హోమ్ ఎడిట్ చేసిన ఫొటోని టైమ్స్ స్క్వేర్ పై తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ చిత్రం అన్నట్టు షేర్ చేసారు

ఎడిట్ చేసిన ఫొటోని టైమ్స్ స్క్వేర్ పై తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ చిత్రం అన్నట్టు షేర్ చేసారు

ద్వారా: తాహిల్ అలీ

సెప్టెంబర్ 5 2024

ఈ కథనాన్ని షేర్ చెయ్యండి: facebook logo twitter logo linkedin logo
సామాజిక మాధ్యమాలలో న్యూయార్క్ లోని టైమ్స్ స్క్వేర్ లో తమిళనాడు ముఖ్య మంత్రి ఎం కె స్టాలిన్ ఫొటో అంటూ వైరల్ అయిన స్క్రీన్ షాట్ సామాజిక మాధ్యమాలలో న్యూయార్క్ లోని టైమ్స్ స్క్వేర్ లో తమిళనాడు ముఖ్య మంత్రి ఎం కె స్టాలిన్ ఫొటో అంటూ వైరల్ అయిన స్క్రీన్ షాట్ (సౌజన్యం: ఎక్స్/ లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఎడిటింగ్)

ఫ్యాక్ట్ చెక్స్

ఫేక్

ఒరిజినల్ ఫొటో 2009 నాటి ఫొటో అని మేము గుర్తించాము, ఇక్కడ వివిధ వస్తువుల గురించిన ప్రకటనలు ఉన్నాయి.

క్లెయిమ్ ఏమిటి?

సామాజిక మాధ్యమాలలో ఒక ఫొటో వైరల్ అవుతుంది, ఇందులో తమిళ నాడు ముఖ్య మంత్రి ఎం కె స్టాలిన్ ఫొటో అమెరికా లోని న్యూ యార్క్ టైమ్స్ స్క్వేర్ పై ఆయన ప్రకటన వచ్చింది అంటూ షేర్ చేశారు.

ఆయన ఫొటో కింద, ఇతర వ్యక్తుల ఫొటోలతో పాటు తమిళనాడు పరిశ్రమల శాఖ మంత్రి అయిన టి ఆర్ బి రాజా ని అమెరికాకు ఆహ్వానించినట్టు ఫొటో కుడా ఉంది. ఆగష్టు 29 నాడు స్టాలిన్ అమెరికాల లో పెట్టుబడుల కోసం సెన్ ఫ్రాన్సిస్కో మరియు చికాగో నగరాలకు వెళ్లారు.

వైరల్ అవుతున్న బిల్ బోర్డు పై ఇంగ్లీష్ లో ఈ విధంగా రాసి ఉంది, “సామాజిక న్యాయానికి, సమానత్వానికి మరియు తమిళ గౌవరవనికి నాయకుడిగా ఉండే మా గౌరవ తమిళనాడు ముఖ్య మంత్రి ముత్తువేల్ కరుణానిధి స్టాలిన్ కు స్వాగతం.” ఈ వ్యాఖ్యల కింద పరిశ్రమల శాఖ మంత్రి టి ఆర్ బి రాజా ని కుడా అమెరికా కి ఆహ్వానిస్తున్నట్టు ఉంది. పైగా “#CMStalininUS” అని కుడా ఉంది.

ఎక్స్ లో ఒక యూజర్ ఈ పోస్టును షేర్ చేసి, “తమిళనాడు ముఖ్యమంత్రి ఎం కె స్టాలిన్ న్యూ యార్క్ లోని టైం స్క్వేర్ పై. ప్రస్తుతం ఆయన అమెరికా పర్యటన లో ఉన్నారు.” అని రాసి ఉంది. ఈ కథనం రాసే సమయానికి ఆ పోస్టుకు 250,000 కు పైగా వ్యూస్ మరియు 5,000 కు పైగా లైక్స్ ఉన్నాయి. ఆర్కైవ్ చేసిన అలాంటి పోస్టులను ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు.

వైరల్ ఫొటో స్క్రీన్ షాట్ (సౌజన్యం : ఎక్స్/ లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఎడిటింగ్)

న్యూస్ 18 తమిళ్ నాడు, ది ఇండియన్ ఎక్ష్ప్రెస్స్ తమిళ్, ఐ బి సి తమిళ్ మరియు పుతియాతలైమురై టివి కుడా ఈ ఫొటో గురించి కథనాలు రాశాయి.   

కానీ మా పరిశోధన ప్రకారం, ఈ వైరల్ ఫొటో ఎడిట్ చేయబడినది. ఒరిజినల్ ఫొటోలో వివిధ ఉత్పత్తుల గురించి ప్రకటనలు ఉన్నాయి.
 
వాస్తవం ఏమిటి?

రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా ఇలాంటి టైమ్స్ స్క్వేర్ ఫొటోలే పలు వెబ్సైట్లలో ఇలాంటి ప్రకటనలతోనే ఉన్నాయి, కానీ ఇక్కడ స్టాలిన్ ఫొటో లేదు.

అమెరికా లోని చారిత్రాత్మక కట్టడాల గురించి పొందుపరిచే ది క్లియో అనే వెబ్సైటులో ఇలాంటి ఫొటో ఉంది, దీనికి శీర్షికగా, “వన్ టైమ్స్ స్క్వేర్” అని ఉంది, ఈ ఫొటోను క్రెడిట్ చేస్తూ, ఒక నాన్ ప్రాఫిట్ సంస్థ నంటుకెట్ ప్రిజర్వేషన్ ట్రస్ట్ అని ఉంది.

నంటుకెట్ ప్రిజర్వేషన్ ట్రస్ట్ వెబ్సైటును పరిశీలించగా జనవరి 2015 లో ఇలాంటి మరో ఫొటో ఉంది, దీనికి శీర్షికగా, “ఫ్రైడే ఫైండ్: హిస్టరీ అఫ్ వన్ టైమ్స్ స్క్వేర్” అని ఉంది. ఈ ఫొటో ఎప్పటిది, ఎవరు తీశారు అనే వివరాలు తెలుపకపోయినా, ఆ భవనం పై 2013 అని ఉంది.

ఒరిజినల్ ఫొటో స్క్రీన్ షాట్ (సౌజన్యం: నంటుకెట్ ప్రిజర్వేషన్ ట్రస్ట్)

ఒరిజినల్ ఫొటో ఎక్కడిది?

ఇంకాస్త పరిశోధించగా, ఈ ఫొటోను సెప్టెంబర్ 2011 లో ఫేస్బుక్ లో అప్లోడ్ చేసినట్టు తెలుస్తుంది (ఆర్కైవ్ ఇక్కడ). వైరల్ ఫొటో మాదిరి ప్రకటనలే ఇక్కడ చూడవచ్చు, ఇక్కడ భవనం పై 2009 అని ఉంది. 

మేము ఈ ఫొటోను ఆధారితం చేసుకునే వైరల్ ఫొటో తయారు చేసి ఉండవచ్చు అని నిర్ధారించాము. వైరల్ ఫొటో మరియు ఒరిజినల్ ఫొటో రెండింటిలోనూ, ఒకే మాదిరి యు ఎఫ్ సి పోస్టర్ ఉంది, దీనిలో సెప్టెంబర్ నెలలో ఒక శనివారం రోజున ఒక పోరాటం గురించి ప్రకటన ఉంది. మేము యు ఎఫ్ సి అధికారిక ఫేస్బుక్ పేజీ లో కుడా ఈ పోస్టర్ కి సంబందించిన అంశాన్ని చూసాము (ఆర్కైవ్ ఇక్కడ), ఇక్కడ ఉన్న వీడియోలో సెప్టెంబర్ 19 నాడు, 2009 లో ఒక పోరాటం ఉన్నట్టుగా పేర్కొంది, ఆ రోజు కుడా ఒక శనివారమే.  

పైగా ఒక ఇంస్టాగ్రామ్ యూజర్ కుడా ఇలాంటి ఫొటోనే 2023 లో షేర్ చేసి (ఆర్కైవ్ ఇక్కడ) ఇది 2009 లో టైమ్స్ స్క్వేర్ వద్ద ఫొటో అని తెలిపారు. వికీమీడియా కామన్స్ ప్రకారం కుడా సెప్టెంబర్ 13, 2009 నాడు అలాంటి ప్రకటనలతోనే ఆ ఫొటో ఉంది.

ఒరిజినల్ ఫొటో లో తోషీబా, టీడీకే, చేవరోలేట్, బడ్వెయుసేర్, న్యూస్ కార్పొరేషన్, పానాసోనిక్ మరియు యాహు లాంటి సంస్థల ప్రకటనలు ఉన్నాయి. వైరల్ ఫొటో లో పైన ఉన్న నాలుగు ప్రకటనలను అలాగే ఉంచి, కింద ఉన్న ప్రకటనలను మార్చి ఇది 2024 లాగ చేశారు.

వైరల్ ఫొటో మరియు ఒరిజినల్ ఫొటో స్క్రీన్ షాట్లు (సౌజన్యం : ఎక్స్/ఫేస్బుక్: Times Square Extraordinaire)

తీర్పు :

టైమ్స్ స్క్వేర్ పై తమిళనాడు ముఖ్య మంత్రి ఎం కె స్టాలిన్ అంటూ వైరల్ అవుతున్న ఫొటో డిజిటల్ గా ఎడిట్ చేయబడినది. అంతకు ముందు ఉన్న ప్రకటనలను ఎడిట్ చేసి ఈ విధంగా షేర్ చేసారు.

(అనువాదం : రాజేశ్వరి పరసా)



0 అంశాల వారీగా అన్వేషించండి

మన జీవితాలని ప్రభావితం చేసే నిర్ణయాలని మనం మనకి అందుబాటులో ఉన్న సమాచారం మేరకు తీసుకుంటాము. అయితే ఇంటర్నెట్ స్వభావరీత్యా తప్పుడు సమాచారం ఇప్పటివరకు కనీవినీ ఎరుగని రీతిలో ప్రజలకి చేరుతున్నది.