టుగా క్లైమ్ చేశారు

పాత వీడియో ఒకటి షేర్ చేసి భారత క్రీడాకారిణి జ్యోతి యర్రాజి ప్రస్తుత ఆసియా క్రీడల్లో స్వర్ణం గెలిచినట్టుగా క్లైమ్ చేశారు

ద్వారా: సోహం శా

అక్టోబర్ 4 2023

ఈ కథనాన్ని షేర్ చెయ్యండి: facebook logo twitter logo linkedin logo
పాత వీడియో ఒకటి షేర్ చేసి భారత క్రీడాకారిణి జ్యోతి యర్రాజి ప్రస్తుత ఆసియా క్రీడల్లో స్వర్ణం గెలిచినట్టుగా క్లైమ్ చేశారు ఫేస్బుక్ మరియు ఎక్స్ లో షేర్ చేసిన పోస్ట్లు (సౌజన్యం: ఎక్స్/ ఫేస్బుక్/ లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఎడిటింగ్)

ఫ్యాక్ట్ చెక్స్

అబద్ధం

ఆసియా క్రీడలలో అథ్లెటిక్స్ పోటీలు అప్పటికి ఇంకా మొదలవ్వలేదు. వైరల్ అవుతున్న వీడియో జులై 2023 లో జరిగిన ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ కి సంబంధించినది.

క్లెయిమ్ ఏమిటి ?
 
ప్రముఖ గాయని ఆశా భోంస్లేతో సహా చాలా మంది సామాజిక మాధ్యమ యూజర్లు సెప్టెంబర్ 26వ తారీఖున ఒక వీడియో షేర్ చేస్తూ, భారతీయ ట్రాక్ మరియ ఫీల్డ్ అథ్లెట్ జ్యోతి యర్రాజి ప్రస్తుతం హాంగ్జౌ, చైనాలో జరుగుతున్న 2023 ఆసియా క్రీడలలో 100 మీటర్ల  హర్డల్ రేస్ లో స్వర్ణ పతకం గెలిచింది అంటూ రాసుకొచ్చారు. ఆర్కైవ్ చేసిన లింక్స్ ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు.

భోంస్లే వీడియో ని షేర్ చేస్తూ, “ఆంధ్ర ప్రదేశ్ నుంచి వచ్చిన యర్రాజి ఆసియా క్రీడలలో 100 మీటర్ల  హర్డల్ రేస్ లో స్వర్ణ పతాకం గెలిచినందుకు నా హృదయపూర్వక అభినందనలు,” అని రాశారు.

ఫేస్బుక్ మరియు ఎక్స్ లో షేర్ చేసిన పోస్ట్లు (సౌజన్యం: ఎక్స్/ ఫేస్బుక్/ లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఎడిటింగ్)

ప్రాంతీయ వార్తా సంస్థ అయినటువంటి టివి 9 మరాఠీ కూడా యర్రాజి 2023 ఆసియా క్రీడలలో స్వర్ణ పతకం గెలిచింది అంటూ రాసుకొచ్చి, భోంస్లే ఎక్స్ పోస్ట్ ను జత చేశారు. ఆ పోస్ట్ ఆర్కైవ్ లింకు ఇక్కడ చూడవచ్చు. 

టివి 9 మరాఠీ ప్రచురించిన కథనం( సౌజన్యం: టి వి 9 మరాఠీ/లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఎడిటింగ్)

అయితే ఇది నిజం కాదు ఎందుకంటే, ఆసియా క్రీడలలో అథ్లెటిక్స్ పోటీలు ఇంకా అప్పటికి ప్రారంభం అవ్వలేదు, ఇది పాత వీడియో.

వాస్తవం ఏమిటి ?

19వ ఆసియా క్రీడల అధికారిక వెబ్సైట్ ప్రకారం, మహిళల 100 మీటర్ల హర్డల్ రేస్ సెప్టెంబర్ 30వ తేదీన జరగనుంది అని రాసి ఉంది, ఫైనల్ పోటీలు అక్టోబర్ 1న అని ఉంది.

క్రీడా పాత్రికేయుడు జొనాథన్ సెల్వరాజ్ భోంస్లే ఎక్స్ పోస్ట్ ను రీపోస్ట్ చేస్తూ, 100 మీటర్ల హర్డల్ రేస్ ఇంకా ప్రారంభం కాలేదు అని పేర్కొనారు. 

స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా వారు జులై 13, 2023 నాడు ఎక్స్ లో పోస్ట్ చేసిన వీడియో (సౌజన్యం: ఎక్స్: @Media_SAI/ స్క్రీన్ షాట్)

పైగా ఇదే వీడియో ని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా వారు జులై 13, 2023 నాడు ఎక్స్ లో పోస్ట్ చేసి జ్యోతి యర్రాజి ఆసియన్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ 2023 లో మొదటి స్థానం సంపాదించింది అని రాశారు. తన ప్రత్యర్థి, 13.55 సెకన్లలో  పూర్తి చేస్తే, జ్యోతి 13.09 సెకన్లలో 100 మీటర్ల హర్డల్ రేస్ పూర్తి చేసింది అని కూడా రాశారు.

ఈ వైరల్ వీడియోలో 0:15 టైమ్ స్టాంప్ వద్ద క్రీడాకారుల వెనుక ఒక బోర్డు కూడా ఉంది.  ఇందులో ‘ఆసియన్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ 2023’ అని రాసిన ఒక లోగో కూడా ఉంది, ఇది ఆసియన్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ వెబ్సైట్ లో ఉన్న లోగో మాదిరిగానే ఉంది. 

వైరల్ వీడియోలోను మరియు ఆసియన్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ వెబ్సైట్ లో ఒకే మాదిరిగా ఉన్న లోగో (సౌజన్యం: ఎక్స్/ ఆసియన్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్)

ది రిలయన్స్ ఫౌండేషన్ యూత్ స్పోర్ట్స్ వారు కూడా ఈ క్లెయిమ్ అబద్దం అని వారి సామాజిక మాధ్యమాల ద్వారా తెలిపారు. వైరల్ అవుతున్న యర్రాజి వీడియో జులై నెల నాటిదని కూడా తెలిపారు. ఇది థాయిలాండ్ లో ఆసియన్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ లో తాను స్వర్ణ పథకం గెలిచినప్పటిదని కూడా చెప్పారు.

ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన యర్రాజి జులై 13 న ఆసియన్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ లో మహిళల 100 మెటర్ల హర్డల్ రేస్ లో 13.09 సెకండ్లలో పూర్తి చేసి స్వర్ణ పతకం గెలిచింది. యర్రాజికి 12.82 సెకన్ల జాతీయ రికార్డు కూడా ఉంది. 

తీర్పు:

వైరల్ అవుతున్న వీడియో పాతది మరియు ప్రస్తుతం జరుగుతున్న 2023 ఆసియా క్రీడలకు సంబంధించినది కాదు. కనుక, మేము దీనిని అబద్దం అని నిర్ధారించాము. 

(అనువాదం:  రాజేశ్వరి పరస)

0 అంశాల వారీగా అన్వేషించండి

మన జీవితాలని ప్రభావితం చేసే నిర్ణయాలని మనం మనకి అందుబాటులో ఉన్న సమాచారం మేరకు తీసుకుంటాము. అయితే ఇంటర్నెట్ స్వభావరీత్యా తప్పుడు సమాచారం ఇప్పటివరకు కనీవినీ ఎరుగని రీతిలో ప్రజలకి చేరుతున్నది.