హోమ్ కర్ణాటకలో కాంగ్రెస్ విజయం తరువాత విరాట్ కోహ్లీ రాహుల్ గాంధీని పొగుడుతునట్టున్న పోస్ట్ మార్ఫ్ చేయబడిన ఫొటో

కర్ణాటకలో కాంగ్రెస్ విజయం తరువాత విరాట్ కోహ్లీ రాహుల్ గాంధీని పొగుడుతునట్టున్న పోస్ట్ మార్ఫ్ చేయబడిన ఫొటో

ద్వారా: రోహిత్ గుత్తా

ఆగస్టు 10 2023

ఈ కథనాన్ని షేర్ చెయ్యండి: facebook logo twitter logo linkedin logo
కర్ణాటకలో కాంగ్రెస్ విజయం తరువాత విరాట్ కోహ్లీ రాహుల్ గాంధీని పొగుడుతునట్టున్న పోస్ట్ మార్ఫ్ చేయబడిన ఫొటో

ఫ్యాక్ట్ చెక్స్

తీర్పు అబద్ధం

కోహ్లీ ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ స్క్రీన్ షాట్ తీసుకుని, దానిని మార్ఫ్ చేసి, కర్ణాటక ఎన్నికల విజయం తరువాత కోహ్లీ రాహుల్ గాంధీని పోగుడుతూ పెట్టిన పోస్ట్

నేపధ్యం

2023 కర్ణాటక శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ 135 స్థానాలలో గెలుపొందగా, బిజెపి 66 స్థానాలలో గెలిచింది. మే 13, 2023 నాడు ఎన్నికల ఫలితాలు ప్రకటించిన తరువాత సామాజిక మాధ్యమలలో అనేక అబద్ధపు, తప్పుదోవ పట్టించే పోస్టులు చక్కర్లు కొట్టాయి. కొంతమంది భారతదేశ క్రికెట్ ఆటగాడైన విరాట్ కోహ్లీ ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ స్క్రీన్ షాట్ సర్కులేట్ చేసి, ఇందులో విరాట్ కోహ్లీ రాహుల్ గాంధీ ఫొటోలను షేర్ చేస్తూ, కర్ణాటక ఎన్నికలలో కాంగ్రెస్ విజయానికి అభినందనలు తెలియచేస్తున్నాడు అని రాసుకొచ్చారు. 

అటువంటి ఒక స్క్రీన్ షాట్ లో విరాట్ కోహ్లీ రాహుల్ గాంధీ కూర్చొనున్న ఫొటో ఒకటి షేర్ చేసి “ది మ్యాన్, ది మిత్, ది లీడర్ @rahulgandhi” అని రాసి నట్టు ఉంది. ఇంకొక స్క్రీన్ షాట్ లో విరాట్ కోహ్లీ రాహుల్ గాంధీ పోడియం మీద నుంచునున్నఫొటో ఒకటి షేర్ చేసి “ఈ సారి మనమే ప్రభుత్వం ఏర్పాటు చేస్తాము@rahulgandhi” (తెలుగు అనువాదం) అని రాసునట్టు ఉంది.  

అయితే విరాట్ కోహ్లీ ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ స్క్రీన్ షాట్స్ అని చెప్పబడుతున్న ఇవి మార్ఫ్ చేయబడిన ఫొటోలు. విరాట్ కోహ్లీ రాహుల్ గాంధీకి అభినందనలు తెలిపాడు అనటానికి కానీ లేదా పొగిడాడు అనటానికి కానీ ఏ ఆధారం లేదు. ట్విట్టర్ లో ప్రముఖ పేరడీ ఖాతా అయినా @niiravmodi కూడా ఈ స్క్రీన్ షాట్లని షేర్ చేశారు. 

అయితే చాలా మంది ఇది నిజమే అని నమ్మారు. 

వాస్తవం

మొదటి స్క్రీన్ షాట్ లో కొన్ని తప్పులని మేము గుర్తించాము. ఈ స్క్రీన్ షాట్ లోని ఫొటోలో రాహుల్ గాంధీ కూర్చుని ఉన్నారు. చేతిలో మైక్రోఫోన్ పట్టుకుని నవ్వుతున్నట్టు ఉన్నారు. 

విరాట్ కోహ్లీ ఇన్స్టాగ్రామ్ పోస్ట్ స్క్రీన్ షాట్ గా చెప్పబడుతున్న ఈ స్క్రీన్ షాట్ ని విరాట్ కోహ్లీ ఇన్స్టాగ్రామ్ ఖాతాతో పోల్చి చూశాము. అయితే తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలోని తన పేరులో ‘l’ అనే అక్షరం, ఈ వైరల్ స్క్రీన్ షాట్ లో ఉన్న ‘l’ అక్షరం రెండూ వేరు వేరుగా ఉన్నాయి. తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలోని తన పేరుని ఆండ్రాయిడ్, యాపిల్ ఫోన్ల నుండి స్క్రీన్ షాట్ తీసినప్పుడు ఈ ‘l’ అక్షరం కింద భాగాన ‘L’ అక్షరంలో లాగా ఒక గీత బయటకి చొచ్చుకు రాలేదు. అయితే ఈ వైరల్ పోస్ట్ లో ఉన్న స్క్రీన్ షాట్ లో ‘l ‘ అక్షరంలో కింద భాగాన ఒక గీత బయటకు చొచ్చుకు వచ్చింది. 

ఇన్స్టాగ్రామ్ లో ప్రముఖులకి అంటే నటీ నటులకి, రాజకీయ నాయకుల లాంటివాళ్ళకి వాళ్ళ పేరు పక్కనే ఒక నీలి రంగు బ్యాడ్జ్ ఉంటుంది. దీనర్థం ఈ ఖాతా వాళ్ళే వాడుతున్నారు, ఇంకెవరో వారి పేరు మీద వాడుతున్నది కాదు అని. ఇప్పుడు విరాట్ కోహ్లీకి కూడా ఆ బ్యాడ్జ్ ఉంది. మేము తీసిన స్క్రీన్ షాట్ లో తన పేరుకి సమాంతరంగానే ఈ బ్యాడ్జ్ ఉంది. అయితే ట్విట్టర్ లో వైరల్ అయిన స్క్రీన్ షాట్ లో తన పేరుకి కాస్త పైన కిందగా బ్యాడ్జ్ ఉంది. అంతే కాక రాహుల్ గాంధీని మెచ్చుకుంటూ విరాట కోహ్లీ ఇలా ఏదన్నా పోస్ట్ చేసి ఉంటే అది వార్త అయ్యే ఉండేది. అటువంటి వార్త ఏదీ మాకు కనిపించలేదు. ఇవన్నీ కలిపి చూస్తే విరాట్ కోహ్లీ అటువంటి స్టోరీ ఏదీ ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేయలేదు అని, ట్విట్టర్ లో తన ఇన్స్టాగ్రామ్ స్టోరీగా వైరల్ అయిన స్క్రీన్ షాట్ మార్ఫ్ చేయబడిన ఫొటో అని స్పష్టం అవుతున్నది. 

రెండవ స్క్రీన్ షాట్ లో రాహుల్ గాంధీ నిలబడి ఉన్న ఫొటో ఉంది. ఈ స్క్రీన్ షాట్ కింద ఈ పోస్ట్ ఐదు నిమిషాల క్రింద షేర్ చేయబడింది అన్నట్టు రాసుంది. ఇదే స్క్రీన్ షాట్ ని మే 13 నాడు అనేక మంది షేర్ చేశారు. రాహుల్ గాంధీ ఫొటో వెనుకాల కాంగ్రెస్ పార్టీ గుర్తు అయిన హస్తం క్రింద ఒక నీలి రంగు గుడ్డ ఉంది. కోహ్లీ ఇన్స్టా గ్రామ్ లో పెట్టిన ఒక స్టోరీని తీసుకుని, దానిని మార్ఫ్ చేసి ఈ స్క్రీన్ షాట్ సృష్టించారు అని మేము గుర్తించాము. 

ఐపిఎల్ కెరీర్లో తొలి సెంచరీ చేసినందుకు సూర్య కుమార్ యాదవ్ ని ప్రశంసిస్తూ కోహ్లీ మే 12న ఇన్స్టాగ్రామ్ లో ఒక స్టోరీ షేర్ చేశారు. సూర్య కుమార్ యాదవ్ ముంబై ఇండియన్స్ జట్టు నీలి రంగు యూనిఫాం ధరించి ఉన్న ఫొటో ఒకటి పెట్టి “నా గౌరవాలు అందుకో సోదరా @surya_14kumar” (తెలుగు అనువాదం) అని కోహ్లీ రాశారు. ఆర్ వి సి జె అనే మీడియా సంస్థ ఈ కోహ్లీ స్టోరీ స్క్రీన్ షాట్ ని మే 12న తమ ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసి, “సూర్య కుమార్ యాదవ్ ని ప్రశంసించిన విరాట్ కోహ్లీ” అని రాయటం జరిగింది. ఈ కోహ్లీ స్క్రీన్ షాట్ కింద ఈ పోస్ట్ రెండు నిమిషాల క్రింద షేర్ చేయబడింది అని ఉంది. అంటే దీనర్థం కోహ్లీ ఈ పోస్ట్ పెట్టింది మే 13 నాడు కాదు మే 12 నాడు అని. అంటే అప్పటికి ఇంకా కర్ణాటక ఎన్నికల ఓట్ల లెక్కింపు ఇంకా మొదలవ్వనే లేదు. ఓట్ల లెక్కింపు జరిగింది మే 13 నాడు. అంతే కాక రాహుల్ గాంధీ ఫొటో వెనుకాల కంపించిన నీలి రంగు గుడ్డ ఈ కోహ్లీ స్టోరీలో సూర్య కుమార్ యాదవ్ ధరించిన నీలి రంగు యూనిఫాం. మే 12 నాడు కోహ్లీ షేర్ చేసిన స్టోరీ స్క్రీన్ షాట్ తీసుకుని, మే 13 నాడు కోహ్లీ రాహుల్ గాంధీకి శుభాకాంక్షలు తెలుపుతున్నట్టు మార్ఫ్ చేశారని దీని బట్టి మనం చెప్పొచ్చు. అదే కాక కర్ణాటక ఎన్నికలలో విరాట్ కోహ్లీ కాంగ్రెస్ కి తన మద్ధతు తెలియచేశారు అని మాకు ఎక్కడా కనపడలేదు. కోహ్లీ ఎప్పుడూ కూడా బహిరంగంగా తన రాజకీయ అభిప్రాయాలు వ్యక్తపరిచిన దాఖలాలు లేవు. 

తీర్పు

ఈ రెండు వైరల్ స్క్రీన్ షాట్స్ కూడా మార్ఫ్ చేసినవే. అందులో ఒకదానిని కొత్తగా సృష్టిస్తే,  కోహ్లీ సూర్య కుమార్ యాదవ్ ని ప్రశంసిస్తున్న ఇన్స్టాగ్రామ్ స్టోరీని మార్ఫ్  రాహుల్ చేసి గాంధీని పొగుడుతునట్టు చేసిన స్క్రీన్ షాట్ ఇంకోటి. కాబట్టి ఇది అబద్ధం అని మేము నిర్ధారిస్తున్నాము. 

ఫ్యాక్ట్ చెక్ కోసం ఏదైనా క్లైమ్ మాకు సబ్మిట్ చేయదలుచుకుంటున్నారా లేదా మా సంపాదక బృందాన్ని సంప్రదించదలుచుకుంటున్నారా?

0 అంశాల వారీగా అన్వేషించండి

మన జీవితాలని ప్రభావితం చేసే నిర్ణయాలని మనం మనకి అందుబాటులో ఉన్న సమాచారం మేరకు తీసుకుంటాము. అయితే ఇంటర్నెట్ స్వభావరీత్యా తప్పుడు సమాచారం ఇప్పటివరకు కనీవినీ ఎరుగని రీతిలో ప్రజలకి చేరుతున్నది.