హోమ్ వాయనాడ్ లో ప్రియాంక గాంధీ ర్యాలీ అంటూ 2019 వీడియో వైరల్ అవుతుంది

వాయనాడ్ లో ప్రియాంక గాంధీ ర్యాలీ అంటూ 2019 వీడియో వైరల్ అవుతుంది

ద్వారా: అంకిత కులకర్ణి

అక్టోబర్ 25 2024

ఈ కథనాన్ని షేర్ చెయ్యండి: facebook logo twitter logo linkedin logo
ఇది ప్రియాంక గాంధీ వాయనాడ్ నామినేషన్ ర్యాలీ అంటూ వైరల్ అవుతున్న క్లెయిమ్ స్క్రీన్ షాట్ సామాజిక మాధ్యమాలలో ఇది ప్రియాంక గాంధీ వాయనాడ్ నామినేషన్ ర్యాలీ అంటూ వైరల్ అవుతున్న క్లెయిమ్ స్క్రీన్ షాట్ (సౌజన్యం : ఎక్స్/ లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఎడిటింగ్)

ఫ్యాక్ట్ చెక్స్

తీర్పు అబద్ధం

వాయనాడ్ లో ప్రియాంక గాంధీ ర్యాలీ అంటూ వైరల్ అవుతున్నది, కేరళ లోని కాసర్గోడ్ లో జరిగిన 2019 నాటి ర్యాలీ.

క్లెయిమ్ ఏమిటి?

కాంగ్రెస్ అభ్యర్థి ప్రియాంక గాంధీ వాయనాడ్ నామినేషన్ ర్యాలీ అంటూ సామాజిక మాధ్యమాలలో ఒక వీడియో వైరల్ అవుతుంది. ఈ వీడియోలో కొంత మంది వ్యక్తులు ఆకు పచ్చ రంగు జెండాలు పట్టుకుని, ఆకు పచ్చ దుస్తులు ధరించి ఉండటం మనం గమనించవచ్చు. ఈ వీడియోని షేర్ చేస్తూ కొంత మంది యూజర్లు ఈ విధంగా రాసుకొచ్చారు, “ఇది__ మతానికి సంభందించిన ర్యాలీ అనుకునేరు పొరపాటు ... వాయినాడ్ లో కాంగ్రెస్ అభ్యర్థి శ్రీమతి ప్రియాంకా వాద్రా గారి నామినేషన్ ర్యాలి* *గమనిక: బిజెపి మతతత్వ పార్టీ నమ్మండి.” మరిన్ని ఆర్కైవ్ చేసిన క్లెయిమ్ లింకులను ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు.

వాయనాడ్ లోని బై పోల్ నేపధ్యం లో, అక్టోబర్ 23, 2024 నాడు, ప్రియాంక గాంధీ కేరళ లోని వాయనాడ్ నియోజకవర్గం నుండి నామినేషన్ దాఖలు చేసారు. గతం లో జరిగిన లోక్ సభ ఎన్నికలలో కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ రాయి బరేలి మరియు వాయనాడ్ నియోజక వర్గాల నుండి పోటీ చేసి రెండింటిలోను గెలిచినప్పటికీ, నిబంధనల దృష్యా వాయనాడ్ సీటు ను వదులుకోవాల్సి వచ్చింది. అనంతరం, ఎన్నికల కమిషన్ అక్కడ బైపోల్ ను నిర్వహించింది. ఇక్కడ ఎన్నికలు నవంబర్ 13, 2024 నాడు జరగనున్నాయి.

కానీ వైరల్ అవుతున్న వీడియో, ప్రియాంక గాంధీ నామినేషన్ ర్యాలీ కి సంభందించినది కాదు, ఇది 2019 లో కేరళ లోని కాసర్గోడ్ లో జరిగిన ర్యాలీ.

సామాజిక మాధ్యమాలలో వైరల్ అవుతున్న క్లెయిమ్ స్క్రీన్ షాట్ (సౌజన్యం : ఎక్స్/లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఎడిటింగ్) 

మేము ఏ విధంగా కనుగొన్నాము?

వైరల్ అవుతున్న క్లిప్ ని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, మాకు మే 2019 లో షేర్ చేసిన ఒక ఫేస్బుక్ పోస్ట్ లభించింది, ఇందులో కూడా అదే వైరల్ వీడియో ఉంది. ఈ పోస్టుకు హిందీ లో శీర్షికగా “వాయనాడ్ లో విజయోత్సవ సంబరాలు” అంటూ రాసుకొచ్చారు.

ఈ వీడియోను తీక్షణంగా పరీక్షిస్తే, 0:32 సెకెన్ల వద్ద, ఆమరణ సిల్క్స్ బజార్ అనే దుఖాణం పేరు  కనపడుతుంది. ఈ షాపును మేము కేరళలోని కాసర్గోడ్ జిల్లాలోని ఎం జి రోడ్డులో ఉంది అని గూగుల్ మ్యాప్స్ ద్వారా కనుగొన్నాము. గూగుల్ మ్యాప్స్ లో కూడా చుట్ట పక్కల ఉన్న దుఖాణాలు  పేర్లతో సరి చూస్తే, ఈ వీడియో కాసర్గోడ్ పరిసరాల లోనిదే అని అర్ధమవుతుంది.

వైరల్ క్లిప్ మరియు గూగుల్ మ్యాప్స్ మధ్య పోలిక (సౌజన్యం  : గూగుల్ మ్యాప్స్/స్క్రీన్ షాట్)

వైరల్ అవుతున్న వీడియోలో, యు డి ఎఫ్ మరియు గాంధీ పేర్ల తో నినాదాలు మనకి వినపడతాయి. పైగా, కమ్యూనిస్ట్ పార్టీ అఫ్ ఇండియా మార్క్సిస్ట్ సి పి ఐ (ఎం) పై వ్యంగ్యంగా నినాదాలు కూడా మనకు వినపడతాయి.
    
ఇంకాస్త పరిశోధించగా, ఆకు పచ్చ రంగు జెండా ఐ యు ఎం ఎల్ (ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్) కి చెందినది అని అర్ధమవుతుంది, ఇది యు డి ఎఫ్ కూటమిలో, ఈ పార్టీ ఒక ముఖ్య పార్టీ.

2019 లో నిర్వహించిన యు డి ఎఫ్ ర్యాలీ లో పాకిస్థానీ జెండాలు వాడారు అనే క్లెయిమ్ ని ఇండియా టుడే గతం లో నిజ నిర్ధారణ చేసింది. ఇందులో కాసర్గోడ్  ఐ యు ఎం ఎల్ ప్రెసిడెంట్ ఎం సి కమరుద్దీన్ చేసిన వ్యాఖ్యలు కూడా ఉన్నాయి, ఈయన మాట్లాడుతూ, ఈ వీడియో కాసర్గోడ్ కి సంబంధించినదే అని నిర్ధారించారు, ఈ ప్రచారం పేరు 2019 ‘కొట్టికలశం’ అని పెట్టినట్టుగా కూడా తెలియజేసారు. 

వీడియో లో వినపడుతున్న నినాదాల గురించి వివరిస్తూ, ఇక్కడ యు డి ఎఫ్ మరియు గాంధీ గురించి నినాదాలు చేశారు అని, ఎందుకంటే, అక్కడ ఉన్న కాంగ్రెస్ అభ్యర్థి, రాజమోహన్ ఉన్నిథన్ ఆ సంవత్సరం కాసర్గోడ్ నుండి పోటీ చేసి గెలిచినట్టుగా పేర్కొన్నారు.


పైగా, నామినేషన్ సమయం లో ప్రియాంక గాంధీ ర్యాలీ వీడియోలను కూడా మేము పరిశీలించాము. ఈ ర్యాలీ కి సంభందించిన వీడియో ను సన్ టివి అక్టోబర్ 23 నాడు లైవ్ స్ట్రీమ్ చేసింది. ఇందులో వైరల్ వీడియో మాదిరి క్లిప్ మనకి ఎక్కడా కనించలేదు. ఇక్కడ కొంత మంది ప్రజలు త్రివర్ణ రంగులలో ఉన్న బెలూన్లు మరియు ఆకుపచ్చ రంగు బెలూన్లు పట్టుకుని ఉండటం మనం చూడవచ్చు. 

తీర్పు  

కేరళలోని కాసర్గోడ్ లో 2019 లో ఐ యు ఎం ఎల్ పార్టీ ర్యాలీకి సంభందించిన వీడియోని తప్పుగా, వాయనాడ్ లో ప్రియాంక గాంధీ ర్యాలీ లాగ షేర్ చేస్తున్నారు.

(అనువాదం : రాజేశ్వరి పరసా)

Read this fact check in English here.

ఫ్యాక్ట్ చెక్ కోసం ఏదైనా క్లైమ్ మాకు సబ్మిట్ చేయదలుచుకుంటున్నారా లేదా మా సంపాదక బృందాన్ని సంప్రదించదలుచుకుంటున్నారా?

0 అంశాల వారీగా అన్వేషించండి

మన జీవితాలని ప్రభావితం చేసే నిర్ణయాలని మనం మనకి అందుబాటులో ఉన్న సమాచారం మేరకు తీసుకుంటాము. అయితే ఇంటర్నెట్ స్వభావరీత్యా తప్పుడు సమాచారం ఇప్పటివరకు కనీవినీ ఎరుగని రీతిలో ప్రజలకి చేరుతున్నది.