హోమ్ లోక్ సభ సభ్యుడు చంద్ర శేఖర్ ఆజాద్ టైమ్ మ్యాగజీన్ ముఖ చిత్రంగా ఉన్నట్టున్న ఫొటో ఫేక్

లోక్ సభ సభ్యుడు చంద్ర శేఖర్ ఆజాద్ టైమ్ మ్యాగజీన్ ముఖ చిత్రంగా ఉన్నట్టున్న ఫొటో ఫేక్

ద్వారా: తాహిల్ అలీ

జూలై 11 2024

ఈ కథనాన్ని షేర్ చెయ్యండి: facebook logo twitter logo linkedin logo
లోక్ సభ సభ్యుడు చంద్ర శేఖర్ ఆజాద్ టైమ్ మ్యాగజీన్ ముఖ చిత్రంగా ఉన్నట్టున్న ఫొటో ఫేక్ భీం ఆర్మీ వ్యవస్థాపకులు చంద్రశేఖర్ ఆజాద్ టైమ్ మ్యాగజీన్ మీద ముఖ చిత్రంగా ఉన్నట్టున్న ఫొటో స్క్రీన్ షాట్ (సౌజన్యం: ఎక్స్/ఇన్స్టాగ్రామ్/లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఎడిటింగ్)

ఫ్యాక్ట్ చెక్స్

ఫేక్

క్లైమ్ లో పేర్కొన్న మార్చ్ 1-8, 2021 నాటి టైమ్ మ్యాగజీన్ ముఖ చిత్రంగా ఉన్నది ఇంగ్లీష్ - అల్బేనియన్ గాయని దువ లిప.

క్లైమ్ ఏంటి?

టైమ్ మ్యాగజీన్ ముఖ చిత్రంగా లోక్ సభ్యుడు చంద్ర శేఖర్ ఆజాద్ ఉన్న ఫొటో అంటూ ఒక టైమ్ మ్యాగజీన్ ముఖ చిత్రం ఫొటోని సామాజిక మాధ్యమాలలో షేర్ చేస్తున్నారు. ఆజాద్ ఆజాద్ సమాజ్ పార్టీ (కాన్షీ రామ్) అనే ప్రాంతీయ పార్టీ అధినేత, అలాగే భీం ఆర్మీ అనే అంబేద్కరైట్ మరియు బహుజన హక్కుల కోసం పని చేసే సంస్థ వ్యవస్థాపకులు. 

“తదుపరి 100 మంది అత్యంత ప్రభావవంతమైన మనుషులు. వెలుగులోకి వస్తున్న నాయకుడు చంద్ర శేఖర్ ఆజాద్. రచయిత: సౌమ్య ఖండేల్వాల్,” అనేది ఈ ముఖ చిత్రం మీద ఉన్న శీర్షిక, దీని మీద మార్చ్ 1-8, 2021 అనే తారీఖు ఉంది.

“ఈ వ్యూహాత్మక ప్లేస్మెంట్ కి చాలా చరిత్ర ఉంది. భారత దేశాన్ని ముక్కలు చేయడానికి రాడికల్ కుల+ఇస్లామిస్ట్ కలయికకి భారీ అవకాశం ఉంది. ఇందులో 👇🏻 చాలా మందికి ఆ అవకాశం కనిపిస్తున్నది. ‘గ్లోబల్ పొజిషినింగ్’ లో పెను మార్పు చూడబోతున్నారు,” అనే శీర్షికతో ఒక యూజర్ ఈ ఫొటో ని షేర్ చేశారు.

భీం ఆర్మీ వ్యవస్థాపకులు చంద్రశేఖర్ ఆజాద్ టైమ్ మ్యాగజీన్ మీద ముఖ చిత్రంగా ఉన్నట్టున్న ఫొటో స్క్రీన్ షాట్ (సౌజన్యం: ఎక్స్/ఇన్స్టాగ్రామ్/లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఎడిటింగ్) 

ఇటువంటి పోస్ట్స్ ఆర్కైవ్స్ ఇక్కడ, ఇక్కడ, మరియు ఇక్కడ చూడవచ్చు.

అయితే, ఈ ఫొటో ఫేక్ అని మా పరిశోధనలో తేలింది. ఆజాద్ ముఖ చిత్రంగా టైమ్ మ్యాగజీన్ ఎటువంటి కవర్ ప్రచురించలేదు.

వాస్తవం ఏమిటి?

రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేస్తే ఇటువంటి కవర్ ఫొటో ఏదీ మాకు లభించలేదు. టైమ్ మ్యాగజీన్ మార్చ్ నెల సంచికలు అన్నీ చూశాము. ఎందులోనూ ఆజాద్ ముఖ చిత్రంగా కవర్ లేదు. 

అయితే మార్చ్ 1-8, 2021 నాటి టైమ్ సంచికలో ఆజాద్ గురించి చిన్న వ్యాసం మాత్రం దొరికింది. “అణిచివేతకి వ్యతిరేకంగా పోరాడుతున్న చంద్ర శేఖర్ ఆజాద్” అనేది ఈ వ్యాసం శీర్షిక.

ఇదే వ్యాసాన్నిటైమ్ మ్యాగజీన్ వెబ్సైట్ లో ఫిబ్రవరి 17, 2021 నాడు ప్రచురించారు. ఈ వ్యాసం లో వాడిన ఫొటో ముఖ చిత్రం పేరు మీద చలామణీ అవుతున్న ఫొటో వేరు వేరు. ఈ వ్యాసం లోని ఫొటోలో, ఆజాద్ చేతిలో పుస్తకం తో తెల్లని కార్ మీద కూర్చుని ఉన్నారు. ఈ ఫొటో సౌజన్యం సౌమ్య ఖండేల్వాల్ కి ఇచ్చారు. తను ఇండియా లో నివసించే ఫొటో జర్నలిస్ట్. వ్యాసకర్త పేరు బిల్లీ పెరీగో. తను టైమ్ మ్యాగజీన్ పాత్రికేయులు.

టైమ్ మ్యాగజీన్ స్క్రీన్ షాట్ (సౌజన్యం: TIME)

ఆజాద్ అధికారిక ఎక్స్ అకౌంట్ లో మాకోక పోస్ట్ (ఆర్కైవ్ ఇక్కడ) లభించింది. అందులో తను ఈ టైమ్ మ్యాగజీన్ వ్యాసాన్ని షేర్ చేశారు. అయితే, ఈ ఫొటో ముఖ చిత్రంగా వచ్చింది అని చెప్పలేదు. 

“ప్రపంచం లో వెలుగులోకి వస్తున్న 100 మంది నాయకుల పేర్లలో నా పేరు ఉండటం ఆనందకరం. భీం ఆర్మీ ని, సామాజిక న్యాయం కోసం మేము చేస్తున్న పోరాటాన్ని 2021 #TIME100 NEXTద్వారా  గుర్తించినందుకు @TIME కి ధన్యవాదాలు. బాహుజనుల ఆత్మ గౌర పోరాటాన్ని గుర్తించినట్టు అయ్యింది,” అని ఆజాద్ ఈ పోస్ట్ లో రాశారు.

దళితుల, ఇతర అణగారిన వర్గాల కోసం చేస్తున్నందుకు 'న్యాయవాదుల' కేటగిరీలో 2021 TIME NEXT లో ఆజాద్ పేరు చేర్చారు. భవిష్యత్తు ని నిర్ణయించే ఎదుగుతున్న 100 మంది నాయకుల జాబితా అయిన TIME100 ఫ్రాంచైజే ఈ TIME 100 NEXT.

ఒరిజినల్ కవర్

మార్చ్ 1-8. 2021 నాటి టైమ్ మ్యాగజీన్ ఒరిజినల్ కవర్ లో ఉంది దువ లిప. తను ఇంగ్లీష్ - అల్బేనియన్ గాయని. కవర్ ఫొటో సౌజన్యం టైమ్ కి చెందిన మికయ కార్టర్ కి ఇచ్చారు.

ఒరిజినల్ కవర్, వైరల్ కవర్ దాదాపుగా ఒకేలాగా ఉన్నాయి. కాకపోతే ఒరిజినల్ కవర్ లో “పాప్ సంచలనం దువ లిప. రచయిత: కైల్ మినోగ్,” అని శీర్షిక ఉంది. అలాగే ఒరిజినల్ టైమ్స్ మస్త్ హెడ్ బాగా స్పష్టంగా ఉంది. వైరల్ దాంట్లో బాగా మందంగా ఉంది.

అలాగే, ఒరిజినల్ కవర్ లో ఇతర వ్యాసాల పేర్లు కూడా ఉన్నాయి. అలాగే పైన కుడి వైపు మార్చ్ 1/మార్చ్ 8 2021 అనే తారీఖు ఉంది. అలాగే ఎర్ర గీత దగ్గర “double issue”, “time.com” అని ఉంది. దీని బట్టి ఈ కవర్ మీద ఆజాద్ ఫొటో పెట్టారు అని అర్థం అవుతుంది.

ఒరిజినల్ కవర్, వైరల్ కవర్ మధ్య పోలికలు (సౌజన్యం: స్క్రీన్ షాట్/TIME/ఎక్స్)

ఆజాద్ ఫొటో 

వైరల్ కవర్ లో వాడిన ఆజాద్ ఫొటో ఎక్కడిదో మేము తెలీసుకోలేకపోయాం కానీ 2019 నుండి సామాజిక మాధ్యమ  పోస్టులలో, వార్తా కథానాలలో ఈ ఫొటో వాడుతున్నారని తెలుసుకున్నాము.

2024 లోక్ సభ ఎన్నికలలో ఆజాద్ ఉత్తర ప్రదేశ్ లోని ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గమైన నగీన నియోజకవర్గం నుండి గెలుపొందారు. 

తీర్పు

భీం ఆర్మీ వ్యవస్థాపకులు చంద్ర శేఖర్ ఆజాద్ ముఖ చిత్రంగా టైమ్ మ్యాగజీన్ సంచికని ప్రచురించలేదు. అయితే, ‘న్యాయవాదుల’ కేటగిరీలో 2021 లో ‘TIME100 NEXT’ జాబితాలో తనని చేర్చారు. మార్చ్ 1-8,2021 నాటి ఒరిజినల్ టైమ్ మ్యాగజీన్ సంచిక కవర్ లో ఉన్నది దువ లిప అనే గాయని.

(అనువాదం : గుత్తా రోహిత్)

0 అంశాల వారీగా అన్వేషించండి

మన జీవితాలని ప్రభావితం చేసే నిర్ణయాలని మనం మనకి అందుబాటులో ఉన్న సమాచారం మేరకు తీసుకుంటాము. అయితే ఇంటర్నెట్ స్వభావరీత్యా తప్పుడు సమాచారం ఇప్పటివరకు కనీవినీ ఎరుగని రీతిలో ప్రజలకి చేరుతున్నది.