ద్వారా: ఉమ్మే కుల్సుం
జూన్ 4 2024
వైరల్ అవుతున్న ఫొటోని డిజిటల్ గా ఎడిట్ చేయడం జరిగింది. ఒరిజినల్ ఫొటోలో ఎం ఎల్ ఏ కోవిద్-19 వాక్సినేషన్ కి సంబంధించినది.
క్లెయిమ్ ఏమిటి?
జూన్ 4, 2024 నాడు భారతీయ ఎన్నికల ఫలితాలు విడుదల నేపధ్యంలో సామాజిక మాధ్యమాలలో ఒక ఫోటో వైరల్ అవుతుంది. ఈ ఫొటోలో ఒక మహిళ తమిళనాడు లోని కోయంబత్తుర్ లోని ఆది యోగి విగ్రహం వద్ద ‘#GoBackModi. (మోదీ తిరిగి వెళ్ళిపో) అనే నినాదాన్ని ఒక ప్లకార్డు మీద చూపిస్తున్నట్టు ఉంది.
ఈ ఫొటోని షేర్ చేస్తూ (ఆర్కైవ్ ఇక్కడ), ఒక ఎక్స్ యూసర్ “సద్గురు ఆశ్రమం వద్ద ఒక మహిళ గో బ్యాక్ మోదీ ప్లకార్డు చూపించటం ఆశ్యర్యంగా ఉంది” అని రాసుకొచ్చారు. ఈ పోస్టుకు మా కథనం రాసే సమయానికి దాదాపుగా, 14,000 వ్యూస్ ఉన్నాయి. ఆర్కైవ్ చేసిన అలాంటి పోస్ట్లని, ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు.
ఈ ఫొటో ఫేస్బుక్ లో కుడా వైరల్ అయ్యింది, ఆ పోస్టులను ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు.
వైరల్ అవుతున్న క్లెయిమ్స్ స్క్రీన్ షాట్ (సౌజన్యం : ఎక్స్/ ఫేస్బుక్/ లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఎడిటింగ్)
కానీ ఈ ఫొటో డిజిటల్ గా ఎడిట్ చేయబడినది, ఒరిజినల్ ఫొటో భారతీయ జనతా పార్టీ మహిళా విభాగ అధ్యక్షురాలు వనతి శ్రీనివాసన్ ప్రధాని నరేంద్ర మోదీ కి కృతఙ్ఞతలు తెలియజేయడానికి పోస్ట్ చేసారు.
మేము ఏమి కనుగొన్నము?
రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా తమిళనాడు ఎమ్మెల్యే శ్రీనివాసన్ అక్టోబర్ 24, 2021 నాడు పోస్ట్ (ఆర్కైవ్ ఇక్కడ) చేసిన ఒరిజినల్ ఫోటో, మరిన్ని ఫొటోలతో పాటు లభించింది.
ఆ పోస్టులో, శ్రీనివాసన్, మోదీ కి ధన్యవాదాలు తెలియజేయడానికి ఒక కార్యక్రమానికి వెళ్తున్నట్టుగా తెలియజేసారు. ఆ కార్యక్రమం కోయంబత్తుర్ లోని ఆది యోగి విగ్రహం వద్ద జరగబోతుంది అని, అక్కడ యువకుల టీం అంతా కలిసి, భారతదేశంలో 100 కోట్ల వాక్సినేషన్ పూర్తి చేసిన సందర్బంగా ప్రధాని నరేంద్ర మోదీకి కృతఙ్ఞతలు తెలియజేస్తున్నారు అని తమిళ్ లో కాప్షన్ ద్వారా తెలిపింది. పైగా ఆ కార్యక్రమంలో రాష్ట్ర బిజేపి అధ్యక్షుడు అన్నామలై, కే వినోజ్ పి సెల్వం మరియు ఏపీ మురుగానందం ఉన్నారని తెలిపారు.
ఆమె పట్టుకున్న ప్లకార్డు పైన 100 కోట్ల వాక్సినేషన్లను పూర్తి చేసి, భారతదేశం చరిత్ర సృష్టించింది అని, మోదీ కి ధన్యవాదాలు చెప్పినట్లు ఇంగ్లీష్ లో రాసి ఉంది. ఆమెతో పాటుగా ఇతరులు పట్టుకున్న పోస్టర్లు కుడా ఇలాంటి సందేశమే ఉంది.
భారతీయ జనతా యువ మోర్చా అధ్యక్షుడు వినోజ్ పి సెల్వం తమ అధికారిక ఎక్స్ (ఆర్కైవ్ ఇక్కడ) అకౌంట్ లో అక్టోబర్ 24, 2021 నాడు, ఇలాంటి ఫోటోలని షేర్ చేసారు. అన్ని ఫొటోలలో కుడా కృతజ్ఞతా సందేశాలు ఉన్నాయి కానీ, #GoBackModi అనే నినాదాలు కనపడలేదు.
ఒరిజినల్ ఫొటోకి మరియు వైరల్ ఫొటోకి మధ్య పోలిక (సౌజన్యం : ఎక్స్)
అక్టోబర్ 2021 లో ప్రచురితమైన హిందూ తమిళ్ కథనం ప్రకారం, భారతదేశం అప్పటికి 100 కోట్ల మందికి కోవిద్-19 వాక్సిన్లు ఇచ్చి ఒక మైలు రాయిని చేదించింది. ఈ విజయాన్ని పురస్కరించుకుని, అక్టోబర్ 24, 2021 నాడు బిజేపి మెంబర్లు, ఆది యోగి విగ్రహం వద్ద నిలబడి ప్రధాని నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలిపారు.
కనుక, శ్రీనివాసన్ అలాంటి ప్లకార్డు ఏమి పట్టుకోలేదని స్పష్టం అవుతున్నది.
తీర్పు:
బీజేపి ఎమ్మెల్యే శ్రీనివాసన్ "#GoBackModi" అనే పోస్టర్ ని పట్టుకున్నట్టుగా వైరల్ అవుతున్న ఫొటో ఎడిట్ చేసినది. ఒరిజినల్ ఫొటోలో అలాంటి నినాదం ఏమి లేదు, కనుక వైరల్ అవుతున్న క్లెయిమ్ అబద్ధం.
(అనువాదం: రాజేశ్వరి పరసా)