హోమ్ ఎడిట్ చేసిన టైమ్స్ నౌ ఎగ్జిట్ పోల్ స్క్రీన్ షాట్ షేర్ చేసి ఆంధ్రలో టిడిపి గెలుస్తున్నదని ఆ చానల్ అంచనా వేసిందని క్లైమ్ చేశారు

ఎడిట్ చేసిన టైమ్స్ నౌ ఎగ్జిట్ పోల్ స్క్రీన్ షాట్ షేర్ చేసి ఆంధ్రలో టిడిపి గెలుస్తున్నదని ఆ చానల్ అంచనా వేసిందని క్లైమ్ చేశారు

ద్వారా: ఇషిత గోయల్ జె

మే 20 2024

ఈ కథనాన్ని షేర్ చెయ్యండి: facebook logo twitter logo linkedin logo
ఎడిట్ చేసిన టైమ్స్ నౌ ఎగ్జిట్ పోల్ స్క్రీన్ షాట్ షేర్ చేసి ఆంధ్రలో టిడిపి గెలుస్తున్నదని ఆ చానల్ అంచనా వేసిందని క్లైమ్ చేశారు ఆంధ్ర ప్రదేశ్ లో టిడిపి గెలుస్తుందని టైమ్స్ నౌ ఎగ్జిట్ పోల్ అంటూ వైరల్ అయిన స్క్రీన్ షాట్ (సౌజన్యం : ఎక్స్/లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఎడిటింగ్)

ఫ్యాక్ట్ చెక్స్

తీర్పు ఫేక్

ఎన్నికల సంఘం నియమాల ప్రకారం, 2024 లోక్ సభ కానీ అసెంబ్లీ ఎన్నికలకి సంబంధించి కానీ, ఏ విధమైన ఎగ్జిట్ పోల్స్ విడుదల అవ్వలేదు.

క్లెయిమ్ ఏమిటి?
 

టైమ్స్ నౌ ఎగ్జిట్ పోల్స్ పేరుతో ఒక స్క్రీన్ షాట్ సామాజిక మాధ్యమాలలో వైరల్ అయ్యింది. ఆ స్క్రీన్ షాట్ ప్రకారం ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలో తెలుగు దేశం పార్టీ విజయం సాధించనుంది.. మే 13 నాడు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో 25 పార్లమెంటరీ మరియు 175 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. సోషల్ మీడియాలో షేర్ చేసినటువంటి పోస్టుకు శీర్షికగా ‘టైమ్స్ నౌ ఆంధ్ర ప్రదేశ్  ఎగ్జిట్ పోల్ ఫలితాలు’ అని పెట్టారు. ఈ పోస్ట్ కింద కొంత మంది యూజర్ల, ‘ఇది సాక్షియో లేదా టివి 9యో కాదు’ అని పేర్కొన్నారు. ఆర్కైవ్ చేసిన పోస్టులను ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు. 

 

సామాజిక మాధ్యమాలలో వైరల్ అవుతున్న పోస్టుల స్క్రీన్ షాట్స్ (సౌజన్యం : ఎక్స్/ లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఎడిటింగ్) 

 కానీ వైరల్ అవుతున్న స్క్రీన్ షాట్ కల్పితమైనది. ఒరిజినల్ ఫోటో 2021 ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికల ఎగ్జిట్ పోల్ కి చెందినది. ఆ స్క్రీన్ షాట్ ని ఎడిట్ చేసి ఈ వైరల్ ఫొటో చేశారు.

వాస్తవం ఏమిటి?

ఆంధ్ర ప్రదేశ్ 2024 ఎన్నికలకు సంబందించి టైమ్స్ నౌ ఎగ్జిట్ పోల్ ఏమైనా విడుదల చేసిందా అని సామాజిక మాధ్యమాలలో మరియు అధికారిక వెబ్సైటులో వెతికాము, (ఆర్కైవ్ చేసిన పోస్టులను ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ), కానీ అలాంటిది ఏమీ మాకు లభించలేదు. 

రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, 2021 లో ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికల సమయంలో టైమ్స్ నౌ ఎగ్జిట్ పోల్స్  ఇదే టెంప్లేటు లో (ఆర్కైవ్ ఇక్కడ) విడుదల చేసింది అని మేము కనుగొన్నాము. నవంబర్ 16, 2021 నాటి టెంప్లేట్ లో వాడిన ఒక స్లైడ్ నే ఎడిట్ చేసి వైరల్ ఇమేజ్ ని తయారు చేసారు. ఒరిజినల్ స్లైడ్ కి శీర్షిక గా, “TIMES NOW-Polstrat #UttarPradesh Opinion Poll SEAT SHARE on India Upfront,” అని పెట్టారు.

ఈ రెండు ఫోటోలను పోల్చి చూస్తే, వైరల్ ఫొటో ఎడిటెడ్ అని అర్ధమవుతుంది. ఇక్కడ రీసెర్చ్ పార్టనర్ గా ‘Polstrat’ ని తీసేసి ‘ETG’ అని రాసారు, ఉత్తర్ ప్రదేశ్ పేరు తీసేసి ఆంధ్ర ప్రదేశ్ చేర్చారు. అసెంబ్లీ సంఖ్యలని కుడా ఆంధ్ర ప్రదేశ్ కి అనుగుణంగా మార్చారు.

వైరల్ అవుతున్న స్క్రీన్ షాట్ మరియు టైమ్స్ నౌ ఫోటోకి మధ్య పోలిక (సౌజన్యం : ఎక్స్/టైమ్స్ నౌ/లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఎడిటింగ్)

ఆంధ్ర ప్రదేశ్ కి టైమ్స్ నౌ అంచానాలు

రీసెర్చ్ సంస్థ మరియు పోలింగ్ ఏజెన్సీ అయిన ETG, టైమ్స్ నౌ  ఛానల్  జతకట్టినప్పటికీ (ఆర్కైవ్ ఇక్కడ) ఆ ఛానల్ కేవలం ఆంధ్ర లోక్ సభ ఎన్నికలకు సంబంధించి  శాతాన్ని మాత్రమే ఏప్రిల్ 4, 2024 న ప్రచురించింది (ఆర్కైవ్ ఇక్కడ) . ఇది ఎన్నికల సంఘం ఎగ్జిట్ పోల్స్ మీద నిషేధానికి ముందు విడుదల చేసినది. మే 7, 2024 ETG (ఆర్కైవ్ ఇక్కడ)  స్పష్టత ఇస్తూ, లోక్ సభ ఎన్నికలు మరియు అసెంబ్లీ ఎన్నికల నేపధ్యం లో వారు ఎగ్జిట్ పోల్స్ ని జూన్ 1 తరువాతే విడుదల చేస్తాం అని పేర్కొంది.

లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఇంతకు ముందు కుడా ఆంధ్ర ప్రదేశ్ మరియు ఇతర రాష్ట్రాలకి సంబంధించి ఇలాంటి పోల్స్ క్లైమ్స్ ని నిర్ధారించింది. 

ఎన్నికల సంఘం ప్రకారం ఎగ్జిట్ పోల్స్ నియమాలు

ఎన్నికల సంఘం ఏప్రిల్ 19, 2024 నాడు విడుదల చేసిన నియమాల (ఆర్కైవ్ ఇక్కడ) ప్రకారం, జూన్ 1, 6:30pm వరకు ఎగ్జిట్ పోల్స్ మీద నిషేధం ఉంది. ఆ నేపధ్యం లో ఏప్రిల్ 2 నాడు, విడుదల చేసిన ఒక ప్రెస్ నోట్ లో కుడా ఎగ్జిట్ పోల్స్ నిషేధం గురించి, అది ప్రజా ప్రాతినిధ్యం చట్టం, 1951 చట్టం కింద సెక్షన్ 126 A ప్రకారం అమలులో ఉంటుందని ఉంది.

తీర్పు :  

వైరల్ అవుతున్న స్క్రీన్ షాట్ 2021 లో ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికలకి సంబంధించి టైమ్స్ నౌ విడుదల చేసిన ఎగ్జిట్ పోల్ కి సంబందించినది. దానిని ఎడిట్ చేసి  2024 ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్ పోల్ కి చెందినది అని పేర్కొన్నారు. కాబట్టి ఈ క్లైమ్ ఫేక్ అని మేము నిర్ధారించాము.

(అనువాదం: రాజేశ్వరి పరస)

ఫ్యాక్ట్ చెక్ కోసం ఏదైనా క్లైమ్ మాకు సబ్మిట్ చేయదలుచుకుంటున్నారా లేదా మా సంపాదక బృందాన్ని సంప్రదించదలుచుకుంటున్నారా?

0 అంశాల వారీగా అన్వేషించండి

మన జీవితాలని ప్రభావితం చేసే నిర్ణయాలని మనం మనకి అందుబాటులో ఉన్న సమాచారం మేరకు తీసుకుంటాము. అయితే ఇంటర్నెట్ స్వభావరీత్యా తప్పుడు సమాచారం ఇప్పటివరకు కనీవినీ ఎరుగని రీతిలో ప్రజలకి చేరుతున్నది.