హోమ్ తమిళనాడుకు చెందిన వీడియోని ఆంధ్రలో ప్రతిపక్ష కూటమి పార్టీల మధ్య గొడవలా షేర్ చేసారు

తమిళనాడుకు చెందిన వీడియోని ఆంధ్రలో ప్రతిపక్ష కూటమి పార్టీల మధ్య గొడవలా షేర్ చేసారు

ద్వారా: రోహిత్ గుత్తా

ఏప్రిల్ 10 2024

ఈ కథనాన్ని షేర్ చెయ్యండి: facebook logo twitter logo linkedin logo
తమిళనాడుకు చెందిన వీడియోని ఆంధ్రలో ప్రతిపక్ష కూటమి పార్టీల మధ్య గొడవలా షేర్ చేసారు వైరల్ అవుతున్న పోస్టు స్క్రీన్ షాట్ (సౌజన్యం : ఎక్స్/లాజికల్లీ ఫ్యాక్స్ ఎడిటింగ్)

ఫ్యాక్ట్ చెక్స్

తీర్పు అబద్ధం

ఈ వీడియో తమిళనాడు లోని కాంచీపురం లో న్యూస్ 18 ఏప్రిల్ 6, 2024 నాడు నిర్వహించిన కార్యక్రమం లో డిఎంకె మరియి బిజెపి కి మధ్య జరిగిన ఘర్షణ కి చెందినది.

క్లెయిమ్ ఏమిటి?

ఆంధ్ర ప్రదేశ్ లో ఎన్నికలు దగ్గరపడుతున్న తరుణంలో, సామాజిక మాధ్యమాలలో 21 సెకెన్ల నిడివి గల వీడియో ఒకటి షేర్ చేస్తూ ఇది ఆంధ్ర  ప్రదేశ్ లోని ప్రతిపక్ష కూటమి అయిన తెలుగు దేశం, జన సేన మరియు భారతీయ జనతా పార్టీల మధ్య గొడవ వీడియో అని క్లైమ్ చేశారు. 

ఈ వీడియోలో ఒక గదిలో జనాలు అక్కడి కుర్చీలను ఒకరి మీద ఒకరు విసిరేసుకోవటం మనం చూడవచ్చు. ఆర్కైవ్ చేసిన అలాంటి పోస్టులను ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు.


వైరల్ అవుతున్న పోస్టు స్క్రీన్ షాట్ (సౌజన్యం : ఎక్స్/లాజికల్లీ ఫ్యాక్స్ ఎడిటింగ్)

కానీ ఈ వీడియో ఆంధ్ర ప్రదేశ్ కి చెందినది కాదు, తమిళనాడు లో జరిగిన ఒక ఘటన వీడియో. 

మేము ఏమి కనుగొన్నము ?

ఆంధ్ర లోని ప్రతిపక్ష కూటమి ఆత్మీయ సమావేశం అనే పేరుతో పలు చోట్ల వరుసగా కొన్ని కార్యక్రమాలను నిర్వహిస్తూ వస్తున్నది. ఈ మధ్య జరిగిన అలాంటి సమావేశాలలో ఇలాంటి ఘటన ఏదైనా జరిగిందా అని మేము వార్తా కథనాల కోసం వెతికాము. కానీ అలాంటి వార్తలు ఏమి మాకు లభించలేదు. 

వీడియోని పరీక్షించి చూడగా, అందులో వ్యక్తులు కాషాయం రంగు కండువాలు కప్పుకుని ఉన్నారు, ఇది బిజెపి పార్టీ రంగు. కానీ తెలుగుదేశం మరియు జన సేన రంగులైన పసుపు మరియు ఎరుపు మాత్రం ఆ వీడియోలో ఎక్కడ కనపడలేదు. 

పైగా వీడియోలో న్యూస్ 18 తమిళ బ్యానర్లు మనం చూడవచ్చు. అలాగే వేదిక అలంకరణ తమిళ భాషలో రాసి ఉన్నట్టుగా మనకి కనిపిస్తుంది. ఈ ఆధారాల ద్వారా ఇది తమిళనాడుకు చెందిన వీడియో అయి ఉండవచ్చు అని మేము అనుకున్నాము. 

ఇలాంటి సంఘటన గురించి తమిళనాడు ఏమైనా జరిగిందా అని రివర్స్ ఇమేజ్ ద్వారా మరియు కొన్ని కీ వర్డ్స్ ఉపయోగించి మేము వెతికాము. ఇదే వీడియోని కొంతమంది యూట్యూబ్ లో అప్లోడ్ చెయ్యటం జరిగింది. ఈ వీడియోని షేర్ చేస్తూ, ఇది న్యూస్ 18 కార్యక్రమం అప్పటిదని, తమిళనాడులోని అధికార పార్టీ ద్రావిడ మున్నేత్ర కళగం (డీఎంకే) మరియు బిజెపి నాయకులు ఒకరి మీదకి ఒకరు కుర్చీలు విసిరేసుకున్నారు అని రాసుకొచ్చారు. 

న్యూస్ 18 ఈ కార్యక్రమానికి సంబంధించిన లైవ్ లింక్ ను ఏప్రిల్ 7, 2024 నాడు యూట్యూబ్ లో స్ట్రీమ్ చేసింది. ఈ కార్యక్రమం పేరు మక్కల్ సభై (ప్రజల సభ) అనే పేర్కొంది. ఈ వీడియోలో ఇచ్చిన వర్ణన ప్రకారం, ఆ కార్యక్రమంలో వివిధ పార్టీ అభ్యర్థుల మధ్య చర్చ జరుగుతుంది. 

ఈ లైవ్ స్ట్రీమ్ లో ఘర్షణ కు సంబంధించిన భాగాన్ని పొందుపరచనప్పటికీ, దీనిని వైరల్ వీడియోతో పోల్చి చూస్తే, మనకి కొన్ని పోలికలు కనిపిస్తాయి, వీటితో మనం ఈ వీడియో అక్కడ తీసినదే అని నిర్ధారించవచ్చు. 


వైరల్ వీడియో మరియు ఒరిజినల్ వీడియో కి మధ్య పోలిక (సౌజన్యం : ఎక్స్/న్యూస్ 18 తమిళనాడు/స్క్రీన్ షాట్స్)


అదే విధంగా తమిళనాడు బిజెపి సెక్రటరీ ఎస్ జి సూర్య కుడా ఈ కార్యక్రమం లో పాల్గొన్నారు, అక్కడ జరిగిన ఈ ఘర్షణ వీడియోని తమ ఎక్స్ అకౌంట్ లో పోస్ట్ చేస్తూ, ఇది కాంచీపురం లో ఏప్రిల్ 6, 2024 నాడు చోటు చేసుకుని అని రాసారు. ఈయన అప్లోడ్ చేసిన వీడియోలో కుడా జనాలు కుర్చీలు విసిరేసుకోవటం మనం చూడవచ్చు. ఇక్కడ కుడా వక్తల వెనుక నీలం రంగు బ్యానర్ ని మనం చూడవచ్చు. 

తీర్పు :

డీఎంకే మరియు బీజేపీ మధ్య తమిళనాడులో జరిగిన ఒక ఘర్షణకి సంబంధించిన వీడియోని ఆంధ్ర ప్రదేశ్ లో ప్రతిపక్ష కూటమిలోని పార్టీల మధ్య జరిగిన గొడవగా షేర్ చేస్తున్నారు. కనుక మేము దీనిని అబద్ధం అనే నిర్ధారించాము. 

(అనువాదం : రాజేశ్వరి పరస)




ఫ్యాక్ట్ చెక్ కోసం ఏదైనా క్లైమ్ మాకు సబ్మిట్ చేయదలుచుకుంటున్నారా లేదా మా సంపాదక బృందాన్ని సంప్రదించదలుచుకుంటున్నారా?

0 అంశాల వారీగా అన్వేషించండి

మన జీవితాలని ప్రభావితం చేసే నిర్ణయాలని మనం మనకి అందుబాటులో ఉన్న సమాచారం మేరకు తీసుకుంటాము. అయితే ఇంటర్నెట్ స్వభావరీత్యా తప్పుడు సమాచారం ఇప్పటివరకు కనీవినీ ఎరుగని రీతిలో ప్రజలకి చేరుతున్నది.