హోమ్ సోనాక్షి సిన్హా బంగారు రంగు బికినీ వేసుకుని ర్యాంప్ మీద నడుస్తున్న వీడియో డీప్ ఫేక్

సోనాక్షి సిన్హా బంగారు రంగు బికినీ వేసుకుని ర్యాంప్ మీద నడుస్తున్న వీడియో డీప్ ఫేక్

ద్వారా: ఉమ్మే కుల్సుం

జూలై 9 2024

ఈ కథనాన్ని షేర్ చెయ్యండి: facebook logo twitter logo linkedin logo
సోనాక్షి సిన్హా బంగారు రంగు బికినీ వేసుకుని ర్యాంప్ మీద నడుస్తున్న వీడియో డీప్ ఫేక్ సోనాక్షి సిన్హా బంగారు రంగు బికినీ వేసుకుని ర్యాంప్ మీద మీద నడుస్తున్న వీడియో స్క్రీన్ షాట్ (సౌజన్యం : ఎక్స్/ లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఎడిటింగ్)

ఫ్యాక్ట్ చెక్స్

తీర్పు అబద్ధం

ఈ వీడియోని కృత్రిమ మేధా సంపత్తిని వాడి ఎడిట్ చేసి, ఎలెజాండ్రా తల్లెస్ అనే మోడల్ మొహానికి సోనాక్షి సిన్హా మొహాన్ని జోడించారు.

క్లెయిమ్ ఏమిటి?

సోనాక్షి  సిన్హాలా కనిపించే ఒక యువతి బంగారు రంగు బికినీ వేసుకుని ర్యాంప్ మీద నడుస్తున్న వీడియో ఒకటి సామాజిక మాధ్యమాలలో వైరల్ అయింది. ఈ కథనం రాసే సమయానికి ఈ వీడియోని ఫేస్బుక్ లో షేర్ చేసిన ఒక పోస్టుకు 42,000 వ్యూస్ మరియు 500 షేర్స్ ఉన్నాయి. ఆర్కైవ్ చేసిన ఇలాంటి పోస్టులని ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు. ఈ మధ్యకాలంలోనే సిన్హా నటుడు జహీర్ ఇక్బాల్ ని పెళ్లి చేసుకున్నారు.

వైరల్  అవుతున్న క్లెయిమ్ స్క్రీన్ షాట్ (సౌజన్యం : ఎక్స్/ యూట్యూబ్/లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఎడిటింగ్)

కానీ ఈ వీడియో డిజిటల్ గా ఎడిట్ చేయబడినది. ఒరిజినల్ వీడియోలో కనపడేది సిన్హా కాదు.

వాస్తవం ఏమిటి? 

వైరల్ వీడియోని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేస్తే “A Vision Supreme” అనే ఒక యూట్యూబ్ ఛానల్ లో జనవరి 7, 2024 నాడు షేర్ చేసినట్టుగా లభించింది (ఆర్కైవ్ ఇక్కడ). ఈ వీడియోలో వేరే ఒక మహిళా అదే బంగారు రంగు బికినీ ధరించి ఉంది. వీడియో కింద ఇచ్చిన వివరణలో, ఆమెను ఒక మోడల్ గా, ఆమె పేరు అలెజాండ్రా తల్లెస్ గా పేర్కొన్నారు. ఈ వీడియో, మియామీ లోని ఆర్ట్ బేసెల్ లో ఫ్యూషన్ ఫాషన్ ఈవెంట్స్ ఫాషన్ షో గా తెలియజేశారు.

దీని తరువాత గూగుల్ సెర్చ్ చేస్తే ఈ వీడియో కి సంబంధించిన మరింత నిడివి గల వీడియోని ఫిబ్రవరి 8 నాడు, 2024 లో ‘BME VISUALS’ (ఆర్కైవ్ ఇక్కడ) అనే ఒక యూట్యూబ్ ఛానల్ షేర్ చేసిందని తెలిసింది. వైరల్ వీడియో మాదిరి క్లిప్ 12:02 వాటర్ మార్క్ వద్ద చూడవచ్చు. ఈ వీడియో వివరణలో కుడా ఇది మియామీ ఆర్ట్ బేసెల్ 2023 షో లోనిది అని ‘కోకోనట్ బికినీ’ కోసం అని పేర్కొని ఉంది.

వైరల్ వీడియోని మరింత క్షున్నంగా పరీశీలిస్తే, ఇందులో సిన్హా మొహాన్ని ఒరిజినల్ వీడియో లో ఉన్న మోడల్ మొహం పై అతికించినట్టుగా గమించాము. ఉదాహరణకి, 0:03 వాటర్ మార్క్ వద్ద, సిన్హా మొహం పైన పడిన వెంట్రుకలు మసక గా కనిపిస్తాయి.

లోటుపాట్లను చూపిస్తున్న స్క్రీన్ షాట్ (సౌజన్యం : ఎక్స్/యూట్యూబ్)

మా పరిశోధన ప్రకారం, ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోని సూపర్ ఫేక్ అనే ఫేస్బుక్ యూజర్ (ఆర్కైవ్ ఇక్కడ) షేర్ చేసారు, దీనికి రెండు మిలియన్ల వ్యూస్ వచ్చాయి. ఆ అకౌంట్ బయోలో తాను ఒక “ఏఐ కంటెంట్ క్రియేటర్”  అని ఉంది . మేము ఆ యూజర్ ని కూడా సంప్రదించటం జరిగింది.  మాకు స్పందన వచ్చిన వెంటనే ఈ కథనం లో పొందుపరుస్తాము.

ఐఐటి జోధ్ పూర్ కి చెందిన ప్రొఫెసర్ మయాంక్ వత్సా తాయారు చేసిన ఒక డీప్ ఫేక్ డిటెక్షన్ టూల్, ఇతిజార్, కుడా ఈ వీడియో డీప్ ఫేక్ అని నిర్ధారించింది.

తీర్పు

సామాజిక మాధ్యమాలలో వైరల్ అవుతున్న వీడియో కృత్రిమ మేధా సంపత్తి ద్వారా ఎడిట్ చేసినది. ఒరిజినల్ వీడియోలో మియామీ కి చెందిన మోడల్ అక్కడ ఒక ఫాషన్ కార్యక్రమం లో పాల్గొన్న దృశ్యాలు ఉన్నాయి.

ఫ్యాక్ట్ చెక్ కోసం ఏదైనా క్లైమ్ మాకు సబ్మిట్ చేయదలుచుకుంటున్నారా లేదా మా సంపాదక బృందాన్ని సంప్రదించదలుచుకుంటున్నారా?

0 అంశాల వారీగా అన్వేషించండి

మన జీవితాలని ప్రభావితం చేసే నిర్ణయాలని మనం మనకి అందుబాటులో ఉన్న సమాచారం మేరకు తీసుకుంటాము. అయితే ఇంటర్నెట్ స్వభావరీత్యా తప్పుడు సమాచారం ఇప్పటివరకు కనీవినీ ఎరుగని రీతిలో ప్రజలకి చేరుతున్నది.