ద్వారా: ఉమ్మే కుల్సుం
నవంబర్ 28 2023
ఈ వీడియోని మొదటిగా మే 2023 లో ఇండోనేషియాకి సంబంధించిన సామాజిక మాధ్యమ పేజీలో షేర్ చేసారు.
క్లెయిమ్ ఏమిటి?
భారతీయ నటి అలియా భట్ అంటూ ఒక వీడియో సామాజిక మాధ్యమాలలో వైరల్ అయ్యింది. ఆ వీడియోలో ఒక యువతి ఒక లైట్ రంగులో ఉన్న కో- ఆర్డ సెట్ దుస్తులు ధరించి మంచం మీద కూర్చుని కెమెరా కి పోజ్ ఇస్తూ ఉంది. మొదటిగా ఈ వీడియో సెప్టెంబర్లో షేర్ అయ్యింది. (ఆర్కైవ్ ఇక్కడ), మరల అదే వీడియో, ఈమధ్య కాలంలో ఆ వీడియోలో ఉన్నది అలియా భట్ అంటూ వైరల్ అయ్యింది. అలాంటి పోస్టుల ఆర్కైవ్ ఇక్కడ మరియి ఇక్కడ చూడవచ్చు.
డీప్ ఫేక్ వీడియోని షేర్ చేసిన పోస్ట్స్ స్క్రీన్ షాట్స్ (సౌజన్యం : ఫేస్బుక్/ లాజికల్లి ఫ్యాక్ట్స్ ఎడిటింగ్)
అయితే ఇది డీప్ ఫేక్ వీడియో.
వాస్తవం ఏమిటి?
వైరల్ వీడియోని తీక్షణంగా పరీక్షిస్తే అందులో కొన్ని లొసుగులు ఉన్నట్టు మనకు అర్దమవుతుంది. వీడియోలో అలియా భట్ పెదాల కదలిక సహజంగా లేదు,.అలాగే చాలా చోట్ల ముఖ అంచుల్లో మసక బారినట్టు కుడా కనపడుతుంది. ఇవన్నీ మనకి ఈ వీడియో డిజిటల్ గా ఎడిట్ చేయబడినది అని తెలియజేస్తున్నాయి.
వీడియో లో అలియా భట్ ముఖం వద్ద మసకగా కనిపిస్తున్న గీతలు (సౌజన్యం: ఫేస్బుక్/స్క్రీన్ షాట్)
మేము రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా మాకు అర్ధమయింది ఏమిటంటే, చాలా మంది ఈ వీడియోని షేర్ చేశారని. అయితే అందులో ఉన్న యువతి అలియా భట్ కాదు. అందులో ఉన్న వ్యక్తి ఆ ఒరిజినల్ వీడియోని తన ఫేస్బుక్ పేజీలో మే నెలలో షేర్ చేసింది. అవే దుస్తులు ధరించి తాను మరొక వీడియో కుడా అప్లోడ్ చేసింది. ఆ పేజీలో అది పర్సనల్ బ్లాగ్ అని పేర్కొని ఉంది. అలాగే ఇండోనేషియన్ భాష లో కుడా మరిన్ని పోస్టలు ఉన్నాయి. ఈ పేజీలో ఉన్న ఫోన్ నెంబర్ కి కుడా ఇండోనేషియా కాలర్ కోడ్ ఉంది. మా అంచనా ప్రకారం ఈ వీడియోలో అలియా భట్ ముఖాన్నిపెట్టి షేర్ చేసారు.
ఈ డీప్ ఫేక్ వీడియోల వల్ల నష్టపోయిన వారిలో ఇంతకు మునుపు భారతీయ నటీమణులు రష్మిక మందన్న మరియు కాజోల్ కుడా ఉన్నారు. దేశ ప్రధాని నరేంద్ర మోదీ కుడా ఈమధ్యన మాట్లాడుతూ ఈ డీప్ ఫేక్ ల వలన ఇబ్బందులను వెల్లడించి, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
తన లాగా ఉండే వికాస్ మహంతే అనే వ్యక్తి డాన్స్ చేస్తున్న వీడియోని ప్రధాని ఒక గర్బా కార్యక్రమంలో నృత్యం చేస్తున్నట్టుగా షేర్ చేశారు.
లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఇంతకుముందు ఇలాంటి వైరల్ డీప్ ఫేక్ వీడియోలను డీబంక్ చేసింది. వాటిని, ఇక్కడ, ఇక్కడ, మరియు ఇక్కడ చూడవచ్చు. ఈ డీప్ ఫేక్ లను మరియు కృత్రిమ మేధతో తయారు చేసిన వీడియోలను ఎలా కనుక్కోవాలో మీరు ఇక్కడ తెలుసుకోవచ్చు.
తీర్పు :
భారతీయ నటీమణి అలియా భట్ కో-ఆర్డ్ సెట్ వేసుకుని కెమెరాకి పోజ్ ఇస్తూన్నట్టు వైరల్ అయిన వీడియో డీప్ ఫేక్.