హోమ్ క్లిప్ చేసిన వీడియోని చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ను విమర్శిస్తున్నారంటూ షేర్ చేసారు

క్లిప్ చేసిన వీడియోని చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ను విమర్శిస్తున్నారంటూ షేర్ చేసారు

ద్వారా: రాజేశ్వరి పరస

ఆగస్టు 29 2024

ఈ కథనాన్ని షేర్ చెయ్యండి: facebook logo twitter logo linkedin logo
చంద్రబాబు నాయుడు డిప్యూటీ ముఖ్య మంత్రి పవన్ కళ్యాణ్ ను విమర్శిస్తున్నారు అనే క్లెయిమ్ తో ఉన్న పోస్టు స్క్రీన్ షాట్ చంద్రబాబు నాయుడు డిప్యూటీ ముఖ్య మంత్రి పవన్ కళ్యాణ్ ను విమర్శిస్తున్నారు అనే క్లెయిమ్ తో ఉన్న పోస్టు స్క్రీన్ షాట్ (సౌజన్యం : ఎక్స్/లాజికల్లీ ఫ్యాక్ట్స్)

ఫ్యాక్ట్ చెక్స్

తీర్పు అబద్ధం

ఒరిజినల్ వీడియోలో, ఆంధ్ర ముఖ్య మంత్రి నాయుడు మాజీ ముఖ్య మంత్రి జగన్ మోహన్ రెడ్డి ని విమర్శిస్తున్నారు

క్లెయిమ్ ఏమిటి? 

ఒక 21 సెకన్ల వీడియో క్లిప్ ని షేర్ చేసి, ఇందులో ఆంధ్ర ప్రదేశ్ ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు సామాజిక మాధ్యమాలలో తన డిప్యూటీ ముఖ్య మంత్రి పవన్ కళ్యాణ్ ని విమర్శిస్తున్నారు అనే విధంగా క్లెయిమ్ చేశారు. ఈ వీడియోలో నాయుడు మాట్లాడుతూ, “ఇప్పుడు ఉన్నాడు, మన మిత్రుడు పవన్ కళ్యాణ్, నేను పోతే. మీరొక విషయం చూడండి, మా కంటే గొప్ప వ్యక్తా? పెద్ద చదువుకున్నాడా, నెత్తిన రూపాయి పెట్టి వేళం వేస్తే పైసా కి పోడు, అలాంటి వ్యక్తి ఏమేమి చేసాడో మీరే చూసారు.”

ఆర్కైవ్ చేసిన అలాంటి పోస్టులను ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు.

సామాజిక మాధ్యమాలలో వైరల్ అవుతున్న పోస్టు స్క్రీన్ షాట్ (సౌజన్యం : ఎక్స్/ లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఎడిటింగ్)

కానీ ఇది తప్పుదారి పట్టించే విధంగా ఉంది. ఈ వీడియోని ఆగష్టు 23 నాడు ఆంధ్ర ప్రదేశ్ లో నాయుడు ఒక గ్రామా సభలో ప్రసంగిస్తుండగా తీసినది. ఆ సన్నివేశాన్ని అసంధర్బంగా షేర్ చేసి పవన్ కళ్యాణ్ ని అన్నట్టుగా చూపారు. నిజానికి ఆయన మాట్లాడుతుంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి గురించి.

వాస్తవం ఏమిటి?

వైరల్ వీడియోలో కీ ఫ్రేమ్స్ ని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, చంద్రబాబు నాయుడు ఈ మధ్య కోనసీమ జిల్లా లోని కొత్తపేట నియోజకవర్గంలో నిర్వహించిన గ్రామ సభ వీడియోలకు దారి తీసింది. 

వైరల్ వీడియోకి సంభంధించిన ఒరిజినల్ వీడియోని, చంద్రబాబు నాయుడు తమ యూట్యూబ్ ఛానల్ లో ఆగష్టు 23 వ తారీకున అప్లోడ్ చేశారు (ఆర్కైవ్ ఇక్కడ). ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోని ఇక్కడ మనం 10:55 నుండి 11:13 మధ్య చూడవచ్చు.

ఈ వీడియోలో, ముఖ్య మంత్రి నాయుడు మాజీ ముఖ్య మంత్రి జగన్ మోహన్ రెడ్డిని ‘సైకో’ అనే ఒక అవమానకరమైన పదం వాడి విమర్శించటం కుడా చూడవచ్చు.

గ్రామా సభ మీటింగులో మాట్లాడుతూ నాయుడు గ్రామాలకు సంపూర్ణ అభివృద్ధి చేస్తామని వాగ్దానం చేసి, గత ప్రభుత్వం లో జగన్ రెడ్డి ‘నిర్లక్ష్యం’ చేసాడు అని తెలిపారు.

ఇక్కడ 8:35 నిమిషాల వద్ద రెడ్డి ని సంబోధిస్తూ, “గడిచిన మూడు నెలలలో ఎప్పుడైనా మాజీ ముఖ్య మంత్రి జగన్ ని కానీ వైఎసార్సీపి కార్యకర్తలని కానీ ఎక్కడైనా ఆపామా? (గ్రామాలకి రాకుండా). ఇలాంటి వ్యక్తులు ఈ సమాజానికి చేటు, ఆ ఉద్యమం మీ దగ్గరనుంచే రావాలి. మొన్న ఎన్నికలలో తెలుగు దేశం పార్టీ పెట్టి 42 సంవత్సరాలు అయినప్పటికీ మొదటి సారిగా, 93 శతంతో గెలిపించి, బ్రహ్మరథం పట్టించింది ఈ ప్రజానీకమే. అన్ని జిల్లాలలో 100 శతం గెలిపించారు. 57 శాతం ఓట్లు వేశారు, అంటే అవతల పాలన, ఎంత మీకు భాద కలిగించిందో, ఎంత అసౌకర్యం కలిగించిందో, ఇది ఒక ఉదాహరణ.” 

ఇక్కడ 10:55 నిమిషాల వ్యవధి వద్ద, నాయుడు వైరల్ వీడియోలో ఉన్న మాటలు మాట్లాడటం చూడవచ్చు, “ఇప్పుడు ఉన్నాడు మన మిత్రుడు పవన్ కళ్యాణ్, నేను పోతే. మీరొక విషయం చూడండి, మా కంటే గొప్ప వ్యక్తా (జగన్) ? పెద్ద చదువుకున్నాడా? నెత్తిన రూపాయి పెట్టి వేళం వేస్తే పైసా కి పోడు, అలాంటి వ్యక్తి ఏమేమి చేసాడో మీరే చూసారు. అందుకే, నేను మిమ్మల్ని కోరేది, ఒకసారి పోల్చి చూసుకోవాలి అని. 2014-19 లో 27,444 కిలోమీటర్ల సిమెంట్ రోడ్డు వేసాము. మేము ఉండి ఉంటే నూటికి నూరు శతం సిమెంట్ రోడ్లు అయిపోయేది. గత అయిదు సంవత్సరాలలో 6,643 కిలోమీటర్లు వేశారు.”

ఎం9 మరియు ఏబిపి తెలుగు వార్త సంస్థలు కుడా ఈ ప్రసంగాన్ని గురించి ప్రచురిస్తూ, నాయుడు జగన్ ని విమర్శించినట్టుగా పేర్కొన్నాయి.

తీర్పు

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు ఈ మధ్య ఒక కార్యక్రమంలో ఇచ్చిన ప్రసంగాన్ని, అసంధర్బంగా క్లిప్ చేసి, డిప్యూటీ ముఖ్య మంత్రి పవన్ కళ్యాణ్ ని విమర్శించినట్టు షేర్ చేసారు. ఒరిజినల్ వీడియోని పూర్తిగా చూస్తే, నాయుడు, వైఎస్సార్సీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి గురించి మాట్లాడినట్టు అర్ధమవుతుంది.

(అనువాదం: రాజేశ్వరి పరసా)

ఫ్యాక్ట్ చెక్ కోసం ఏదైనా క్లైమ్ మాకు సబ్మిట్ చేయదలుచుకుంటున్నారా లేదా మా సంపాదక బృందాన్ని సంప్రదించదలుచుకుంటున్నారా?

0 అంశాల వారీగా అన్వేషించండి

మన జీవితాలని ప్రభావితం చేసే నిర్ణయాలని మనం మనకి అందుబాటులో ఉన్న సమాచారం మేరకు తీసుకుంటాము. అయితే ఇంటర్నెట్ స్వభావరీత్యా తప్పుడు సమాచారం ఇప్పటివరకు కనీవినీ ఎరుగని రీతిలో ప్రజలకి చేరుతున్నది.