హోమ్ ఎరుపు రంగు బికినీలో వైరల్ అవుతున్న నటి రష్మిక మందన్న ఫొటో డీప్ ఫేక్

ఎరుపు రంగు బికినీలో వైరల్ అవుతున్న నటి రష్మిక మందన్న ఫొటో డీప్ ఫేక్

ద్వారా: ఉమ్మే కుల్సుం

మే 27 2024

ఈ కథనాన్ని షేర్ చెయ్యండి: facebook logo twitter logo linkedin logo
ఎరుపు రంగు బికినీలో వైరల్ అవుతున్న నటి రష్మిక మందన్న ఫొటో డీప్ ఫేక్ బికినీలో రష్మిక మందన్నగా వైరల్ అవుతున్న ఫొటో స్క్రీన్ షాట్ (సౌజన్యం : ఫేస్బుక్/లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఎడిటింగ్)

ఫ్యాక్ట్ చెక్స్

తీర్పు ఫేక్

దానియేల విల్లారియల్ ఫొటోని కృత్రిమ మేధా సంపత్తి ద్వారా రష్మిక మందన్న ఫొటోగా మార్చారు.

క్లెయిమ్ ఏమిటి?

సామాజిక మాధ్యమాలలో నటి రష్మిక మందన్న ఒక ఎరుపు రంగు బికినీ వేసుకుని జల పాతం వద్ద నిలబడి ఉన్నట్టు ఒక వీడియో, ఫేస్బుక్, ఇంస్టా గ్రామ్ మరియు యూట్యూబ్ మాధ్యమాలలో వైరల్ అవుతుంది. అలాంటి ఒక పోస్టుకు, ఈ కథనం రాసే సమయానికి 45,000 వేలకు పైగా లైక్స్ మరియు 300లకు పైగా షేర్స్ ఉన్నాయి. ఆర్కైవ్ చేసిన ఆ ఆ పోస్టును ఇక్కడ చూడవచ్చు.

కానీ ఈ వీడియో డీప్ ఫేక్ వీడియో. ఈ వీడియో ఒక మోడల్ అయినటువంటి దానియేల విల్లారియల్ (ఆర్కైవ్ ఇక్కడ) ఫొటో.

లోటు పాట్లు 

ఆ ఫొటోని తీక్షణంగా చూస్తే, చివర్లో కళ్ళ కదలికలు మనకి బిన్నంగా కనిపిస్తాయి, కిందకి చూసేటపుడు, కుడి కన్ను మనకి వేరుగా కనిపిస్తుంది, దీని ద్వారా ఇది డీప్ ఫేక్ అయి ఉండొచ్చని మేము అనుకున్నాము. 
 

లోటు పాట్లను ఎంచి చూపే స్క్రీన్ షాట్ (సౌజన్యం : ఫేస్బుక్/ స్క్రీన్ షాట్) 

అసలు వీడియో ఎక్కడిది?

ఈ వీడియోకి సంబంధించి రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, onlybikinimodel అనే ఇంస్టా గ్రామ్ అకౌంట్ లభించింది (ఆర్కైవ్ ఇక్కడ), ఇక్కడ ఒకేరకమైన దుస్తులు ధరించిన వేరు వేరు మహిళలు ఉన్నారు. వైరల్ వీడియో మాదిరి వీడియోలో ఒక పోస్ట్ కింద, @danielavillarreal_a అని రాసి ఉంది.

మేము ఆ ఇంస్టాగ్రామ్ అకౌంట్ చూడగా, అక్కడ మాకు ఈ వైరల్ వీడియో లాంటి మరో పోస్ట్ కనపడింది (ఆర్కైవ్ ఇక్కడ), దీనిని ఏప్రిల్ 19, 2024 నాడు పోస్ట్ చేయబడింది. 

అదే బికినీ లో మరి కొన్ని ఫొటోలు కుడా ఏప్రిల్ నెలలో తన ప్రొఫైల్ లో ఉన్నాయి. ఆర్కైవ్ చేసిన ఆ పోస్టులను ఇక్కడ చూడవచ్చు.

ఈ వీడియోని ఇతిజార్ అనే టూల్ లో కుడా మేము నిర్ధారించాము, ఈ టూల్ ని ఐఐటి జోధాపూర్ కి చెందిన వారు తాయారు చేసింది, అక్కడి ప్రొఫెసర్ మయాంక్ వత్సా దీనిని డీప్ ఫేక్ అని కచ్చితమైన రేటింగ్ తో చెప్పారు. దీనిలో భాగంగా ఇక్కడ స్వాప్పింగ్ పద్ధతి వాడి మొహాన్ని మార్చారు అని తెలిపారు.

వత్సా అక్కడ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ లో ఒక ప్రొఫెసర్, మరియు శక్తి సమూహం యొక్క సింథెటిక్ మీడియా అండ్ డీప్ ఫేక్ అడ్వైసోరీ కౌన్సిల్ లో మెంబెర్ కుడా.

నవంబర్ 2023 లో కుడా రష్మిక మందన్న మరో డీప్ ఫేక్ వీడియో వైరల్ అయింది. ఆ తరువాత భారత ప్రభుత్వం అలాంటి వాటి గురించి కంప్లైంట్ వచ్చిన 24 గంటలలో తీసివేయాలి అని ఉత్తర్వులు కుడా జారీ  చేశారు.

లాజికల్లీ ఫ్యాక్ట్స్ గతం లో కుడా ఇలాంటి వీడియోలను ఫ్యాక్ట్ చెక్ చేసింది, వాటిని ఇక్కడ చదవ వచ్చు. డీప్ ఫేక్ ఫోటోలను వీడియోలను ఏ విధంగా కనుక్కోవాలని తెలియడానికి మా కథనం ఇక్కడ చదవండి.

తీర్పు :

మాకు లభించిన ఆధారాల మేరకు, రష్మిక మందన్న వీడియో డీప్ ఫేక్ అని నిర్ధారించాము.

(గమనిక : మేము దానియేలని కుడా ఈ వీడియో నిర్ధనకు సంప్రదించాము. ఆమె స్పందన రాగానే ఈ కథనాన్ని అప్డేట్ చేస్తాము)

ఫ్యాక్ట్ చెక్ కోసం ఏదైనా క్లైమ్ మాకు సబ్మిట్ చేయదలుచుకుంటున్నారా లేదా మా సంపాదక బృందాన్ని సంప్రదించదలుచుకుంటున్నారా?

0 అంశాల వారీగా అన్వేషించండి

మన జీవితాలని ప్రభావితం చేసే నిర్ణయాలని మనం మనకి అందుబాటులో ఉన్న సమాచారం మేరకు తీసుకుంటాము. అయితే ఇంటర్నెట్ స్వభావరీత్యా తప్పుడు సమాచారం ఇప్పటివరకు కనీవినీ ఎరుగని రీతిలో ప్రజలకి చేరుతున్నది.