ద్వారా: ఉమ్మే కుల్సుం
జూన్ 3 2024
వైరల్ అవుతున్న పోస్టులో ఉన్నది ఎబిపి ప్రచురించిన ఎన్నికల ముందటి అభిప్రాయ సర్వే, దీనిని ఏప్రిల్ 16 నాడు లోక్ సభ ఎన్నికలు మొదలవ్వక ముందే విడుదల చేశారు.
క్లెయిమ్ ఏమిటి?
జూన్ 1 నాడు 2024 భారతీయ ఎన్నికలు ముగిసిన తరుణంలో, అనేక మంది సామాజిక మాధ్యమ యూజర్లు, ఏబీపీ వార్త ఛానల్ స్క్రీన్ షాట్ షేర్ చేసి, అది ఆంద్ర ప్రదేశ్ కి సంబంధించిన ఎగ్జిట్ పోల్ ఫలితాలు అన్నట్టుగా షేర్ చేసారు, ఇందులో జన సేన పార్టీ, తెలుగు దేశం పార్టీ మరియు భారతీయ జనతా పార్టీ కూటమి, అనగా ఎన్డీయే, లోక్ సభ ఎన్నికలలో గెలవనున్నట్టుగా ఉంది.
ఆ స్క్రీన్ షాట్ ని జూన్ 1 నాడు మధ్యాహ్నం షేర్ చేస్తూ, ఏబీపీ -సీ ఓటర్ ఎగ్జిట్ పోల్ ఫలితాల ప్రకారం ఎన్డీఏ కూటమి 20 సీట్లు గెలుస్తుందని, వైసీపీ 5 సీట్లు గెలుస్తుందని క్లైమ్ చేశారు.
అలాంటి పోస్ట్లు ఫేస్బుక్ లో కుడా షేర్ చేసారు, ఆర్కైవ్ చేసిన పోస్టులను ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు.
సామాజిక మాధ్యమాలలో వైరల్ అవుతున్న పోస్ట్ స్క్రీన్ షాట్ (సౌజన్యం : ఎక్స్/ఫేస్బుక్/లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఎడిటింగ్)
జూన్ 1 నాడు ఏబీపీ సీ ఓటర్ ఎగ్జిట్ పోల్ సాయంత్రం 6:30 తరువాత విడుదల అయ్యింది, ఇందులో ఎన్డీఏ కూటమి కి 21 నుండి 25 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని, వైఎసార్సీపికి 0-4 సీట్లు వస్తాయని తెలిపింది. దీని బట్టి, వైరల్ అవుతున్న స్క్రీన్ షాట్ ఎన్నికల ముందు జరిగిన సర్వే అని తెలుసుకున్నాము.
మేము ఏమి కనుగొన్నాము?
యూజర్లు పోస్ట్ చేసిన ఎగ్జిట్ పోల్ ఫలితాలు, జూన్ 1 మధ్యాహ్నం నాడు షేర్ చేశారు. అప్పటికి ఏబీపీ సీ ఓటర్ ఎగ్జిట్ పోల్ ఫలితాలు ఇంకా విడుదల అవ్వలేదు.
ఎన్నికల సంఘం ఎగ్జిట్ పోల్ ఫలితాలను జూన్ 1 నాడు సాయంత్రం 6:30 తరువాత మాత్రమే విడుదల చేయాలి అని ఆదేశాలు జారీ చేసింది, ఎందుకంటే అప్పటికి మొత్తం 7 విడతల ఎన్నికలు పూర్తి అవుతాయి.
మా పరిశోధన ప్రకారం, వైరల్ అవుతున్న స్క్రీన్ షాట్, ఏప్రిల్ 16, 2024 నాడు, ఏబీపీ వెబ్సైటు ప్రచురించింది అని అర్థమైంది. ఈ కథనం ప్రకారం, ఏప్రిల్ 19 నాడు ఎన్నికలు ప్రారంభం అవ్వక ముందు, సేకరించిన ఓటర్ అభిప్రాయ సర్వే ఫలితాల స్క్రీన్ షాట్ అది. ఈ అభిప్రాయ సేకరణనను, ఏబీపీ మొత్తం 543 లోక్ సభ నియోజకవర్గాలలో మార్చ్ 11 నుండి ఏప్రిల్ 12, 2024 వరకు చేసి ఎన్డీఏ కూటమికి 46 శాతం ఓట్లు నమోదు అవుతాయని అంచనా వేశారు. ఇతరత్రా రాష్ట్రాలలో అనగా, ఉత్తర్ ప్రదేశ్, రాజస్థాన్, మధ్య ప్రదేశ్, ఇతర రాష్ట్రాలు మరియు తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ తో సహా ఎన్డీఏ కూటమి ఇక్కడ ఎంత శాతం ఓట్లు పడతాయి అని అంచనా వేశారు.
ఈ పరిశోధన ఫలితాలను వివరిస్తూ, బీజేపీకి ఇకపై కర్ణాటక మరియు ఆంధ్ర ప్రదేశ్ లో ఎలా ఉండబోతుంది అనే అంశాలను కుడా కథనంలో ఉన్నాయి. ఈ అభిప్రాయ సర్వే ప్రకారం, ఎన్డీఏకి ఆంధ్రలో 20 పైగా లోక్ సభ స్థానాలు వస్తాయని, వైఎసార్సీపీకి 5 సీట్లు వస్తాయని తెలిపింది. ఇదే సమాచారాన్ని వైరల్ అవుతున్న పోస్టులలో కుడా చూడవచ్చు, కానీ దీనిని తప్పుగా ఎగ్జిట్ పోల్ ఫలితాలుగా షేర్ చేసారు.
కానీ కథనం ప్రకారం, స్క్రీన్ షాట్ లో ఉన్న ఏబీపీ సీ ఓటర్ అభిప్రాయం సర్వే, ఇది ఎన్నికలకు ముందే జరిగింది.
ఎగ్జిట్ పోల్స్
అభిప్రాయ పోల్స్ అనేవి ఎన్నికలకు ముందుగా తీసుకునే సర్వేలు అయితే ఎగ్జిట్ పోల్స్ అనేవి, ఎన్నికల తరువాత, ఓటరు పోలింగ్ బూత్ నుండి బయటకి వచ్చిన తరువాత తీసుకునే సర్వేలు. ఎన్నికల సంఘం ఆదేశాల ప్రకారం, ఈ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను జూన్ 1, 6:30 తరువాతే విడుదల చెయ్యాలి.
ఇక్కడ గమనించవలసింది ఏమిటంటే, ఈ ఎగ్జిట్ పోల్ ఫలితాలు కేవలం సూచికలు మాత్రమే, కచ్చితమైన ఫలితాలు మార్పు చెందవచ్చు. 2024 లోక్ సభ ఎన్నికల ఫలితాలు జూన్ 4 నాడు తెలియజేస్తారు.
లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఇంతకు ముందు కుడా ఎగ్జిట్ పోల్స్ కి ఆపాదిస్తూ వైరల్ అయిన ఇతర క్లెయిమ్స్ ని నిర్ధారణ చేసింది. వాటిని ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ, మరియు ఇక్కడ చదవవచ్చు.
తీర్పు
ఏప్రిల్ 16, 2024 నాటి ఏబీపీ - సీ ఓటర్ అభిప్రాయ సర్వే ఫలితాలను, ఆంధ్ర ప్రదేశ్ లోక్ సభ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలుగా, వీటిలో ఎన్డీఏ కూటమి అత్యధిక సీట్లు సాధించినట్టుగా షేర్ చేసారు. కానీ ఈమధ్య ఏబీపీ - సీ ఓటర్ విడుదల చేసిన ఎగ్జిట్ పోల్ ఫలితాలు కుడా ఇంచుమించు ఈ విధమైన ఫలితాలే ఉన్న కారణంగా, మేము దీనిని తప్పుదోవ పట్టించేవిధంగా ఉంది అని నిర్ధారించాము.
(అనువాదం : రాజేశ్వరి పరసా)