హోమ్ బ్రెజిల్ కి చెందిన కాల్పుల వీడియోని ఉత్తర్ ప్రదేశ్ లో జరిగిన ఘటనగా షేర్ చేశారు

బ్రెజిల్ కి చెందిన కాల్పుల వీడియోని ఉత్తర్ ప్రదేశ్ లో జరిగిన ఘటనగా షేర్ చేశారు

ద్వారా: తాహిల్ అలీ

జూలై 16 2024

ఈ కథనాన్ని షేర్ చెయ్యండి: facebook logo twitter logo linkedin logo
బ్రెజిల్ కి చెందిన కాల్పుల వీడియోని ఉత్తర్ ప్రదేశ్ లో జరిగిన ఘటనగా షేర్ చేశారు ఉత్తరప్రదేశ్ లోని ముజఫర్ నగర్ లో జరిగిన ఘటన అంటూ షేర్ చేసిన క్లెయిమ్ స్క్రీన్ షాట్ (సౌజన్యం : ఎక్స్/ లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఎడిటింగ్)

ఫ్యాక్ట్ చెక్స్

తీర్పు అబద్ధం

ఈ సంఘటన బ్రెజిల్ లోని నోవో అలెక్సోలో చోటు చేసుకుంది, ఉత్తర్ ప్రదేశ్ లో కాదు. గాయపడిన వ్యక్తిని లూకా రోడ్రిగ్స్ గా నిర్ధారించారు.

పాఠకుల గమనిక : కథనంలో హింసకు గురించిన వివరణ ఉంటుంది, గమనించగలరు. అందువలన లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఆ వీడియోకి సంబంధించిన లింకులను ఇక్కడ పొందుపరచలేదు. 


క్లెయిమ్ ఏమిటి ? 

ఒక వ్యక్తి ని పదే పదే గన్ తో కాలుస్తున్న వీడియో ఒకటి సామాజిక మాధ్యమాలలో షేర్ చేస్తూ, ఇది ఉత్తరప్రదేశ్ లోని ముజఫర్ నగర్ లో జరిగిన ఘటనగా రాసుకొచ్చారు. ఈ 14 సెకెన్ల వీడియోలో ఒక వ్యక్తి టేబుల్ పై నిలుచుని ఉంటే, అతనిని నాలుగు సార్లు కాల్చగా అతను కిందపడిపోవటం చూడవచ్చు. ఆ తర్వాత అతను కింద పడినా కుడా మరలా తుపాకీతో కాల్చటం జరిగింది.

ఒక ఎక్స్ (పూర్వపు ట్విట్టర్) యూజర్ ఈ వీడియోని షేర్ చేసి, “సినిమాలో చూపించే విధంగా జరిగిన ఈ హత్య వీడియో సామాజిక మాధ్యమాలలో వైరల్ అవుతుంది. ఇది ముజఫర్ నగర్ జిల్లా లో జరిగిందంట..,” (హిందీ అనువాదం) అని పేర్కొన్నారు. ఈ కథనం రాసే సమయానికి ఈ పోస్టుకు 31,500 వ్యూస్ ఉన్నాయి.

వైరల్ పోస్టు స్క్రీన్ షాట్ (సౌజన్యం :ఎక్స్/ లాజికల్య్ ఫ్యాక్ట్స్ ఎడిటింగ్)

కానీ మా పరిశోధన ప్రకారం ఈ వీడియో బ్రెజిల్ కి చెందినది.

వాస్తవం ఏమిటి?

వైరల్ అవుతున్న వీడియోని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, అదే వీడియోని ఎక్స్ లో జూన్ 30 2024 నాడు షేర్ చేసిన అనేక పోస్టులు మాకు లభించాయి. ఈ వీడియోతో పాటు పోర్చుగీస్ భాషలో ఈ సంఘటన నోవో అలెక్సో లో జరిగిందని, ఇది బ్రెజిల్ లోని అమజోనా రాజధాని మనౌ దగ్గర్లో ఉంటుందని రాసుకొచ్చారు. 

ఒక ఎక్స్ యూజర్ ఈ వీడియోని షేర్ చేసి, నిందితుడు ఒల్హో  అనే వ్యక్తిని హత్య చేస్తూ ఈ వీడియోని చిత్రీకరించారు అని తెలిపాడు. పైగా ఇది మనౌ లోని నోవో అలెక్సో దగ్గర జరిగిందని పోర్చుగీస్ భాషలో పేర్కొన్నాడు

ఒరిజినల్ వీడియో స్క్రీన్ షాట్ (సౌజన్యం : ఎక్స్/@baudorio/లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఎడిటింగ్)

ఇంకాస్త పరిశోధన చేయగా, ఈ సంఘటన గురించిన అనేక కథనాలు మాకు లభించాయి. అందులో ఒక కథనంలో ఈ వీడియోకు సంబంధించిన స్క్రీన్ షాట్లు కుడా ఉన్నాయి. ఈ కథనం ప్రకారం, ఈ సంఘటన జరిగిన ఒక గంట వ్యవధిలో ఈ వీడియో సామాజిక మాధ్యమాలలో వైరల్ అవ్వటం మొదలయ్యిందని, ఈ హత్య క్రిమినల్ ఫ్యాక్షన్ గ్రూప్ అయినటువంటి ప్రైమెయిరో కమాండో ద క్యాపిటల్ (PCC) చేసింది అని ఉంది. అందులో హత్య చేయబడిన వ్యక్తి పేరు, లూకా ఫిగురాదో రోడ్రిగ్స్ అని, ఇతనిని ఒల్హో అని అంటారు అని పేర్కొంటూ, అతడు నోవో అలెక్సోలో అనే ప్రాంతంలో ఒక భవనంలో పని చేస్తుండగా హతమార్చినట్టు తెలుస్తుంది అని ఈ కథనంలో ఉంది.

డియారియో మనౌరా అనే మనౌ కి చెందిన వార్త సంస్థ ఈ ఘటనపై జూన్ 28, 2024 నాడు ఒక కథనాన్ని ప్రచురించింది. దీని ప్రకారం, ఒక గుర్తు తెలియని వ్యక్తి తుపాకీతో చొరబడి, రోడ్రిగ్స్ ను పలు సార్లు కాల్చడం జరిగిందని, పైగా హత్య చేసే సమయంలో వీడియో కుడా రికార్డు చేసినట్టుగా ఉంది. హత్య తరువాత ద్విచక్ర వాహనం పై పారిపోయినట్టుగా పేర్కొన్నారు. పోలీసులు ఆ వ్యక్తిని ఇంకా కనుగొనలేదని, ఈ కేసును స్పెషలైజ్డ్ హోమిసైడ్ అండ్ కిడ్నాపింగ్ యూనిట్ (DEHS) ప్రస్తుతం విచారిస్తున్నట్టుగా ఈ కథనం పేర్కొంది.

వార్త కథనాలకు సంబంధించిన స్క్రీన్ షాట్ (సౌజన్యం : డిఆరియో మనౌరా)

కథనాల ప్రకారం రోడ్రిగ్స్ కు మాదకద్రవ్యాల అక్రమ రవాణా చేసిన చరిత్ర ఉంది. పైగా అతను బ్రెజిలియన్ క్రిమినల్ సంస్థ, కమాండో వెర్మెల్హో కి చెందిన వ్యక్తి కుడా అని పేర్కొన్నారు. 

పైగా మేము ముజఫర్ నగర్ పోలీసులు తమ అధికారిక ఎక్స్ అకౌంట్ లో కుడా ఈ వీడియో గురించి ఇచ్చిన వివరణని చూశాము (ఆర్కైవ్ ఇక్కడ). ఇది ముజఫర్ నగర్ కి చెందినది కాదు అని పేర్కొన్నారు. ఈ వీడియోని తప్పుగా షేర్ చేసిన వారిపై చర్యలు తీసుకుంటామని కూడా పోలీసులు పేర్కొన్నారు.


ఎక్స్ లో పోలీసులు ఇచ్చిన ప్రకటన (సౌజన్యం :ఎక్స్/@muzafarnagarpol)

తీర్పు : 

వైరల్ అవుతున్న వీడియో ఉత్తరప్రదేశ్ కి చెందినది కాదు, బ్రెజిల్ కి చెందింది. వార్త కథనాల ప్రకారం గాయపడిన వ్యక్తి లూకా రోడ్రిగ్స్, ఇది మాదకద్రవ్యాల అక్రమ రవాణా కి సంబంధించిన హత్య.

(అనువాదం : రాజేశ్వరి పరసా)

ఫ్యాక్ట్ చెక్ కోసం ఏదైనా క్లైమ్ మాకు సబ్మిట్ చేయదలుచుకుంటున్నారా లేదా మా సంపాదక బృందాన్ని సంప్రదించదలుచుకుంటున్నారా?

0 అంశాల వారీగా అన్వేషించండి

మన జీవితాలని ప్రభావితం చేసే నిర్ణయాలని మనం మనకి అందుబాటులో ఉన్న సమాచారం మేరకు తీసుకుంటాము. అయితే ఇంటర్నెట్ స్వభావరీత్యా తప్పుడు సమాచారం ఇప్పటివరకు కనీవినీ ఎరుగని రీతిలో ప్రజలకి చేరుతున్నది.