హోమ్ 2018లో ఒక రాజస్థాన్ శాసనసభ్యునిడిని తరుముతున్న వీడియోకి మత రంగు పులిమి షేర్ చేస్తున్నారు

2018లో ఒక రాజస్థాన్ శాసనసభ్యునిడిని తరుముతున్న వీడియోకి మత రంగు పులిమి షేర్ చేస్తున్నారు

ద్వారా: ఉమ్మే కుల్సుం

ఆగస్టు 19 2024

ఈ కథనాన్ని షేర్ చెయ్యండి: facebook logo twitter logo linkedin logo
2018లో ఒక రాజస్థాన్ శాసనసభ్యునిడిని తరుముతున్న వీడియోకి మత రంగు పులిమి షేర్ చేస్తున్నారు రాజస్థాన్ లో కాషాయ రంగు జెండా తీసేసినందుకు గాను కాంగ్రెస్ నాయకుడు అబ్దుల్ ని తరుముతున్న వీడియో అంటూ షేర్ చేసిన క్లెయిమ్ స్క్రీన్ షాట్ (సౌజన్యం : ఎక్స్/ లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఎడిటింగ్)

ఫ్యాక్ట్ చెక్స్

అబద్ధం

ఈ వీడియో 2018 లో ఒక రాజస్థాన్ కి చెందిన శాసనసభ్యుడు రాంకేష్ మీనాను తరుముతున్న వీడియో.

క్లెయిమ్ ఏమిటి?

ఒక వీడియో సామాజిక మాధ్యమాలలో వైరల్ అవుతుంది. ఇందులో ఒక గుంపు ఒక వ్యక్తి ని తరమటం చూడవచ్చు. ఆ వ్యక్తి కాంగ్రెస్ నాయకుడు అబ్దుల్ అని, రాజస్థాన్ లో ఒక కాషాయ రంగు జెండా ని తీసేసిన తరువాత ఈ విధంగా తరిమారు అని ఒక ఎక్స్ (పూర్వపు ట్విట్టర్) యూజర్ షేర్ చేశారు. ఆ పోస్టుకు ఈ కథనం రాసే సమయానికి 455,000 వ్యూస్ మరియు 4,500 రీ పోస్టులు ఉన్నాయి. అలాంటి మరిన్ని పోస్టుల ఆర్కైవ్ లను ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు.


ఆన్లైన్ లో వైరల్ అయిన క్లెయిమ్ స్క్రీన్ షాట్లు (సౌజన్యం : ఎక్స్/ లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఎడిటింగ్)
 

కానీ, ఈ వీడియోని తప్పుగా మతకోణంలో షేర్ చేస్తున్నారు. ఇందులో ఉన్నది ముస్లిం కాంగ్రెస్ నాయకుడు కాదు. రాజస్థాన్ కి చెందిన శాసనసభ్యుడు,  ఈ వీడియో 2018 నాటిది.

మేము ఏమి కనుగొన్నము?

రివర్స్ ఇమేజ్ సెర్చ్ ద్వారా, ఈ వీడియోని కి సంబంధించిన స్క్రీన్ షాట్లతో కూడయిన కథనాన్ని న్యూస్ 18 ఏప్రిల్ 7 2018 నాడు ప్రచురించిందని మేము గుర్తించాము (ఆర్కైవ్ ఇక్కడ).

ఈ కథనం ప్రకారం, వీడియో లో కనిపిస్తున్న వ్యక్తి, నాటి శాసనసభ్యుడు  రాంకేష్ మీనా అని తెలుస్తుంది. ఆ సమయం లో షెడ్యూల్డ్ కులాలు మరియు షెడ్యూల్డ్ తెగలు అత్యాచారం నిరోధక చట్టానికి జరిగిన సవరణలకు వ్యతిరేకంగా రాంకేష్ మీనా తన అనుచరులతో కలిసి నిరసనలు చేపట్టారు, ఆ తరువాత ఏప్రిల్ 2 నాడు ర్యాలీ కుడా చేసారు, ఆరోజునే భారత్ బంద్ స్ట్రైక్ కుడా జరిగింది.

ది హిందూ కథనం ప్రకారం, ఏప్రిల్ 2, 2018 నాడు వివిధ దళిత సంఘాలు భారత దేశం లో బందు నిర్వహించాయి. ఇది అప్పట్లో షెడ్యూల్డ్ కులాలు మరియు షెడ్యూల్డ్ తెగలు అత్యాచార నిరోధక చట్టం, 1989 సవరణలకు సంబంధించి సుప్రీమ్ కోర్ట్ మార్చ్ 20, 2018 ఇచ్చిన తీర్పుకి నిరసనగా జరిగింది.

ది న్యూస్ 18 రిపోర్ట్ కథనం ప్రకారం, గంగాపూర్ లో ఈ నిరసనలు ఏప్రిల్ 2 నాటికి ఎక్కువ అయ్యాయి, రాంకేష్ మీనా అక్కడ ఉన్న నిరసనకారులను  సముదాయించే ప్రయత్నం చేయగా, ఆయనపై తిరిగి దాడి చేశారు.

న్యూస్ 18 కథనం స్క్రీన్ షాట్ (సౌజన్యం : ఎక్స్/ న్యూస్ 18)

మేము ఏప్రిల్ 2018 నాటి ఒక ఫేస్బుక్ పోస్టు కుడా కనుగొన్నాము. దీనికి శీర్షికగా, రాజస్థాన్ లోని భరతపూర్ లో ఏప్రిల్ 2 నాడు జరిగిన భారత్ బంద్ లో గంగాపూర్ శాసనసభ్యుడు రాంకేష్ మీనాను కొంత మంది ఆకతాయిలు కొట్టినట్టుగా ఉంది (ఆర్కైవ్ ఇక్కడ).  ఈ వీడియోలో ఒక గుంపు మీనాను తరుముతున్నట్టు మనకి కనిపిస్తుంది.

ఈ ఆధారాల ద్వారా పాత వీడియోని అసందర్భంగా షేర్ చేస్తున్నారు అని అర్ధమవుతుంది. 

రాంకేష్ మీనా జులై 2021 నాడు జైపూర్ లో అమర్ గఢ్ కోట లో కాషాయ జెండా ని తొలగించిన వివాదం లో ఉన్నారు. కానీ ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోకి ఆ సంఘటనకి సంబంధం లేదు.

తీర్పు

వైరల్ అవుతున్న వీడియోలో ఎస్ సి ఎస్ టి అత్యాచారాల నిరోధక చట్ట సవరణాలకి సంబంధించి నిరసనలు చేస్తున్న గుంపు రాంకేష్ మీనా అనే రాజస్థాన్ కి చెందిన శాసనసభ్యుడని తరుముతున్న వీడియో. దీనికి కాంగ్రెస్ నాయకుడు అబ్దుల్ కి సంబంధం లేదు.

(అనువాదం : రాజేశ్వరి పరసా)

0 అంశాల వారీగా అన్వేషించండి

మన జీవితాలని ప్రభావితం చేసే నిర్ణయాలని మనం మనకి అందుబాటులో ఉన్న సమాచారం మేరకు తీసుకుంటాము. అయితే ఇంటర్నెట్ స్వభావరీత్యా తప్పుడు సమాచారం ఇప్పటివరకు కనీవినీ ఎరుగని రీతిలో ప్రజలకి చేరుతున్నది.