హోమ్ యాత్ర 2 సినిమా చూడాలని ఆంధ్ర ప్రభుత్వం ఏ విధమయిన అధికారిక ప్రకటన ఇవ్వలేదు

యాత్ర 2 సినిమా చూడాలని ఆంధ్ర ప్రభుత్వం ఏ విధమయిన అధికారిక ప్రకటన ఇవ్వలేదు

ద్వారా: రాజేశ్వరి పరస

ఫిబ్రవరి 14 2024

ఈ కథనాన్ని షేర్ చెయ్యండి: facebook logo twitter logo linkedin logo
యాత్ర 2 సినిమా చూడాలని ఆంధ్ర ప్రభుత్వం ఏ విధమయిన అధికారిక ప్రకటన ఇవ్వలేదు సామాజిక మాధ్యమాలలో వైరల్ అవుతున్న పోస్ట్లు (సౌజన్యం : ఎక్స్/లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఎడిటింగ్)

ఫ్యాక్ట్ చెక్స్

తీర్పు ఫేక్

లాజికల్లీ ఫ్యాక్ట్స్ కి ఆంధ్ర ప్రభుత్వ అధికారి ఈ ప్రకటన ఫేక్ అని, అలాంటిది ఏమి వారు జారీ చేయలేదని తెలిపారు.

క్లెయిమ్ ఏమిటి ?

ఆంధ్ర ముఖ్య మంత్రి జీవితాధారంగా తెరకెక్కిన యాత్ర 2 చిత్రాన్ని జిల్లా కలెక్టర్లు అందరికి చుపించాలంటూ ఆంధ్ర ప్రభుత్వం ఒక అధికారిక ప్రకటన జారీ చేసింది అంటూ, ఒక లేఖ వైరల్ అయ్యింది.

ఈ లేఖ ఆంధ్ర ప్రదేశ్ యొక్క సాంఘిక సంక్షేమ శాఖ వారు ఫిబ్రవరి 7న జారీ చేసినట్టుగా ఉంది. ఇందులో, జిల్లా కలెక్టర్లు అందరు అంగన్వాడీ మరియు ఆశ వర్కర్లను మొదటి రెండు రోజులు ఈ సినిమా చూడటానికి ఏర్పాట్లు చేయవలసిందిగా ఉంది. పైగా గ్రామా వాలంటీర్లకు కుడా ఈ విషయం గురించి చెప్పి ఒక్కొక్కరిని కనీసం పది మంది సంక్షేమ కార్యక్రమాల లబ్దిదారులని అయినా తీసుకురావాలని అని చెప్పినట్టు ఉంది. 


ఈ లేఖ ను షేర్ చేస్తూ, ఒక ఫేస్బుక్ యూజర్, “ఏమిటి దారుణం, దరిద్రం, ఆంధ్రులు మరీ ఇంతగా అంధులువుతున్నారా??” అంటూ రాసి లేఖ లో ఉన్న కొన్ని విషయాలను తెలియజేసారు. ఆర్కైవ్ చేసిన పోస్టులను ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ, మరియు ఇక్కడ చూడవచ్చు. 


సామాజిక మాధ్యమాలలో వైరల్ అవుతున్న పోస్ట్లు (సౌజన్యం : ఎక్స్/లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఎడిటింగ్)


యాత్ర 2 అనేది, 2019 లో విడుదల అయిన యాత్ర సినిమాకి రెండో భాగం. యాత్ర సినిమా ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్య మంత్రి అయిన వై ఎస్ రాజశేఖర్ రెడ్డి జీవిత చరిత్ర అయితే, ఫిబ్రవరి 8 న విడుదల అయిన యాత్ర 2 జగన్ మోహన్ రెడ్డి గురించి ఉంటుంది. ఈ సినిమాని, ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికలకు వెళ్లబోయే కొన్ని నెలల ముందు విడుదల చేసారు.

కానీ ఆంధ్ర ప్రభుత్వం అధికారికంగా ఎలాంటి ప్రకటన ఇవ్వలేదు. ఇది కల్పితమయినది.

మేము ఏమి కనుగొన్నము?

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులను నిల్వ ఉంచే వెబ్సైటు లో వెతుకగా, సాంఘిక సంక్షేమ శాఖ నుండి ఫిబ్రవరి 7 న ఎటువంటి ఉత్తర్వులు విడుదల చేయలేదు, అదే కాక ఫిబ్రవరి 2021 తరువాత ఎటువంటి ఉత్తర్వులు ఆ శాఖ నుండి లేవు.

ఇలాంటి ఉత్తరువులు కనుక ఇచ్చి ఉంటె, వార్త సంస్థలు దీనిగురించి కథనాలు రాసి ఉండేవి, కానీ అటువంటివి ఏమి మాకు లభించలేదు. 

ఈ విషయం గురించి లాజికల్లీ ఫ్యాక్ట్స్ సాంఘిక సంక్షేమ శాఖ నుండి అధికారులను సంప్రదించగా, ఒక అధికారి, ఈ ఉత్తర్వులు నకిలీదని, వారు దీని గురించి సి ఐ డి కుడా ఫిర్యాదు చేసారని తెలిపారు.

ఈ లేఖ ను తీక్షణంగా పరీక్షిస్తే, మనకి ఇది కల్పితం అని అర్ధమవుతుంది. ఇందులో చీఫ్ సెక్రటరీ హోదా లో నీలం సహానీ సంతకం ఉంది, ఈవిడ డిసెంబర్ 2020 వరకు మాత్రమే ఆ పదవి లో ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్ర చీఫ్ సెక్రటరీ గా కే ఎస్ జవహర్ రెడ్డి ఉన్నారు. 

అధికారంలో ఉన్న వై ఎస్ ఆర్ సి పి పార్టీ కుడా ఎక్స్ లో ఈ ప్రకటన నకిలీదని నిర్ధారణ చేసింది. పైగా, దీనికి కారణం, ప్రతిపక్ష పార్టీలయిన తెలుగు దేశం పార్టీ మరియు జన సేన పార్టీ అని నిందించింది. 

తీర్పు :

యాత్ర 2 సినిమాని చూడడానికి జిల్లా కలెక్టర్లు ఏర్పాట్లు చేయాలంటూ ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఒక ప్రభుత్వ అధికారి దీనిని మాతో నిర్ధారించారు. కనుక మేము దీనిని ఫేక్ అని నిర్ధారించాము.

ఫ్యాక్ట్ చెక్ కోసం ఏదైనా క్లైమ్ మాకు సబ్మిట్ చేయదలుచుకుంటున్నారా లేదా మా సంపాదక బృందాన్ని సంప్రదించదలుచుకుంటున్నారా?

0 అంశాల వారీగా అన్వేషించండి

మన జీవితాలని ప్రభావితం చేసే నిర్ణయాలని మనం మనకి అందుబాటులో ఉన్న సమాచారం మేరకు తీసుకుంటాము. అయితే ఇంటర్నెట్ స్వభావరీత్యా తప్పుడు సమాచారం ఇప్పటివరకు కనీవినీ ఎరుగని రీతిలో ప్రజలకి చేరుతున్నది.