హోమ్ ఉత్తరాఖండ్ లో సొరంగం కూలిన చోట సహాయక చర్యల బృందం ఫొటో అంటూ కృత్రిమ మేధ ద్వారా సృష్టించిన ఫొటోని వివిధ వార్తా సంస్థలు షేర్ చేశాయి

ఉత్తరాఖండ్ లో సొరంగం కూలిన చోట సహాయక చర్యల బృందం ఫొటో అంటూ కృత్రిమ మేధ ద్వారా సృష్టించిన ఫొటోని వివిధ వార్తా సంస్థలు షేర్ చేశాయి

ద్వారా: రజిని కె జి

నవంబర్ 30 2023

ఈ కథనాన్ని షేర్ చెయ్యండి: facebook logo twitter logo linkedin logo
ఉత్తరాఖండ్ లో సొరంగం కూలిన చోట సహాయక చర్యల బృందం ఫొటో అంటూ కృత్రిమ మేధ ద్వారా సృష్టించిన ఫొటోని వివిధ వార్తా సంస్థలు షేర్ చేశాయి ఈ వైరల్ ఫొటోని జాతీయ విపత్తు నిర్వహణ ప్రాధికార సంస్థ వారు తమ అధికారిక ఎక్స్ అకౌంట్ లో షేర్ చేశాక అనేక వార్తా సంస్థలు అక్కడ నుండి తీసుకుని ప్రచురించాయి (సౌజన్యం: ఎక్స్/స్క్రీన్ షాట్/లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఎడిటింగ్)

ఫ్యాక్ట్ చెక్స్

తీర్పు ఫేక్

ఈ ఫొటోని మొదట ఎక్స్ లో షేర్ చేసిన వ్యక్తి ఇది కృత్రిమ మేధ ద్వారా సృష్టించిన ఫొటో అని స్పష్టం చేశారు , ఈ ఫొటోలో అనేక లొసగులు ఉన్నాయి కూడా.

నేపధ్యం

ఉత్తరాఖండ్ లో సొరంగం కూలిణ 17 రోజుల తరువాత అందులో ఇరుక్కున్న 41 మందిని నవంబర్ 28 నాడు రక్షించారు. దీనితో 400 గంటల పాటు జరిగిన సహాయక చర్యలు ముగిశాయి.

ఇది జరిగిన ఒక రోజు తరువాత సహాయక చర్యలలో పాల్గొన్న అధికారులు జాతీయ జెండా పట్టుకుని బృంద ఫొటోకి పోజు ఇస్తున్నట్టున్న ఫొటో ఒకటి వైరల్ అయ్యింది. భారత ప్రభుత్వం ఆధ్వర్యంలో పని చేసి జాతీయ విపత్తు నిర్వహణ ప్రాధికార సంస్థఅధికారిక ఎక్స్ అకౌంట్ కూడా ఈ ఫొటోని షేర్ చేసింది. 

కార్మికులని సొరంగంలో నుండి బయటకి తీసుకురావడం గురించి వార్తా ఏజెన్సీ సంస్థ పిటీఐ సంస్థ రాసిన ఒక కథనంలో కూడా ఈ ఫొటోని జతపరిచారు (ఆర్కైవ్ ఇక్కడ). ఇదే ఫొటోని ది న్యూ ఇండియన్ ఎక్స్ప్రెస్, మాతృభూమి, నార్త్ ఈస్ట్ లైవ్, న్యూస్ 18 లాంటి వార్తా సంస్థలు కూడా షేర్ చేశాయి. ఇదే ఫొటోని ఎక్స్ లో కూడా కొంత మంది ఎటువంటి శీర్షిక లేకుండా షేర్ చేశారు (ఆర్కైవ్ ఇక్కడ). అన్నాడిఏంకే నాయకులు మరియు తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి  పళనిస్వామి కూడా ఈ ఫొటోని షేర్ చేశారు (ఆర్కైవ్ ఇక్కడ).  అలాగే కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ కూడా (ఆర్కైవ్ ఇక్కడ). 

ఇతర సామాజిక మాధ్యమలలో కూడా ఈ ఫొటో చాలా తొందరగా వైరల్ అయ్యింది. 

సామాజిక మాధ్యమ యూజర్లు, వార్తా సంస్థలు షేర్ చేసిన ఫొటో స్క్రీన్ షాట్ (సౌజన్యం: ది న్యూ ఇండియన్ ఎక్స్ప్రెస్/టైమ్స్ ఆఫ్ ఇండియా/ఇండియా టుడే/లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఎడిటింగ్)

అయితే ఇది నిజం ఫొటో కాదు. కృత్రిమ మేధ సృష్టించిన ఫొటో.

వాస్తవాలు

ఈ ఫొటోని జాగ్రత్తగా గమనిస్తే అనేక లొసుగులు కనిపించాయి. ఇందులో ఉన్న వారి ముఖాలు- ముఖ్యంగా కళ్ళ చుట్టూ ఉన్న ప్రాంతం- అసహజంగా ఉన్నాయి. అలాగే కొంతమందికి ఐదు కన్నా ఎక్కువ వ్రేళ్ళు ఉన్నాయి. ఇది డిజిటల్ గా సృష్టించిన ఫొటో అనేదానికి ఇవి సంకేతాలు. మనుషుల చేతి వ్రేళ్ళ సంఖ్య విషయంలో కృత్రిమ మేధ ద్వారా యాప్స్ తత్తరపడతాయి అనే విషయం బాగా తెలిసిన విషయమే. దీని బట్టి ఇది డిజిటల్ గా సృష్టించిన ఫొటో అని మేము అర్థం చేసుకున్నాము. 

ఈ ఫొటోలో కొట్టొచ్చినట్టు కనిపిస్తున్న లొసుగులు (సౌజన్యం: ఎక్స్. స్క్రీన్ షాట్/లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఎడిటింగ్)

అలాగే ఒక ఎక్స్ యూజర్ షేర్ చేసిన ఇదే ఫొటోలో “ఎక్స్క్లూసివ్ మైండ్స్” అనే లోగో ఒకటి మాకు కనిపించింది. ఈ ఫొటోని ఒరిజినల్ గా ఎక్స్ లో @Exclusive_Minds అనే యూజర్ షేర్ చేశారని తెలుసుకున్నాము.

ఈ ఎకౌంట్ బయో లో “సామాజిక మాధ్యమాలలో తప్పుడు సమాచారాన్ని , తప్పుదోవ పట్టించే సమాచారాన్ని డీబంక్ చేస్తున్న పౌరుల కలెక్టివ్” అని ఉంది. సహాయక చర్యల బృందానికి చెందిన అనేక ఇతర ఫొటోలని కూడా ఈ అకౌంట్ వారు షేర్ చేశారు. అలా షేర్ చేస్తూ ఒక చోట చాలా స్పష్టంగా “ఇది కృత్రిమ మేధ ద్వారా సృష్టించిన ఫొటో” అని తెలిపారు. 

ఎక్స్ యూజర్ ‘ఎక్స్క్లూసివ్ మైండ్స్’ ఇచ్చిన జవాబు స్క్రీన్ షాట్ (సౌజన్యం: ఎక్స్)

అయితే ఇదే యూజర్ ఈ ఫొటోని తయారు చేశారా లేదా వేరే వారు చేసింది షేర్ చేశారా అనే విషయమైతే మేము తెలుసుకోలేకపోయాము. అయితే ఇది కృత్రిమ మేధ ద్వారా సృష్టించిన ఫొటో అనేది మాత్రం మనకి స్పష్టమయ్యింది.

పీటిఐకి సంపాదక బృందానికి చెందిన ఒక సీనియర్ సభ్యులు తాము ఈ ఫోటోను విశ్వసనీయ వర్గాల నుండి తీసుకున్నామని, అందులో ఒక పార్లమెంట్ సభ్యునికి చెందిన సామాజిక మాధ్యమ హ్యాండిల్ కూడా ఉందని, అయితే తాము రాబోయే రోజులలో “విశ్వసనీయ వర్గాల నుండి సమాచారం సేకరించేటప్పుడు కూడా జాగ్రత్తగా ఉంటామని” తెలిపారు.

తీర్పు

అనేక వార్తా సంస్థలు సొరంగంలో ఇరుక్కున్న కార్మికులని రక్షించిన సహాయాక చారితల బృందం ఫొటో అంటూ కృత్రిమ మేధ ద్వారా సృష్టించిన ఫొటోని షేర్ చేశారు. కాబట్టి ఈ క్లైమ్ ఫేక్ అని మేము నిర్ధారించాము.

(ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా వారు ఇచ్చిన జవాబుతో ఈ కాపీని అప్డేట్ చేశాము.)

(అనువాదం- గుత్తా రోహిత్)

ఫ్యాక్ట్ చెక్ కోసం ఏదైనా క్లైమ్ మాకు సబ్మిట్ చేయదలుచుకుంటున్నారా లేదా మా సంపాదక బృందాన్ని సంప్రదించదలుచుకుంటున్నారా?

0 అంశాల వారీగా అన్వేషించండి

మన జీవితాలని ప్రభావితం చేసే నిర్ణయాలని మనం మనకి అందుబాటులో ఉన్న సమాచారం మేరకు తీసుకుంటాము. అయితే ఇంటర్నెట్ స్వభావరీత్యా తప్పుడు సమాచారం ఇప్పటివరకు కనీవినీ ఎరుగని రీతిలో ప్రజలకి చేరుతున్నది.