హోమ్ ఢిల్లీ ముఖ్యమంత్రి అతిషి, జై శ్రీ రామ్ నినాదానికి క్షమాపణ చెప్పలేదు

ఢిల్లీ ముఖ్యమంత్రి అతిషి, జై శ్రీ రామ్ నినాదానికి క్షమాపణ చెప్పలేదు

ద్వారా: మొహమ్మద్ సల్మాన్

అక్టోబర్ 3 2024

ఈ కథనాన్ని షేర్ చెయ్యండి: facebook logo twitter logo linkedin logo
ఢిల్లీ ముఖ్య మంత్రి అతిషి జై శ్రీ రామ్ నినాదాలకు గాను క్షమాపణ చెప్పినట్టుగా వైరల్ అవుతున్న పోస్ట్ స్క్రీన్ షాట్ ఢిల్లీ ముఖ్య మంత్రి అతిషి జై శ్రీ రామ్ నినాదాలకు గాను క్షమాపణ చెప్పినట్టుగా వైరల్ అవుతున్న పోస్ట్ స్క్రీన్ షాట్ (సౌజన్యం : ఎక్స్/ఫేస్బుక్/ లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఎడిటింగ్)

ఫ్యాక్ట్ చెక్స్

తీర్పు అబద్ధం

వైరల్ వీడియో క్లిప్ చేయబడింది. ఒరిజినల్ వీడియో లో అతిశీ తన ప్రసంగం లో వీధి పేరును తప్పుగా చేప్పినందుకు క్షమాపణ తెలిపారు.

క్లెయిమ్ ఏమిటి?

సామాజిక మాధ్యమాలలో ఒక వీడియో వైరల్ అవుతుంది. ఇందులో ఢిల్లీ ముఖ్యమంత్రి అతిషి తన ప్రసంగాన్ని  ‘జై శ్రీ రామ్’ అనే పదంతో మొదలు పెట్టినందుకు, ఆ కాలనీ లోని ముస్లింలు తన ప్రసంగాన్ని అడ్డుకున్నట్టుగాను, ఇందుకు గాను, ఆ తరువాత అతిశీ క్షమాపణ చెప్పినట్టుగాను క్లెయిమ్ తో షేర్ చేసారు.

16,000 మంది ఫాల్లోవెర్లు ఉన్న ఒక వెరిఫైడ్ X (పూర్వపు ట్విట్టర్) యూజర్ '@Vini__007,' ఈ వీడియోను షేర్ చేస్తూ “ఢిల్లీలోని ఆమ్ ఆద్మీ పార్టీ చెందిన ముఖ్యమంత్రి అతిషి మర్లేనా, శ్రీరామ్ కాలనీ సందర్శించి, 'జై శ్రీరామ్' అంటూ తన ప్రసంగాన్ని ప్రారంభించినప్పుడు, అక్కడ ఉన్న ముస్లిం మతస్థులు ఆగ్రహానికి గురయ్యారు, పైగా ఆమె 'జై శ్రీరామ్' అని ఎందుకు పలికారు అని ప్రశ్నించారు. దీంతో అతిషి మార్లెనా వెంటనే క్షమాపణలు చెప్పారు,” అనే శీర్షకతో షేర్ చేసారు.

ఇదే విధమైన వ్యాఖ్యలతో ఫేస్బుక్ లో కుడా పోస్ట్ చేసారు, వాటి ఆర్కైవ్ చేసిన పోస్టులను ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు. ఈ వీడియో ఏప్రిల్ 2024లో కూడా వైరల్ అయింది.

వైరల్ పోస్టుల స్క్రీన్ షాట్స్ (సౌజన్యం : ఎక్స్/ఫేస్బుక్/ లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఎడిటింగ్)

కానీ ఈ విధంగా వైరల్ అవుతున్న క్లెయిమ్ తప్పు. ఎందుకంటే, ఆ వీడియో అతిషి ఢిల్లీ కి విద్యా శాఖా మంత్రిగా ఉన్నప్పుడు, మార్చ్ 2024 లో ఒక పాఠశాల పారరంభోత్సవ సమయంలో జరిగినది. తన ప్రసంగంలో  ‘శ్రీ రామ్ కాలనీ’ అనే పేరు బదులుగా ‘ఖజూరి ఖాస్’ అని తప్పుగా సంబోధించడం వల్ల  తాను క్షమాపణలు తెలిపారు.

వాస్తవం ఏమిటి? 

మరి కాస్త నిడివి గల ఇదే వీడియో ఏప్రిల్  2024 లో కుడా అదే విధమైన వ్యాఖ్యలతో వైరల్ అయినట్టుగా మా పరిశోధనలో తేలింది. ఇందులో కొంత మంది, అతిషి తన ప్రసంగం లో ఆ ప్రాంతం పేరు తప్పుగా చెప్పినట్టు గుర్తించారు, పైగా ఆ కాలనీ పేరు శ్రీ రామ్ కాలనీ అని ఖజూరి ఖాస్ ఎక్కడి నుండి వచ్చింది అని అడిగారు.

దానికి జవాబుగా అతిషి మాట్లాడుతూ, “‘శ్రీ రామ్ కాలనీ’  లో ఉంటున్న ప్రజలు నన్ను క్షమించండి. ఈ  బడి శ్రీ రామ్ కాలనీ ఉంది. ఇందులో  శ్రీ రామ్ కాలనీ, ఖజూరి ఖాస్, కార్వాల్ నగర్ మరియు సోనియా విహార్ లో నివసించే పిల్లలు కూడా చదువుతారు,” అని చెబుతుంది. కానీ వైరల్ వీడియో లో ఈ జవాబుకు సంబంధించి ప్రసంగాన్ని క్లిప్ చేయడం జరిగింది. 

 లాజికల్లీ ఫాక్ట్స్ అతిషి పూర్తి ప్రసంగానికి సంబంధించిన ఒరిజినల్ వీడియోని పరీక్షించింది. ఆ ప్రసంగాన్ని  మార్చ్ 9, 2024 న డైరెక్టరేట్ అఫ్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ లో లైవ్ స్ట్రీమ్ చెయ్యడం జరిగింది (ఆర్కైవ్ ఇక్కడ).  ఆ వీడియో లో 32:10 నిమిషాల వ్యవధి వద్ద, అతిషి తన ప్రసంగం మొదలుపెట్టారు, ఇందులో తాను ‘భారత్ మాతాకి జై’, వందే మాతరం’  మరియు ‘ఇంక్విలాబ్ జిందాబాద్’ అని మొదలుపెడుతుంది. తాను ఎక్కడ కూడా ‘ జై శ్రీ రామ్’ అని అనలేదు.

ఆ ఒరిజినల్ వీడియో లో 41:15 నిమిషాల వ్యవధి వద్ద, హాజరు అయినవారు అభ్యంతరం వ్యక్తం చేయగా, దానికి జవాబుగా “ఏమైంది సోదరా? కూర్చోండి”. ఇంతలో ఒక వ్యక్తి అతిషి వద్దకు వచ్చి ఈ బడి ‘శ్రీ రామ్ కాలనీ’ పేరు మీద ప్రారంభించడం జరిగింది, ఖజూరి ఖాస్ కాదు. శ్రీ రామ్ కాలనీ అని చెప్పండి’ అని రాసి ఉంది.

తర్వాత అతిశీ “శ్రీరామ్ కాలనీ వాసులకు నేను క్షమాపణలు చెప్పాలనుకుంటున్నాను. ఇది శ్రీ రామ్ కాలనీలోని పాఠశాల, ఇక్కడ శ్రీ రామ్ కాలనీ, ఖజూరి ఖాస్, కరవాల్ నగర్ మరియు సోనియా విహార్‌లోని పిల్లలు అందరూ చదువుతారు.”

ఆ వీడియో లో అతిషికి చిట్టి అందజేస్తున్న వ్యక్తిని శ్రీరామ్ నగర్‌కు చెందిన ఆమ్ ఆద్మీ పార్టీ కౌన్సిలర్ మహ్మద్ అమీల్ మాలిక్ అని మేము గుర్తించాము. వివరణ కోసం ఆయనను సంప్రదించినప్పుడు, మాతో మాట్లాడుతూ, “స్కూల్‌కు శ్రీ రామ్ కాలనీ పేరు పెట్టారు, కాని అతిషి జీ దీనిని ఖజురీ ఖాస్ అని పలికారు, దీనిని అక్కడి ప్రజలు వ్యతిరేకించారు. ఆమె తర్వాత సరిదిద్దుకున్నారు” అని తెలిపారు. అతిషి "జై శ్రీరామ్" అని నినాదాలు చేయలేదని ఆయన మాతో ధృవీకరించారు.

మనం ఆ వీడియో లో అతిషి క్షమాపణలు కోరినట్లు స్పష్టంగా చూడవచ్చు,  కానీ అది స్కూల్ పేరును తప్పుగా ప్రస్తావించినందుకు కాదు, మరియు ఆమె తన ప్రసంగంలో ఏ సమయంలోనూ "జై శ్రీ రామ్" అని నినాదాలు చేయలేదు.

అతిషి ఎక్స్ అకౌంట్ పోస్ట్ స్క్రీన్ షాట్ (సౌజన్యం : @ AtishiAAP/X)

తీర్పు 

తన ప్రసంగంలో శ్రీరాం కాలనీని, ఖజూరీ ఖాస్ అని తప్పుగా ప్రస్తావించినందుకు అతిషి క్షమాపణలు చెప్పినట్లు మా పరిశోధన నిర్ధారించింది. "జై శ్రీరాం" అని నినాదాలు చేసినందుకు ఆమె క్షమాపణలు చెప్పిందన్న వాదన తప్పు.

(అనువాదం : రాజేశ్వరి పరసా) 

ఫ్యాక్ట్ చెక్ కోసం ఏదైనా క్లైమ్ మాకు సబ్మిట్ చేయదలుచుకుంటున్నారా లేదా మా సంపాదక బృందాన్ని సంప్రదించదలుచుకుంటున్నారా?

0 అంశాల వారీగా అన్వేషించండి

మన జీవితాలని ప్రభావితం చేసే నిర్ణయాలని మనం మనకి అందుబాటులో ఉన్న సమాచారం మేరకు తీసుకుంటాము. అయితే ఇంటర్నెట్ స్వభావరీత్యా తప్పుడు సమాచారం ఇప్పటివరకు కనీవినీ ఎరుగని రీతిలో ప్రజలకి చేరుతున్నది.