హోమ్ చంద్రబాబు 2019 నాటి ఇంటర్వ్యూని షేర్ చేసి తను ఇండియా కూటమిలో చేరుతున్నారని క్లైమ్ చేశారు

చంద్రబాబు 2019 నాటి ఇంటర్వ్యూని షేర్ చేసి తను ఇండియా కూటమిలో చేరుతున్నారని క్లైమ్ చేశారు

ద్వారా: రాజేశ్వరి పరస

జూన్ 7 2024

ఈ కథనాన్ని షేర్ చెయ్యండి: facebook logo twitter logo linkedin logo
చంద్రబాబు 2019 నాటి ఇంటర్వ్యూని షేర్ చేసి తను ఇండియా కూటమిలో చేరుతున్నారని క్లైమ్ చేశారు తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు ఇండియా కూటమి లో చేరుతున్నట్టు షేర్ చేసిన పోస్టు స్క్రీన్ షాట్ (సౌజన్యం : ఎక్స్/లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఎడిటింగ్)

ఫ్యాక్ట్ చెక్స్

అబద్ధం

చంద్రబాబు 2019 లో ఇచ్చిన ఇంటర్వ్యూని అసందర్భంగా షేర్ చేసి చేసి, తను ఈ బీజేపీ వ్యతిరేక వ్యాఖ్యలని 2024 ఎన్నికల ఫలితాల తరువాత చేసినట్టు క్లైమ్ చేశారు.

క్లెయిమ్ ఏమిటి?

సామాజిక మాధ్యమాలలో ఒక యూజర్ తెలుగు దేశం పార్టీ అధినేత మరియు ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఎన్నికైన  నారా చంద్రబాబు నాయుడు, ఒక ఇంగ్లీష్ న్యూస్ ఛానల్, ఎన్డీటీవీ, తో మాట్లాడుతున్నట్టున్న వీడియో షేర్ చేసి, “బ్రేకింగ్ న్యూస్! చంద్రబాబు నాయుడు ఆశ్చర్యకరమైన వ్యాఖ్యలు చేసారు, రాజ్యాంగ విరుద్ధమైన వారితో సంధి అసంభవం అని తెలిపారు. నాయుడు ఇండియా బ్లాక్ కూటమిలో చేరుతానని కుడా అన్నారు,” అని రాసుకొచ్చారు. (కన్నడ అనువాదం).

వీడియోలో చంద్రబాబు మాట్లాడుతూ “తాము లౌకికవాదులం అని, కొన్ని సార్లు రాజకీయ ఒత్తిడిలకు గురై బీజేపీ లో చేరాము. ప్రస్తుతం ప్రజాస్వామ్య ఒత్తిడి కుడా ఉంది. సీబీఐ,  ఈడీ మరియు ఆదాయపు పన్ను విభాగం దాడులు జరుగుతున్నాయి.. ఈ సంస్థలన్నీటినీ నాశనం చేశారు,” అని అన్నారు. .

పాత్రికేయుడు చంద్రబాబుని ఈ కూటమి ప్రధాని అభ్యర్ధి ఎవరు అని అడగగా, “ఎవరైనా నరేంద్ర మోదీ కన్నా మెరుగైన వారే. దేశానికి ఏకాభిప్రాయ రాజకీయాలు కావలి. భారతదేశం చాలా గొప్ప దేశం.  కో- ఓపరేటీవ్  ఫెడరలిజంని ఎక్కడ అమలు చేశారు? పైగా చరిత్ర లో చూసుకుంటే, ఎన్నికల తరువాత ప్రధానిని ఎన్నుకున్న సందర్భాలు ఉన్నాయి,” అని తెలిపారు. ఆర్కైవ్ పోస్టులను ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు. 

ఆన్లైన్ లో వైరల్ అవుతున్న క్లెయిమ్ స్క్రీన్ షాట్ (సౌజన్యం : ఫేస్బుక్/ లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఎడిటింగ్)

ఇటీవల ముగిసిన ఎన్నికలలో, బీజేపీ ఏర్పరిచిన నేషనల్ డెమోక్రాటిక్ అలయెన్స్ (ఎన్డీఏ) కూటమి 293 సీట్లు గెలుచుకుంది.  ప్రస్తుతం బీజేపీ సగం సంఖ్య (272) కుడా దాటక పోవటంతో కూటమి లో ఉన్న టిడిపి తో సహా ఇతర పార్టీలు పైన ప్రభుత్వ ఏర్పాటుకు ఆధారపడింది. టిడిపి ఆంధ్ర ప్రదేశ్ నుంచి 16 సీట్లు గెలిచింది.

అయితే, వైరల్ అవుతున్న వీడియో పాతది. తాజా ఎన్నికల నేపధ్యంలో చంద్రబాబు బీజేపీని విమర్శించిన వీడియో కాదిది.

వాస్తవం ఏమిటి?

వైరల్ అవుతున్న వీడియోని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసి వెతుకగా, ఇంకాస్త నిడివి ఉన్న వీడియో ఎన్డీటీవీ అధికారిక యూట్యూబ్ ఛానల్ లో లభించింది (ఆర్కైవ్ ఇక్కడ). దీనిని “Chandrababu Naidu vs PM Modi: Battle Turns Personal?" అనే శీర్షిక తో పబ్లిష్ చేశారు. “ఎవరైనా నరేంద్ర మోదీ కన్నా మెరుగైన వారే” అని చేసిన వ్యాఖ్య 7:03 మార్క్ వద్ద ఉంది.

ఎన్డీటీవీ ఫిబ్రవరి 11, 2019 నాడు ప్రచురించిన కథనంలో చంద్రబాబు ఢిల్లీలో ఆంధ్రకి ప్రత్యేక హోదా కావాలని ధర్నా చేసిన సమయం లో ఇంటర్వ్యూ తీసుకున్నారు అని తెలిపింది. ఇక్కడ బీజేపీకి సంబంధించి రాజకీయ వ్యూహం గురించి కుడా మాట్లాడారు, మొదట్లో, బీజేపీతో ఉండటం అనేది రాజకీయాలలో తప్పని పరిస్థితులలో తీసుకునే నిర్ణయంగా పేర్కొన్నారు. ఇప్పుడు బీజేపీ వ్యతిరేక కూటమి ఏర్పాటు చేయడమనేది ప్రజాస్వామ్యంగా కుడా తప్పనిసరి పరిస్థితిగా పేర్కొన్నారు. పైగా, ఈ పాత్రికేయుడు ఈ బీజేపీ వ్యతిరేక కూటమికి నాయకుడు ఎవరు అని ప్రశ్నించగా, ‘ఎవరైనా నరేంద్ర మోదీ కన్నా మెరుగైన వారే’ అని చంద్రబాబు పేర్కొన్నారు.

టీడీపీ నేతలు తాము ఇండియా కూటమి లో జేరుతున్నట్టుగా చేసిన వ్యాఖ్యలు కుడా మేము ఎక్కడా వార్తా కథనాలలో చూడలేదు. జూన్ 5 నాడు జరిగిన ఎన్డీఏ కూటమి సమావేశంలో కుడా మోదీని అధికారికంగా తమ నాయకుడి గా ఎన్నుకుంటున్నట్టుగా ధ్రువీకరించారు.  

జూన్ 5 నాడు, చంద్రబాబు ఎన్డీఏ కూటమి సమావేశం నుండి ఫొటోలను షేర్ చేసారు. ఈ పోస్టులో (ఆర్కైవ్ ఇక్కడ), ఎన్డీఏకి మద్దతు ఇస్తున్నట్టుగా తెలిపారు, పైగా కూటమి సభ్యులందరూ నరేంద్ర మోదీని కూటమికి అధినేతగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు అని తెలుపుతూ, ఆయన నాయకత్వంపై నమ్మకం ఉందని పేర్కొన్నారు.


చంద్రబాబు నాయుడు జూన్ 5 నాడు షేర్ చేసిన పోస్ట్ (సౌజన్యం : ఎక్స్)

తీర్పు

దిల్లీ లో చంద్రబాబు నాయుడు 2019 లో దీక్ష చేసిన సమయంలోని ఇంటర్వ్యూ ని తాజా ఇంటర్వ్యూగా షేర్ చేస్తున్నారు. తాజా 2024 ఎన్నికల తరువాత చంద్రబాబు అలాంటి వ్యాఖ్యలు ఏమి చేయలేదు. ఎన్డీఏ కూటమి తో ఉంటున్నట్టుగానే ప్రకటించారు. కాబట్టి ఈ క్లైమ్ అబద్ధం అని మేము నిర్ధారించాము.

(అనువాదం : రాజేశ్వరి పరసా)

0 అంశాల వారీగా అన్వేషించండి

మన జీవితాలని ప్రభావితం చేసే నిర్ణయాలని మనం మనకి అందుబాటులో ఉన్న సమాచారం మేరకు తీసుకుంటాము. అయితే ఇంటర్నెట్ స్వభావరీత్యా తప్పుడు సమాచారం ఇప్పటివరకు కనీవినీ ఎరుగని రీతిలో ప్రజలకి చేరుతున్నది.