కంగనా రనౌత్ ని కొట్టిన సిఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ ఎక్స్ అకౌంట్ గా ఒక ఫేక్ అకౌంట్ చలామణి అవుతుంది

ద్వారా:
జూన్ 10 2024

ఈ కథనాన్ని షేర్ చెయ్యండి: facebook logo twitter logo linkedin logo
కంగనా రనౌత్ ని కొట్టిన సిఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ ఎక్స్ అకౌంట్ గా ఒక ఫేక్ అకౌంట్ చలామణి అవుతుంది

సిఐఎస్ఎఫ్ అధికారి కుల్విందర్ కౌర్ అకౌంట్ అంటూ ఫేక్ ఎక్స్ అకౌంట్ షేర్ అవుతున్న స్క్రీన్ షాట్ (సౌజన్యం : ఎక్స్/ లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఎడిటింగ్)

ఫ్యాక్ట్ చెక్స్

తీర్పు ఫేక్

ఆ అకౌంట్ ఒరిజినల్ అకౌంట్ కాదు, ఆ హ్యాండిల్ యూజర్ పేరు, ఇంతకు ముందు @SatyplamalikG అని ఉంది.

క్లైమ్ ఐడి 10ee2d80

క్లెయిమ్ ఏమిటి?

నటి మరియు రాజకీయవేత్త కంగనా రనౌత్ ని కొట్టిన సి ఐ ఎస్ ఎఫ్ (సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్) కానిస్టేబుల్ కుల్విందర్ కౌర్ కి చెందిన అకౌంట్ గా సామాజిక మాధ్యమాలలో ఒక ఎక్స్ అకౌంట్ వైరల్ అయింది. తాజాగా జరిగిన ఎన్నికలలో కంగనా హిమాచల్ ప్రదేశ్ లోని మండి నియోజకవర్గం నుండి పార్లమెంట్ సభ్యురాలిగా ఎన్నికైంది.

జూన్ 6 వ తేదీన, కంగనా 2020లో జరిగిన రైతు ఉద్యమం గురించి చేసిన వ్యాఖ్యలకు గాను ఆమెపై కుల్విందర్ కౌర్ చండీగఢ్ ఎయిర్ పోర్ట్ లో దాడి చేశారు. కంగనా రైతులను ఖలిస్తానికి మద్దతుదారులుగా పేర్కొన్నారు. ఖలిస్తాని అంటే, సిక్కులకు ప్రత్యేక దేశం కావాలని కోరే వారిని ఉద్దేశించి అనే మాట.

ఈ సంఘటన అనంతరం, ఒక ఎక్స్ అకౌంట్ @Kul_winderKaur అనే యూజర్ పేరుతో, ‘Kulvinder Kaur CISF’ అని కనిపించే పేరుతో సి ఐ ఎస్ ఎఫ్ కానిస్టేబుల్ ఫొటోని పెట్టుకుని ఎక్స్ లో చలామణి అయింది. ఆ ఘటన గురించి అనేక పోస్టులను రీపోస్టు చేస్తూ వచ్చింది. ఈ కథనం రాసే సమయానికి, ఆ అకౌంట్ కి 23,900 ఫాలోవర్లు ఉన్నారు. ఆ అకౌంట్ ఆర్కైవ్ ఇక్కడ చూడవచ్చు.

కుల్విందర్ కౌర్ ఎక్స్ అకౌంట్ గా చలామణి అవుతున్న అకౌంట్ స్క్రీన్ షాట్  (సౌజన్యం : ఎక్స్/ లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఎడిటింగ్)

కానీ ఆ అకౌంట్ ఫేక్. మా పరిశోధన ప్రకారం ఆ హ్యాండిల్ కి ఇంతకు ముందు యూజర్ పేరుగా, ‘@SatypalMalikG’ ఉంది.

వాస్తవం ఏమిటి?

ఆ అకౌంట్ కి సంబంధించిన పాత పోస్టులను మే మరియు జూన్ 2024 నెలలో చూడగా, ఆ అకౌంట్ హ్యాండిల్ పేరు ‘@SatypalMalikG’ అని ఉంది.

జూన్ 1, 2024 నాడు, ఆ అకౌంట్ న్యూస్ 24 ఛానల్ పబ్లిష్ చేసిన కథనాన్ని, రీపోస్టు చేసింది. మే నెలలో ఉన్న ఇతర పోస్టులు కుడా అదే యూజర్ పేరుతో ఉన్నాయి. దీని ద్వారా, ఆ అకౌంట్ పేరు @SatypalMalikG అని ఈమధ్య కాలం లో @Kul_winderKaur గా మారింది అని తెలుసుకున్నాము.

ఆ అకౌంట్ ఈ మధ్య చేసిన పోస్టుల స్క్రీన్ షాట్ (సౌజన్యం : ఎక్స్/ స్క్రీన్ షాట్)

ఆ తరువాత '@SatypalMalikG’ పేరు మీద  ఎక్స్ లో ఈ అకౌంట్ జరిపిన ఇంటరేక్షన్స్ కోసం చూసాము. ఇక్కడ కుల్విందర్ కౌర్ పేరుతో మోసం చేస్తున్న ప్రొఫైల్ కనిపించింది. 

(సౌజన్యం : ఎక్స్/ స్క్రీన్ షాట్)

ఆ అకౌంట్ పేరుతో వెతుకగా, కొన్ని స్పందనలలో అదే ప్రొఫైల్ మాకు లభించింది.

(సౌజన్యం : ఎక్స్/ స్క్రీన్ షాట్)

యూజర్ ఐ డి సరితూగింది !

ఈ రెండు అకౌంట్లకు సంబంధించి ఎక్స్ యూజర్లకు ప్రత్యేకంగా ఇచ్చే ఐడిని కూడా పరిశీలించాము. అది ఒకటే ఉంది - 1506590836267827200.

యూజర్ ఐడి చూపిస్తున్న స్క్రీన్ షాట్ (సౌజ్యన్యం : ఎక్స్/ వే బ్యాక్ మెషిన్)

తీర్పు : 

ఒక మోసపూరితమైన అకౌంట్ ఇది సిఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ కుల్విందర్ కౌర్ అకౌంట్ అంటూ ఎక్స్ లో ఫాలోవెర్లను పొందుతున్నారు, ఆ అకౌంట్ కి ఇంతకుముందు @SatyplamalikG అనే యూజర్ నేమ్ ఉంది.

(అనువాదం: రాజేశ్వరి పరసా)

ఈ వాస్తవ తనిఖీని చదవండి

English , తెలుగు

ఫ్యాక్ట్ చెక్ కోసం ఏదైనా క్లైమ్ మాకు సబ్మిట్ చేయదలుచుకుంటున్నారా లేదా మా సంపాదక బృందాన్ని సంప్రదించదలుచుకుంటున్నారా?

0
అంశాల వారీగా అన్వేషించండి

మన జీవితాలని ప్రభావితం చేసే నిర్ణయాలని మనం మనకి అందుబాటులో ఉన్న సమాచారం మేరకు తీసుకుంటాము. అయితే ఇంటర్నెట్ స్వభావరీత్యా తప్పుడు సమాచారం ఇప్పటివరకు కనీవినీ ఎరుగని రీతిలో ప్రజలకి చేరుతున్నది.