By: Anurag Baruah
నవంబర్ 22 2024
నవంబర్ 19, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ఒక రోజు ముందు, భారతీయ జనతా పార్టీ (బీజేపీ) తమ అధికారిక ఎక్స్ అకౌంట్ లో, అనేక ఆడియో క్లిప్పులను విడుదల చేసింది. వీటిని చూపుతూ, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు సుప్రియ సులే మరియు మహారాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు నానా పటోలే 2018 లో జరిగిన బిట్కాయిన్ ఫ్రాడ్ నుండి డబ్బును ప్రస్తుతం ఎన్నికలలో ఉపయోగిస్తున్నారు అంటూ ఆరోపించారు.
వైరల్ అవుతున్న క్లిప్ లో సులే, మెహతా తో ఈ విధంగా మాట్లాడుతున్నట్టుగా ఉంది, “బాస్, బిట్కాయిన్ రేటు ప్రస్తుతం మెరుగ్గా ఉంది, వాటిని ఇప్పుడు డబ్బుగా మారిస్తే బావుంటుంది. ఎలాగో ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి, డబ్బు అవసరం అవుతుంది. విచారణ గురించి ఆలోచించకండి, మనం ఒకసారి అధికారం లోకి వస్తే, అంత చుస్కోవచ్చు.”
కానీ లాజికల్లీ ఫ్యాక్ట్స్ పరిశోధన ప్రకారం, ఈ ఆడియో క్లిప్పులు ఫేక్, వీటిని కృత్రిమ మేధా సంపత్తి, అంటే ఏఐ ద్వారా తాయారు చేసి ఉండవచ్చు.
ఈ ఆడియో క్లిప్పుల అనంతరం, మాజీ ఐపిఎస్ ఆఫీసర్ రవీంద్రనాథ్ పాటిల్ కూడా ఇదే విధమైన ఆరోపణలు చేశారు. సులే మరియు పటోలే ఇద్దరు, 2018 బిట్ కాయిన్ కేసుకి సంబందించిన డబ్బును ప్రస్తుతం మహారాష్ట్ర ఎన్నికల నేపధ్యంలో వాడుతున్నారు అంటూ ఆరోపించారు.
పాటిల్, తన లేఖలో అప్పటి పూణే మాజీ కమీషనర్ అమితాబ్ గుప్తా, మరియు ఐపిఎస్ భాగ్యశ్రీ నవ్తాకే (అప్పటి డిప్యూటీ పోలీస్ కమీషనర్) కూడా ఈ మోసం లో పాలు పంచుకున్నట్టుగా పేర్కొన్నారు. పైగా, సులే, సారథి అసోసియేట్స్ అనే ఒక ఆడిట్ సంస్థ లో ఉద్యోగి గా పని చేసే, గౌరవ్ మెహతా ను సంప్రదించినట్టుగా పేర్కొన్నారు. గౌరవ్ మెహతా, ఈ 2018 బిట్ కాయిన్ కేసు లో ముఖ్య సాక్షి.
వైరల్ అవుతున్న నాలుగు ఆడియో క్లిప్పులలో, మెహతా మరియు గుప్తాకి మధ్య, సులే మరియు మెహతా, పటోలే మరియు గుప్త కి మధ్య సంభాషణలు వలే మనకు వినిపిస్తాయి (వాటి ఆర్కైవ్ ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు). సామాజిక మాధ్యమాలలో అనేక మంది యూజర్లు, బీజేపీ మద్దతుదారులు కూడా ఈ ఆడియో క్లిప్పులను షేర్ చేసి ఇది ఎన్నికల సమయంలో ఈ విధమైన మోసం జరుగుతుంది అంటూ రాసుకొచ్చారు.
వైరల్ ఆడియో క్లిప్పులను షేర్ చేసిన పోస్ట్ స్క్రీన్ షాట్ (సౌజన్యం : స్క్రీన్ షాట్స్/ఎక్స్/లాజికల్లీ ఫ్యాక్ట్స్ సవరణ)
మెహతా మరియు సులే ఉన్న ఆడియో క్లిప్పులు
సులే మరియు మెహతా మధ్య సంభాషణ అంటూ షేర్ చేయబడిన ఆడియో క్లిప్ లో, ఒక మహిళ గొంతు గౌరవ్ అనే వ్యక్తితో మాట్లాడటం మనకు వినిపిస్తుంది. ఇందులో ఆ మహిళ, ఎన్నికల సమయంలో బిట్కాయిన్ లను వినియోగించి డబ్బు ను అడుగుతున్నట్టు వినిపిస్తుంది. విచారణ గురించి భయపడ వద్దంటూ, అధికారం చేపట్టిన వెంటనే చూసుకోవచ్చంటూ మహిళ గౌరవ్ తో అనటం వినిపిస్తుంది.
కానీ లాజికల్లీ ఫ్యాక్ట్స్ పరిశోధనలో ఈ ఆడియో క్లిప్పులలో అనేక లోటుపాట్లు కనిపించాయి. మొదటిగా, పదానికి మరో పదానికి మధ్య అసహజంగా అంతరం ఉంది, ఇది తరచుగా, మనకు ఏఐ ద్వారా చేసిన ఆడియోలలో కనిపిస్తుంది. రెండవది, సహజంగా మానవ గొంతుకలో కనిపించే తీరు లేకుండా, ఈ ఆడియో క్లిప్పులు రోబో గొంతు లాగ ఒకే సరళి లో వెళ్తుంది. పైగా, సులే గొంతును, తన ఇతర ఇంటర్వ్యూల ద్వారా (ఆర్కైవ్ ఇక్కడ, ఇక్కడ) పోల్చి చూస్తే, అనేక వ్యత్యాసాలు మనకు కనిపించాయి. వీటి ద్వారా ఇది కల్పితమైనదని తెలియజేయవచ్చు.
లాజికల్లీ ఫ్యాక్ట్స్ కూడా భాగమైన ది మిస్ఇన్ఫర్మేషన్ కంబాట్ అల్లైన్స్ కు సంబంధించిన డీప్ఫెక్స్ ఎనాలిసిస్ యూనిట్ (డిఏయు) కూడా ఈ ఆడియో క్లిప్పులను ఇతరత్రా టూల్స్ ను వాడి పరిశీలించింది. అందులో కొన్ని టూల్స్, హైవ్ ఆడియో డిటెక్టర్, హియ ఏ ఐ వాయిస్ డిటెక్షన్, ట్రూ మీడియా మరియు డీప్ ఫేక్ ఓ మీటర్.
డీప్ ఫేక్ ఓ మీటర్, ఈ ఆడియో క్లిప్ ఏఐ ద్వారా రూపొందించడానికి అధిక శాతం అవకాశం ఉందని పేర్కొంది. ఇందులో వాడే అయిదు విభాగాలలో కూడా అధికశాతం లో అంటే 99.8, 100. 88.9, 77.7 మరియు 96 శతం వరకు ఏఐ అయిఉండొచ్చు అనే సంకేతాలను చూపించాయి.
హైవ్ ఆడియో డిటెక్టర్ కూడా ఇదే విధమైన ఫలితాలు ఇచ్చింది. ట్రూ మీడియా కూడా తన పూర్తి పరిశోధన తరువాత, ఈ ఆడియో కల్పితం అని తెలియజేయడానికి ఆధారాలు చూపించింది, ఆ టూల్ లో 100 శాతం ఇది ఏఐ అయి ఉండవచ్చు అని తెలిపింది, ఆడియో ప్రామాణికత స్కోర్ కూడా 97 శతం మరియు ఆంటీ స్పూఫింగ్ ఎనాలిసిస్ స్కోర్ 95 శాతం వచ్చింది.
ట్రూ మీడియా ఎనాలిసిస్ ఆడియో క్లిప్ (సౌజన్యం : స్క్రీన్ షాట్/ట్రూ మీడియా డిఏయు ద్వారా)
హియ ఏఐ వాయిస్ డిటెక్షన్ కూడా ఇది ఏఐ ద్వారా చేసి ఉండొచ్చు అని తెలిపింది, ఇందులో 3 శాతం మానవ సంకేతాలు ఉన్నట్టు పేర్కొంది.
పటోలే మరియు గుప్తా గా వైరల్ అవుతున్న ఆడియో
ఈ ఆడియో క్లిప్ ను బీజేపీ షేర్ చేసి, ఇందులో కాంగ్రెస్ మహారాష్ట్ర ప్రెసిడెంట్ నానా పటోలే ‘పోలీస్ కమీషనర్ అమితాబ్ గుప్తా ను డబ్బు కోసం ఒత్తిడి చేస్తున్నారు’ అంటూ రాసుకొచ్చారు. ఆ ఆడియో క్లిప్ లో ఒక పురుషిని గొంతు మాట్లాడుతూ, “అమితాబ్, నేను నిన్న అడిగిన డబ్బు సంగతి ఏమైంది?” అని అనటం వినపడుతుంది.
బీజేపీ తమ ఎక్స్ అకౌంట్ లో షేర్ చేసిన క్లిప్ (స్క్రీన్ షాట్/ఎక్స్/బీజేపీ)
మిస్ ఇన్ఫర్మేషన్ కంబాట్ అల్లైన్స్ తమ డీప్ ఫేక్ డిటెక్షన్ టూల్స్ వాడి కొన్ని ఆధారాలను మాత్రమే సేకరించింది. దీనికి రెండు కారణాలు, ఆడియో క్లిప్ పొడవు, దీని వలన టూల్ సామర్థ్యానికి ఆంక్ష గా మారింది, పైగా, మరాఠి సంభాషణను పూర్తిగా అర్ధం చేసుకోగలిగే నైపుణ్యం.
కానీ, పటోలే గొంతును ఇతర పాత ఇంటర్వ్యూలతో పోల్చి చుస్తే (వాటి ఆర్కైవ్ ఇక్కడ, ఇక్కడ) మనకి వ్యత్యాసాలు కనపడతాయి, దీని ద్వారా ఈ క్లిప్ కల్పితమని అర్ధమవుతుంది, ఇక్కడ వాడిన యాస కూడా వేరేగా ఉంది.
మెహతా మరియు గుప్త ఆడియో క్లిప్స్
బీజేపీ రెండు ఆడియో క్లిప్స్ సెట్ లను విడుదల చేసి ఇవి మెహతా మరియు గుప్త మధ్య సంభాషణ అంటూ షేర్ చేసారు. అందులో ఒక పురుషిని గొంతు మెహతా గొంతును పోలి ఉంది, ఆయన ఒక వ్యక్తిని సర్ అని మాట్లాడుతూ, “బిట్ కాయిన్ లావాదేవీల గురించి చింతించొద్దు… ఏదైనా విచారణ వస్తే … నమ్మండి మనల్ని ఎవరు పట్టుకోలేరు.”
ఇక్కడ కూడా మాట్లలలో ఏ విధమైన మోడ్యులేషన్ లేదు, ఇందులో మనిషి మాటలలో సహజంగా ఉండే అంతరం కూడా లేదు రోబో గొంతు లాగే ఉంది.
డిఏయు ఆడియో క్లిప్స్ ను పరిశీలించి, హియ ఏ ఐ వాయిస్ డిటెక్షన్ టూల్ ద్వారా ఇది ఏఐ ద్వారా చేసి ఉండొచ్చు అని తెలిపింది, పైగా, 14 శాతం మానవ సంకేతాలు ఉన్నట్టుగా తెలిపింది. ట్రూ మీడియా కూడా, ఈ ఆడియో క్లిప్ని కల్పించి ఉండొచ్చు అని ఆధారాలు చూపింది. హైవే ఆడియో డిటెక్టర్ కూడా, ఈ క్లిప్ ఏఐ ద్వారా తాయారు చేసి ఉండొచ్చు అని పేర్కొంది.
ఇందులో బీజేపీ పోస్ట్ చేసిన రెండవ క్లిప్ లో నాలుగు వేర్వేరు వాయిస్ నోట్స్ ఉన్నాయి, అందులో ఒకటి గుప్తా గొంతు అంటూ షేర్ చేసారు, గుప్త గొంతు మరో గౌరవ్ అనే వ్యక్తిని సంబోధించడం వినిపిస్తుంది, ఇతనిని బిట్ కాయిన్ ద్వారా డబ్బు సమకూర్చమని చెప్పటం వినపడుతుంది.
బీజేపీ తమ ఎక్స్ అకౌంట్ లో షేర్ చేసిన ఆడియో క్లిప్ (స్క్రీన్ షాట్/ఎక్స్/బీజేపీ)
ఇక్కడ, లక్ష్మి, భాగ్య శ్రీ, వినోద్ లాంటి హిందీ పేర్లు పలికే విధానం చూస్తే, ఇది ఏఐ ద్వారా తాయారు చేసి ఉండొచ్చు అని అర్ధమవుతుంది. పైగా, అసహజంగా ఆగడం, మరియు అవసరమైన చోట్ల ఆగకుండా చక చక మాట్లాడడం వంటివి చూస్తే ఏఐ అని అనిపిస్తుంది.
ఇంటర్వ్యూ లను ప్రసంగాలను (ఆర్కైవ్ ఇక్కడ, ఇక్కడ) గుప్తా తో పోల్చి చూస్తే, వైరల్ క్లిప్ లో ఉన్న గొంతు, ఒరిజినల్ వాయిస్ కు మ్యాచ్ అవ్వలేదు, యాస కూడా వేరే విధంగా ఉంది.
డిఏయు ఈ ఆడియో క్లిప్పులను పరిశీలించింది, ట్రూ మీడియా, ఈ క్లిప్ ఏఐ ద్వారా చేసి ఉండొచ్చు అనటానికి ఆధారాలు ఉన్నాయని తెలిపింది, హియ ఏఐ వాయిస్ డిటెక్షన్ కూడా ఈ ఆడియో ఏఐ ద్వారా తాయారు చేసినట్టు పేర్కొంది, పైగా, ఒక 4 శాతం మానవ సంకేతాలు ఉన్నట్టు తెలిపింది. అదే విధంగా హైవ్ ఆడియో డిటెక్టర్ కూడా ఈ ఆడియో ఏఐ అవ్వటానికి అధిక శాతం అవకాశం ఉందని పేర్కొన్నారు.
సులే మరియు పటోలే స్పందన
మంగళవారం నాడు సులే మాట్లాడుతూ, తనపై బిట్కాయిన్ కి సంబంధించి తప్పుడు దావా వేసినందుకు, తాను మెహతా మరియు పాటిల్ పై మహారాష్ట్ర లోని ఎలక్షన్ కమిషన్ అఫ్ ఇండియా కి ఎస్పి కి, సైబర్ క్రైమ్ కు మెహతా మరియు పాటిల్ పై ఫిర్యాదు నమోదు చేసినట్టు తెలిపారు. తాను చేసిన ఒక ఎక్స్ పోస్ట్ లో (ఆర్కైవ్ ఇక్కడ), కంప్లైంట్ కాపీ ని జత చేసారు, ఇందులో వాళ్ళు వేసిన నిందకు కావాలనే ఈ ఫేక్ గొంతును జత చేసి షేర్ చేసారంటూ పేర్కొన్నారు. ఆమె ఎఫ్ ఐ ఆర్ లో దీనిపై విచారణ జరపాలని కోరారు.
“ఇది నా గొంతు కాదు, అన్ని వాయిస్ నోట్స్ మరియు మెసేజ్లు ఫేక్”, అని సులే రిపోర్టర్లతో తెలిపారు. కాంగ్రెస్ లీడర్ పటోలే కూడా తాను చట్ట పరంగా ఈ విషయాన్నీ ఎదుర్కొంటానని తెలిపారు. పైగా బీజేపీ నాయకుడు సుధాన్షు త్రివేది మరియు ఇతరుల పై పరువు నష్టం దావా వేసినట్టు కూడా తెలిపారు. “వైరల్ అవుతున్న క్లిప్ లో గొంతు నాడు కాదు, ప్రధాని నరేంద్ర మోదీ కూడా నా గొంతును గుర్తుపడతారు,” అని మీడియా తో తెలిపారు.
కానీ, మహారాష్ట్ర డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అజిత్ పవార్ మాట్లాడుతూ, తాను ఆ ఆడియో క్లిప్పులలో గొంతును గుర్తుపట్టినట్టు తెలిపారు. అందులో తన బంధువు, సులే మరియు మాజీ సహా ఉద్యోగి గొంతు కలిసింది అంటూ పేర్కొన్నారు. “దీని పై విచారణ కొనసాగుతుంది, నిజం తొందర్లోనే బయటపడుతుంది,” అని ఆయన అన్నారు.
బీజేపీ అధికార ప్రతినిధి, సుధాన్షు త్రివేది, ఈ విషయం గురించి నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్లో మాట్లాడుతూ ఇతర కాంగ్రెస్ నాయకులు కూడా బిట్కాయిన్ మోసం లో పాలు పంచుకున్నారు అంటూ అడిగారు (ఆర్కైవ్ ఇక్కడ).
ఈమధ్య కలం లో, మెహతా రాయపూర్ ఇంటిలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సోదాలు నిర్వహించినట్టు కూడా కథనాలు ఉన్నాయి.
లాజికల్లీ ఫ్యాక్ట్స్ బీజేపీ లీడర్, సుధాన్షు త్రివేది ని స్పందన కోసం సంప్రదించింది, వచ్చిన వెంటనే, ఈ కథనం లో పొందుపరుస్తాము.
(అనువాదం : రాజేశ్వరి పరసా)