హోమ్ పాత వీడియోని ఈ మధ్య ముంబై గేట్వే అఫ్ ఇండియా వద్ద వచ్చిన వరద వీడియోలా షేర్ చేస్తున్నారు

పాత వీడియోని ఈ మధ్య ముంబై గేట్వే అఫ్ ఇండియా వద్ద వచ్చిన వరద వీడియోలా షేర్ చేస్తున్నారు

ద్వారా: వనితా గణేష్

జూలై 29 2024

ఈ కథనాన్ని షేర్ చెయ్యండి: facebook logo twitter logo linkedin logo
పాత వీడియోని ఈ మధ్య ముంబై గేట్వే అఫ్ ఇండియా వద్ద వచ్చిన వరద వీడియోలా షేర్ చేస్తున్నారు ముంబై గేట్వే అఫ్ ఇండియా వద్ద ఈ మధ్య వరద అంటూ షేర్ చేసిన క్లెయిమ్ స్క్రీన్ షాట్ (సౌజన్యం :ఫేస్బుక్/ ఎక్స్/ లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఎడిటింగ్)

ఫ్యాక్ట్ చెక్స్

తీర్పు తప్పుదారి పట్టించేది

ఈ రెండు వీడియోలు 2021 నాటి టౌక్తే తుఫాను కి సంబంధించినవి. ఈ మధ్య వర్షాలకు చెందిన వీడియో కాదు.

క్లెయిమ్ ఏమిటి?

ముంబై లోని ఇండియా గేట్ వద్ద వరదలు అంటూ రెండు వీడియోలు సామాజిక మాధ్యమాలలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ వీడియోలను వేరు వేరు కోణాలలో, ఈ మధ్య ముంబై లో వర్షాల అనంతరం పరిస్థితి అనే క్లైమ్ తో షేర్ చేస్తున్నారు.

ఒక వీడియోలో గేట్ వే వద్ద సముద్రం లోనుంచి వీధుల్లోకి వరదనీరు రావటం మనం చూడవచ్చు, మరో వీడియోలో గేట్ వే వద్దనే వీధుల్లోకి అలలు రావటం చూడవచ్చు.

ఒక ఫేస్బుక్ యూజర్ ఈ వీడియోని షేర్ చేసి, “గేట్ వే అఫ్ ఇండియా జులై 25, 2024, ముంబై," అని రాసుకొచ్చారు.” ఆర్కైవ్ చేసిన పోస్టులను ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు.

సామాజిక మాధ్యమాలలో వైరల్ అవుతున్న క్లెయిమ్ స్క్రీన్ షాట్ (సౌజన్యం : ఎక్స్/ ఫేస్బుక్/ ఎక్స్/ లాజికల్య్ ఫ్యాక్ట్స్ ఎడిటింగ్)

కానీ మా పరిశోధన ప్రకారం, ఈ రెండు వీడియోలు 2021 నుండే సామాజిక మాధ్యమాలలో ఉన్నాయి.

మేము ఏమి కనుగొన్నాము?

మొదటి వీడియో 

వైరల్ వీడియోని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, మాకు మే 17, 2021 నాటి  సిఎన్ఎన్ న్యూస్ 18 వీడియో ఒకటి లభించింది. ఈ వీడియోకి శీర్షిక గా, “Maharashtra: Water Flooding Around Gateway Of India & Hotel Taj As Cyclone Tauktae Wrecks Havoc,” అని ఉంది. ఈ వీడియోలో కుడా వైరల్ వీడియోలో మాదిరిగానే ఉన్న ఫ్రేములు  చూడవచ్చు, ఇక్కడ కుడా గేట్ వే అఫ్ ఇండియా దగ్గర వరద కనిపిస్తుంది. ఈ వీడియోలో ఆ కట్టడం వద్ద ఉన్న వరద నీరు ని పై నుంచి కుడా చూడవచ్చు.

వైరల్ వీడియో మరియు 2021 నాటి  టౌక్తె తుఫాను వీడియోల మధ్య పోలిక (సౌజన్యం : ఫేస్బుక్/CNN-NEWS18)

మే 18, 2021 నాడు “Gateway of India Thrashed by Waves amid Cyclone Tauktae” అనే శీర్షిక తో న్యూస్ 18 ప్రచురించిన కథనం ప్రకారం (ఆర్కైవ్ ఇక్కడ) ఈ వీడియో మే 2021 నాటిది. ఇక్కడ  దృశ్యాల స్క్రీన్ షాట్లు కుడా ఉన్నాయి.

టౌక్తే తుఫాను మే 2021 నాడు భారతదేశ పడమర తీరాన్ని తాకిన ఒక అత్యంత తీవ్రమైన తుఫాను. దీని వలన అత్యంత ప్రాణ నష్టం మరియు ఆస్తి నష్టం జరిగింది, 1891 నుండి ముంబై ని తాకిన తుఫానుల్లో ఇది ఒక బలమైన తుఫాను.

రెండవ వీడియో

రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా రెండో వీడియో కుడా మే 2021 నుండి సామాజిక మాధ్యమాలలో ఉంది అని తెలిసింది. మే 18 నాడు షేర్ చాట్ లో ఈ వీడియోని అప్లోడ్ చేశారు (ఆర్కైవ్ ఇక్కడ). ఎన్ఎస్ నౌ అనే ఒక ప్రాంతీయ వార్త సంస్థ కుడా మే 19 నాడు ఈ వీడియోని షేర్ చేసింది (ఆర్కైవ్ ఇక్కడ).  దీనికి శీర్షిక గా “Gateway Of India Mumbai in Taute Tufan | Cyclone Tauktae” అని పెట్టారు.  

వైరల్ వీడియో మరియు 2021 నాటి  టౌక్తె తుఫాను వీడియోల మధ్య పోలిక (సౌజన్యం : ఫేస్బుక్/NSNow)

ఈ వీడియోలు ఒరిజినల్ గా ఎక్కడనుండి షేర్ చేస్తున్నారు అనేది కచ్చితంగా తెలియకపోయినా, ఇవి 2024 వర్షాకాలానికి ముందు నుండే ఉన్నాయి అని అర్ధమయింది.

ముంబై నగరం ప్రతి సంవత్సరం వర్షా కాలంలో వరద ముంపుకి గురి అవుతూ ఉంటుంది. మహారాష్ట్ర లో మోస్తరు నుండి భారీ వర్షాలు పడే సూచనలు ఉన్నాయి అంటూ భారతీయ వాతావరణ శాఖ ముంబై లో జులై 26 నాడు ఆరెంజ్ అలర్ట్,  27 నాడు ఎల్లో అలర్ట్  జారీ చేసింది. 

తీర్పు:

వైరల్ అవుతున్న వీడియోలు 2021 లో టౌక్తె తుఫాను సమయం లోనివి. వీటిని 2024 లో వర్షాకాలం నాటి వీడియో లని తప్పుగా క్లైమ్ చేస్తున్నారు.

ఫ్యాక్ట్ చెక్ కోసం ఏదైనా క్లైమ్ మాకు సబ్మిట్ చేయదలుచుకుంటున్నారా లేదా మా సంపాదక బృందాన్ని సంప్రదించదలుచుకుంటున్నారా?

0 అంశాల వారీగా అన్వేషించండి

మన జీవితాలని ప్రభావితం చేసే నిర్ణయాలని మనం మనకి అందుబాటులో ఉన్న సమాచారం మేరకు తీసుకుంటాము. అయితే ఇంటర్నెట్ స్వభావరీత్యా తప్పుడు సమాచారం ఇప్పటివరకు కనీవినీ ఎరుగని రీతిలో ప్రజలకి చేరుతున్నది.