హోమ్ ఎడిటెడ్ వీడియో షేర్ చేసు బాలల మీద లైంగిక దాడుల గురించి అడిగిన ప్రశ్నని ఆంధ్ర ప్రదేశ్ హోం మంత్రి కొట్టిపారేశారని క్లైమ్ చేశారు

ఎడిటెడ్ వీడియో షేర్ చేసు బాలల మీద లైంగిక దాడుల గురించి అడిగిన ప్రశ్నని ఆంధ్ర ప్రదేశ్ హోం మంత్రి కొట్టిపారేశారని క్లైమ్ చేశారు

ద్వారా: రోహిత్ గుత్తా

జూలై 25 2024

ఈ కథనాన్ని షేర్ చెయ్యండి: facebook logo twitter logo linkedin logo
ఎడిటెడ్ వీడియో షేర్ చేసు బాలల మీద లైంగిక దాడుల గురించి అడిగిన ప్రశ్నని ఆంధ్ర ప్రదేశ్ హోం మంత్రి కొట్టిపారేశారని క్లైమ్ చేశారు బాలల మీద లైంగిక దాడి గురించి విలేకరులు అడిగిన ప్రశ్నని ఆంధ్ర ప్రదేశ్ హోమ్ మంత్రి కొట్టిపారేశారని క్లైమ్ చేసిన పోస్ట్ స్క్రీన్ షాట్ (సౌజన్యం: ఎక్స్/లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఎడిటింగ్)

ఫ్యాక్ట్ చెక్స్

అబద్ధం

బాలల మీద లైంగిక దాడుల గురించిన ప్రశ్నకి మంత్రి వివరమైన జవాబు ఇచ్చారు. వైరల్ వీడియో లో జవాబు ఇస్తున్నది వేరే ప్రశ్నకి.

క్లైమ్ ఏంటి?

ఆంధ్ర ప్రదేశ్ హోం మంత్రి వంగలపూడి అనిత మాట్లాడుతున్న 10 సెకన్ల వీడియో ఒకటి షేర్ చేసి, బాలల మీద లైంగిక దాడుల గురించి పాత్రికేయులు అడిగిన ప్రశ్నని కొట్టిపారేశారు అని క్లైమ్ చేశారు. ఈ వీడియోలో అనిత, “సర్, దేనికైనా టైమ్ రావాలండి. ఇప్పుడు నేనేమైనా చెయ్యాలనుకుంటే నేను లాఠీ పట్టుకుని తిరగాలా నేనేమైనా...చెప్పండి.. గన్ పట్టుకుని తిరగాలా…,” అని అనటం మనం వినవచ్చు.

ఎక్స్ (పూర్వపు ట్విట్టర్) లో ఒక యూజర్ ఈ వీడియో షేర్ చేసి (ఆర్కైవ్ ఇక్కడ), “విలేఖరులు: మేడమ్ రాష్ట్రంలో హత్యలు పసి పిల్లల మీద రేప్ లో పెరిపోయాయి. హోమ్ మంత్రి: దానికి నేనేం చేయాలి అంటారు?” అని రాసుకొచ్చారు. ఇటువంటి పోస్ట్స్ ఆర్కైవ్స్ ఇక్కడ  మరియు ఇక్కడ చూడవచ్చు. 

సామాజిక మాధ్యమ పోస్ట్స్ స్క్రీన్ షాట్స్ (సౌజన్యం: ఎక్స్/లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఎడిటింగ్)

అయితే, ఇది ఎడిటెడ్ వీడియో. బాలల మీద లైంగిక దాడుల గురించి అనిత వివరమైన జవాబు ఇచ్చారు. అయితే, వేరే ప్రశ్నకి ఇచ్చిన జవాబు వీడియో షేర్ చేసి ఇలా క్లైమ్ చేస్తున్నారు.

మేము ఏమి తెలుసుకున్నాము?

పాత్రికేయులు అడిగిన ప్రశ్న ఈ వైరల్ వీడియోలో లేదు. అయితే పాత్రికేయులు ఏదో ప్రశ్న అడుగుతున్నారు అని వీడియో మొదట్లో ఉన్న శబ్దాల బట్టి అర్థం అవుతున్నది.

ఈ వీడియోని అనిత జూలై 18, 2024 నాడు నిర్వహించిన పత్రికా సమావేశం నుండి తీసుకున్నారని మేము తెలుసుకున్నాము. ఏబీఎన్ - ఆంధ్రజ్యోతి చానల్ ఈ సమావేశాన్ని లైవ్ స్ట్రీమ్  (ఆర్కైవ్ ఇక్కడ) చేసింది. వైరల్ క్లిప్ ని ఈ లైవ్ స్ట్రీమ్ వీడియో లో 23:44 నుండి 23:52 టైమ్ స్టాంప్ మధ్య చూడవచ్చు.

ఈ సమావేశం వీడియోలో 2014-2019 మధ్య వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం హయంలో తెలుగుదేశం కార్యకర్తల మీద జరిగాయి అని చెప్పపబడుతున్న దాడుల మీద చర్చ నడిచింది. ఈ దాడులకి సంబంధించి ఏ చర్యలు ఎందుకు తీసుకోలేదు అనే ప్రశ్నకు, అనిత, “ సర్, దేనికైనా టైమ్ రావాలండి. ఇప్పుడు నేనేమైనా చెయ్యాలనుకుంటే నేను లాఠీ పట్టుకుని తిరగాలా నేనేమైనా.. చెప్పండి. గన్ పట్టుకుని తిరగాలా ఏమైనా చేయాలంటే..నమ్మకం అన్నది..దాన్నేమంటారంటే..ఒక సమాయపాలనలో కంపల్సరీ నమ్మకం వస్తది. అసలు మీకు ఇంకొక విషయం చెబుతున్నా..చంద్రబాబు నాయుడు గారు ఛార్జ్ తీసుకున్నారంటేనే ఫిఫ్టీ పర్సెంట్ నమ్మకం వచ్చినట్టు. మిగతా ఫిఫ్టీ పర్సెంట్ మేము చేసే యాక్షన్ మీద కానీ, దాని నుండి వచ్చే రియాక్షన్ మీద కానీ ఉంటుంది. కానీ, ఈ రోజు ఉన్న సిచ్యుయేషన్స్.. మేము చెప్తున్నాము..అప్పుడు చంద్రబాబు గారు ఏం చెప్పారు, లోకేష్ గారు ఏం చెప్పారు, వాటన్నిటి మీద స్టాండ్ అయ్యే ఉన్నాం. చట్టపరంగా చూసుకుంటాం,” అని జవాబిచ్చారు.

అనిత ను బాలల మీద లైంగిక దాడుల గురించి అడిగినప్పుడు, దానికి వివరమైన జవాబు ఇచ్చారని తెలుసుకున్నాము.

20:22 టైమ్ స్టాంప్ దగ్గర, ఒక పాత్రికేయుడు, “అంటే మైనర్ బాలిక రేప్ కావొచ్చు, హత్యలు కావొచ్చు, ఎలా చూస్తున్నారు?” అని అడిగిన ప్రశ్నకు, ఈ రోజుకి ఈ రోజు జరుగుతున్న సంఘటనలు..వరుసగా జరుగుతున్నాయి మైనర్ బాలికల మీద... నేనేమంటానంటే దాని మీద మేము కూడా అధ్యయనం చేస్తున్నాం..పోలీస్ డిపార్ట్మెంట్...మైనర్ బాలికల మీద అత్యాచారాలు జరుగుతున్నాయు, హత్యలు జరుగుతున్నాయి అనుకునేటప్పుడు కొంచెం క్లోస్ రిలేటెడ్ పీపుల్, వాళ్ళ సరౌన్డింగ్ లో పీపుల్, కొంచెం దగ్గరగా ఉన్న బంధువులు దగ్గర మ్యాగ్జిమం ఇవన్నీ జరుగుతున్నాయి. ఇవన్నీ ఒక ఎత్తు..నేను..వీటి గురించి మాట్లాడాలి. ఒక కంక్లూషన్ కి తీసుకురావాలి, చర్యలు అయితే తీసుకోవాలి. డెఫినెట్ గా వాటి మీద మేము చర్యలు తీసుకుంటాము. ఎట్ థ సేమ్ టైమ్, ఒక ఎవర్నెస్ ప్రోగ్రామ్, ఒక స్పెషల్ డ్రైవ్ పెడతాం. ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ కలిపి ఒక డ్రైవ్ కూడా పెడతాం. 6th క్లాస్ లోపు పిల్లల వరకు ఒక బ్యాడ్ టచ్ ఏంటి, ఒక గుడ్  టచ్ ఏంటి లాంటి విషయాల మీద ఎవేర్నెస్ తీసుకురావడం, 6th క్లాస్ తరువాత కాలేజీ వరకు కూడా.. వాళ్ళకి ఏంటంటే.. చాలా మంది ఏం చేస్తున్నారంటే...నేను చాలా కేసులు చూశా.. చాలా మంది ఏంటంటే 8th క్లాస్, 9 th క్లాస్ పిల్లలని ట్రాప్ చేయడం, ఆ పిల్లలు చనిపోవడం, ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి. వాటికి కూడా ఒక ఎవేర్నెస్ క్రియేట్ చెయ్యడానికి వాళ్ళకి కూడా.. పేరెంట్స్ కి కూడా.. పేరెంట్స్ కి, టీచర్స్ కి, ఎట్ ది సేమ్ టైమ్ స్టూడెంట్స్ కి ఒక డ్రైవ్ ఏర్పాటు చేయడానికి మేము సిద్ధపడ్డామండి. ఇవన్నీ ఒక ఎత్తు అయితే..నేనేమంటానంటే అండి...పాస్ట్ జరిగిన పోలీసు వ్యవస్థ మొత్తం నిర్వీర్యం అయిపోయింది…మీరు నమ్ముతారా ఒక ఫింగర్ ప్రింట్ సిస్టమ్ ఒకటి ఉండేది. ఒక క్రిమినల్ ఎక్కడైనా పట్టుబడ్డాడు అనుకోండి, వాడు కనుక ఫింగర్ ప్రింట్ ఇస్తే, వాడి మీద ఎన్ని కేసులు ఉన్నాయి మొత్తం బయటకి వచ్చేస్తాయి. అంటే, వాడి క్రిమినల్ హిస్టరీ అంతా బయటకి వచ్చేస్తుంది. అలాంటి సిస్టమ్ మొత్తం లేదు. లాస్ట్ ఫైవ్ యియర్స్ పని చెయ్యలా,” అని జవాబిచ్చారు. 

10 TV (ఆర్కైవ్ ఇక్కడ) కూడా ఈ సమావేశాన్ని కవర్ చేసింది. బాలల మీద లైంగిక దాడుల గురించిన ప్రశ్న, జవాబుని 02:18 నుండి 04:04 టైమ్ స్టాంప్ మధ్య చూడవచ్చు. అలాగే, దాడుల గురించిణ ప్రశ్న, జవాబుని 05:37 నుండి 05:45 టైమ్ స్టాంప్ మధ్య చూడవచ్చు.

ఈ వీడియో సర్కులేషన్ మీద కేసు పెట్టామని తెలుగు దేశం పార్టీ తమ అధికారిక ఎక్స్ అకౌంట్ లో తెలిపింది  (ఆర్కైవ్ ఇక్కడ). 

తెలుగుదేశం పార్టీ ఎక్స్ పోస్ట్ స్క్రీన్ షాట్ (సౌజన్యం: ఎక్స్/@JaiTDP)

తీర్పు

ఆంధ్ర ప్రదేశ్ హోమ్ మంత్రి వంగలపూడి అనిత పత్రికా సమావేశం లో మాట్లాడుతున్న వీడియోని ఎడిట్ చేసి, బాలల మీద లైంగిక దాడి గురించి అడిగిన ప్రశ్నని తను కొట్టిపారేశారు అని తప్పుగా క్లైమ్ చేశారు. ఒరిజినల్ వీడియో లో తను ఆ ప్రశ్నకి వివరమైన జవాబు ఇచ్చారు. 

(అనువాదం - గుత్తా రోహిత్)

0 అంశాల వారీగా అన్వేషించండి

మన జీవితాలని ప్రభావితం చేసే నిర్ణయాలని మనం మనకి అందుబాటులో ఉన్న సమాచారం మేరకు తీసుకుంటాము. అయితే ఇంటర్నెట్ స్వభావరీత్యా తప్పుడు సమాచారం ఇప్పటివరకు కనీవినీ ఎరుగని రీతిలో ప్రజలకి చేరుతున్నది.