ద్వారా: రజిని కె జి
డిసెంబర్ 8 2023
వైరల్ అవుతున్న వీడియో నవంబర్ 27, 2023 నుండి వివిధ సామాజిక మాధ్యమాలలో ఉంది, దీనిలో కనిపిస్తున్నది రష్యా లో వచ్చిన బెట్టిన తుఫాను
క్లెయిమ్ ఏమిటి?
డిసెంబర్ 2, 2023 నాడు ఫిలిప్పీన్స్ లో 7.6 తీవ్రత గల భూకంపం సంభవించింది, దాని తరువాత ఆ దేశంలో సునామి కుడా వచ్చే అవకాశాలు ఉన్నాయి అని హెచ్చరిక జారీ అయ్యింది. ఆ తరువాత ఆ వార్నింగ్ తీసేసినప్పటికీ, ఆ భూకంపం వలన దాదాపుగా 500 కుటుంబాలు నష్టపోయాయి మరియు ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు.
ఈ సంఘటన తరువాత ఇంస్టాగ్రామ్ లో రెండు సన్నివేశాలున్న ఒక వీడియో వైరల్ అవుతుంది. మొదటి సన్నివేశంలో సి బి ఎస్ న్యూస్ చికాగో చూపిస్తున్న వార్త కథనం, దీనిలో ఫిలిప్పీన్స్ భూకంపం గురించి ఉంటుంది, రెండో సన్నివేశంలో, దూరం నుంచి అలలు ఎగసిపడటం ఉంటుంది. ఈ కథనం రాసే సమయానికి ఆ పోస్ట్ కు 11,000 వేల లైక్స్ ఉన్నాయి. ఆ పోస్ట్ ఆర్కైవ్ ఇక్కడ చూడవచ్చు.
ఆన్లైన్ లో షేర్ అవుతున్న వైరల్ పోస్ట్ స్క్రీన్ షాట్ (సౌజన్యం : ఇంస్టాగ్రామ్/ లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఎడిటింగ్)
మేము ఎలా కనుగొన్నము?
ఆ వైరల్ వీడియోని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేస్తే సి ఎన్ ఎన్ బ్రెజిల్ నవంబర్ 28, 2023 నాడు ప్రచురించిన ఒక కథనం లభించింది. ఆ రిపోర్ట్ కి శీర్షిక గా, “వీడియో: రష్యా లో వచ్చిన తుఫాన్ వలన 10 మీటర్ల ఎత్తులో అలలు” అని ఉంది. ఇందులో వైరల్ వీడియోలో ఉన్న చిత్రాలే, ఈ వీడియోలో 26 సెకన్ల వ్యవధి నుంచి చూడవచ్చు.
సి ఎన్ ఎన్ బ్రెజిల్ రిపోర్ట్ స్క్రీన్ షాట్ (సౌజన్యం : సి ఎన్ ఎన్ బ్రెజిల్/ స్క్రీన్ షాట్)
వెథర్ అప్డేట్స్ అనే ఒక యూట్యూబ్ ఛానల్ కుడా నవంబర్ 27 ఈ సంఘటన గురించి ఒక వీడియో అప్లోడ్ చేసింది, అందులో ఇది రష్యాలో జరిగింది అని ఉంది.
2023 బెట్టిన తుఫాన్
నవంబర్ 25, 2023 నాడు అడ్రియాటిక్ సముద్రంలో బెట్టిన తుఫాను మొదలయ్యి, నవంబర్ 26 నాటికి తీవ్రంగా మారింది. దీనివలన రష్యా లోని బ్లాక్ సీ తీరాన, లెస్బోస్ గ్రీక్ ఐలాండ్ లో మరియు ఉక్రెయిన్ లో పెద్ద అలలు, ఎడతెరిపి లేని వర్షాలు, తీవ్రమైన గాలి సంభవించాయి. వార్త కథనాల ప్రకారం, సోచి మరియు బాలకలవాలో రాకాసి అలలు, వరద సంభవించటమే కాకుండా క్రిమెయాలో ఇల్లులు కుడా ధ్వంసం అయ్యాయి. వాషింగ్ టన్ పోస్ట్ ప్రకారం, బెట్టిన తుఫాను మొతం 23 ప్రాణాలను బలి తీసుకుంది.
తీర్పు:
వైరల్ అవుతున్న వీడియో ఫిలిప్పీన్ భూకంపం కన్నా ముందే తీసింది. ఆ వీడియోలో కనిపించేది, రష్యాలో సంభవించిన బెట్టిన తుఫాను.