ద్వారా: రాహుల్ అధికారి
ఏప్రిల్ 18 2024
ఒరిజినల్ వీడియోలో, రణ్వీర్ సింగ్ ప్రధానిని పొగిడారు, ఈ వీడియోని ఎడిట్ చేసి కృత్రిమంగా రణ్వీర్ మాటలను జోడించారు.
క్లెయిమ్ ఏమిటి ?
2024 ఎన్నికలకు ఒక రోజు ముందు, బాలీవుడ్ నటుడు రణ్వీర్ సింగ్ మాట్లాడుతూ ప్రధాని నరేంద్రమోదీ ని విమర్శిస్తున్నట్టు మరియు కాంగ్రెస్ ని పొగుడుతున్నట్టు ఉన్న ఒక వీడియో వైరల్ అయింది.
వైరల్ వీడియోలో రణ్వీర్ ఏ ఎన్ ఐ జర్నలిస్ట్ తో హిందీలో మాట్లాడుతూ, “ఇదే మోదీజీ ద్యేయం, అయన మన భాధ తర జీవితాలను, నిరుద్యోగాన్ని, పెరుగుతున్న ధరలని చూసి సంబరాలు చేసుకోవటం ఆయన ధ్యేయం. భారతదేశం చాలా వేగంగా అన్యాయం వైపు నడుస్తుంది, కానీ మనం ఎప్పుడు కుడా మన అభివృద్ధి గురించి న్యాయం గురించి మారవ కూడదు. అందుకే మనం ఓటు వేసే ముందు అలోచించి వెయ్యాలి,” అని ఉంది. ఇందులో చివరగా “న్యాయానికి ఓటు వేయండి, కాంగ్రెస్ కు ఓటు వేయండి అని కుడా ఉంది.
అనేక మంది యూజర్లు ఈ వీడియోని షేర్ చేసి కాంగ్రెస్ కు ఓటు వేయమని కోరారు. ఆర్కైవ్ చేసిన పోస్టులను ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు.
సామాజిక మాధ్యమాలలో షేర్ అవుతున్న పోస్ట్లు (సౌజన్యం : ఎక్స్/ లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఎడిటింగ్)
కానీ ఈ వీడియోని ఒక ఫేక్ ఆడియో క్లిప్ జత చేసి మార్చినట్టుగా మేము కనుగొన్నము. పైగా, ఈ క్లిప్ ని కాంగ్రెస్ అధికార ప్రతినిధి, సుజాత పాల్ కుడా షేర్ చేసారు (ఆర్కైవ్ ఇక్కడ ), దీని కింద కామెంట్లలో డీప్ ఫేక్ వీడియో అని తెలిపారు.
ఈ వీడియో ఎక్కడిది?
రణ్వీర్ ఏ ఎన్ ఐ వార్త ఏజెన్సీ తో మాట్లాడుతున్న వీడియో అని మేము గమించాము. దీని ద్వారా వారి యూట్యూబ్ ఛానల్ లో ఒరిజినల్ వీడియో వెతికాము. ఇది ఏప్రిల్ 16, 2024 నాడు షేర్ చేస్తూ శీర్షిక గా బాలీవుడ్ నటుడు రణ్వీర్ సింగ్ ప్రధాని మోదీ ముందు చూపుని పొగుడుతున్నారు పెట్టారు.
ఈ వీడియోలో నటుడు, “ఇది నాకు చాలా సంతోషాన్ని గలగజేస్తుంది, ఇది మోదీజీ పని, ఆయన ధ్యేయం, మన సాంప్రదాయాన్ని, చరిత్ర ని వారసత్వాన్ని గురించి సంబరాలు చేసుకోవటం. భారతదేశం ఒక నవ అభివృద్ధి వైపు పరుగులుతీస్తుంది, కానీ మన సాంప్రదాయ వారసత్వం లో ఉన్న మన వేర్లను మాత్రం మారవ కూడదు.” ఈ ఏ ఎన్ ఐ వీడియో, 58 సెకన్లు నిడివి లో ఉంది, ఇందులో నుంచి, మొదటి 36 సెకన్లు వాడి ఒక ఫేక్ ఎలక్షన్ కాంపెయిన్ మెసేజ్ తయారు చేసారు.
మొత్తం 2:33 నిడివి గల రణ్వీర్ ఇంటర్వ్యూ, ఏ ఎన్ ఐ ఎక్స్ అకౌంట్ లో కుడా పబ్లిష్ చేసారు. ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియో 1:15 నుండి 1:51 మధ్య నుండి తీశారు.
ఈ ఇంటర్వ్యూని ఏప్రిల్ 16 నాడు రణ్వీర్ సింగ్ మరియు బాలీవుడ్ నటి కృతి సనాన్ వారణాసి విచ్చేసి నపుడు తీశారు.
ఈ వైరల్ వీడియోని ఎలా తయారు చేసారు?
రణ్వీర్ సింగ్ మాటలలో నుండి కొన్ని మాటలను మార్చి ఈ వైరల్ వీడియోని తాయారు చేసారు. సింగ్ మాట్లాడింది, “ఆయన ధ్యేయం, మన సాంప్రదాయాన్ని, చరిత్ర ని వారసత్వాన్ని గురించి సంబరాలు చేసుకోవటం.” కానీ వైరల్ వీడియో లో “ ఆయన ధ్యేయం, మన భాధతర జీవితాలను, నిరుద్యోగాన్ని, పెరుగుతున్న ధరలని చూసి సంబరాలు చేసుకోవటం” అని మార్చారు.
వైరల్ వీడియోలో రణ్వీర్ సింగ్ మాటలకూ పెదాల కదలిక కు ఏ మాత్రం పొంతన లేదు, దీని వలన ఈ వీడియోని కృత్రిమంగా మార్చి ఉండొచ్చు అని అర్ధం అవుతుంది.
ఈ మధ్య కాలం లో ఇలానే బాలీవుడ్ నటుడు ఆమిర్ ఖాన్ వీడియో కుడా ఎడిట్ చేసి ఆయన కాంగ్రెస్ కు ఓటు వేయమన్నట్టుగా షేర్ చేసారు.
తీర్పు :
నటుడు రణ్వీర్ సింగ్ వీడియోని కృత్రిమంగా మార్చి ఆయన కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తున్నట్టుగా షేర్ చేసారు. ఒరిజినల్ వీడియోలో ఆయన మోడీని పొగుడుతున్నారు, కాంగ్రెస్ కి ఎటువంటి మద్దతు ప్రకటించలేదు.
(అనువాదం : రాజేశ్వరి పరస)